అన్వేషించండి

రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?

మారుతి బలెనో & హ్యుందాయ్ i20 టాప్‌ వేరియంట్ల ధరలు, ఇంజిన్‌, ఫీచర్లు, భద్రత & సాంకేతిక సదుపాయాల మధ్య పూర్తి పోలిక ఇదే.

Maruti Baleno vs Hyundai i20 Top Variants: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతి బలెనో & హ్యుందాయ్ i20 బాగా అమ్ముడుపోతున్నాయి. దశాబ్దానికి పైగా ఈ రెండు కార్లు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి. ఇటీవల, రెండు మోడళ్లలోనూ చాలా అప్‌డేట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో టాప్‌ వేరియంట్లైన Maruti Baleno Alpha(O) & Hyundai i20 Asta(O) అందించే ఫీచర్లు, ఇంజిన్‌ ఎంపికలు, భద్రతా సదుపాయాలను పరిశీలిద్దాం.

కొలతలు 
బలెనో కంటే i20 కొంచెం పొడవుగా & వెడల్పుగా ఉంటుంది. బలెనో పొడవు 3,990 మిల్లీమీటర్లు. i20 పొడవు 3,995 మిల్లీమీటర్లు. బలెనో వెడల్పు 1,745 మిల్లీమీటర్లు కాగా, i20 వెడల్పు 1,775 మిల్లీమీటర్లు. బలెనో ఎత్తు 1,530 మిల్లీమీటర్లు. i20 ఎత్తు 1,505 మిల్లీమీటర్లు. వీల్‌బేస్‌ బలెనోలో 2,520 మిల్లీమీటర్లు కాగా, i20లో 2,580 మిల్లీమీటర్లు. బూట్‌ స్పేస్‌ మాత్రం బలెనోలో 318 లీటర్లు. i20లో 311 లీటర్లు.

ఇంజిన్‌ 
రెండు కార్ల టాప్‌ వేరియంట్లలో 1.2 లీటర్‌ NA పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. బలెనోలో మూడు సిలిండర్లు ఉంటాయి. i20లో నాలుగు సిలిండర్లు ఉన్నాయి. బలెనో 83hp శక్తి & 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. i20 మాన్యువల్‌ వెర్షన్‌ 83hp శక్తిని ఇస్తుంది. CVT వెర్షన్‌లో శక్తి 88hpకు చేరుతుంది. i20 గరిష్ఠ టార్క్‌ 115Nm.

రెండు కార్లలోనూ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఉంది. బలెనోలో 5 స్పీడ్‌ AMT ఎంపిక లభిస్తుంది. i20లో CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉంది.

బయటి ఫీచర్లు
రెండు కార్లలో LED లైటింగ్‌, LED DRLలు & 16 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. పవర్‌ అడ్జస్టబుల్‌ & ఫోల్డింగ్‌ ORVMలు, వెనుక వైపర్‌ & వాషర్‌, షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా కూడా రెండింటిలో ఉన్నాయి.

బలెనోలో LED ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంపులు & LED ఫాగ్‌ ల్యాంపులు ఉన్నాయి. i20లో ఫాగ్‌ ల్యాంపులకు బదులుగా పుడిల్‌ ల్యాంపులు ఉన్నాయి. వీటికి వెల్‌కమ్‌ ఫంక్షన్‌ కూడా ఉంటుంది. రంగుల విషయంలో i20లో మోనోటోన్‌తో పాటు డ్యూయల్‌ టోన్‌ & మ్యాట్‌ ఫినిష్‌ ఎంపికలు ఉన్నాయి.

ఇంటీరియర్‌
i20లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఉంది. బలెనోలో 9 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. i20లో డిజిటల్‌ డయల్స్‌తో MID ఉంది. బలెనోలో అనలాగ్‌ డయల్స్‌తో MID ఉంటుంది.

బలెనో ప్రత్యేకతల్లో హెడ్‌ అప్‌ డిస్‌ప్లే & ముందు సీట్ల వెంటిలేషన్‌ ఉన్నాయి. i20లో సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌, 7 స్పీకర్ల బోస్‌ ఆడియో సిస్టమ్‌ & యాంబియంట్‌ లైటింగ్‌ ఉన్నాయి. బలెనోలో 6 స్పీకర్ల క్లారియన్‌ ఆడియో సిస్టమ్‌ ఉంటుంది. రెండు కార్లలో వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెనుక AC వెంట్స్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ & కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: లెవెల్‌ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్‌లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?

డ్రైవింగ్‌ ఫీచర్లు
i20లో స్పోర్ట్‌ & నార్మల్‌ డ్రైవ్‌ మోడ్‌లు ఉన్నాయి. బలెనోలో డ్రైవ్‌ మోడ్‌లు లేవు. అయితే బలెనోలో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ ఉంది. i20లో సాధారణ క్రూయిజ్‌ కంట్రోల్‌ మాత్రమే ఉంది.

భద్రత 
రెండు కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, TPMS, ఆటో డిమ్మింగ్‌ IRVM, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ & ESC ఉన్నాయి. బలెనోలో లెవల్‌ 2 ADAS ప్రత్యేకతగా ఉంది. ఇందులో లేన్‌ కీప్‌ అసిస్ట్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ & హై బీమ్‌ అసిస్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. i20లో ఫ్యాక్టరీ ఫిటెడ్‌ డాష్‌క్యామ్‌ ఉంది.

ధరలు 
బలెనో పెట్రోల్‌ మాన్యువల్‌ ధర రూ.9.60 లక్షలు. i20 పెట్రోల్‌ మాన్యువల్‌ ధర రూ.9.24 లక్షలు. అంటే i20 ధర రూ.36,000 మేర తక్కువ. ఆటోమేటిక్‌ వెర్షన్‌లో బలెనో ధర రూ.9.99 లక్షలు. i20 ధర రూ.10.43 లక్షలు. ఇక్కడ బలెనో కంటే i20 ధర రూ.44,000 మేర ఎక్కువ.

మొత్తంగా చూస్తే రెండు కార్లలోనూ ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. బలెనోలో హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, ముందు సీట్ల వెంటిలేషన్‌ & లెవల్‌ 2 ADAS ఉన్నాయి. i20లో సన్‌రూఫ్‌, బోస్‌ ఆడియో సిస్టమ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ & ఫ్యాక్టరీ ఫిటెడ్‌ డాష్‌క్యామ్‌ ఉన్నాయి. ధర, గేర్‌బాక్స్‌, ఫీచర్లు & భద్రత సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget