అన్వేషించండి

యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?

TVS అపాచీ, రోనిన్‌ బైకుల్లో కొత్త వేరియంట్లు వచ్చాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌, మ్యాప్స్‌ మిర్రరింగ్‌, టైప్‌-సి ఛార్జింగ్‌ వంటి కొత్త ఫీచర్లు అందించారు.

TVS Apache, Ronin Updates Telugu: యువతను ఆకట్టుకునేలా TVS మోటార్‌ కంపెనీ తన బైక్‌లను అప్‌డేట్‌ చేసింది. అపాచీ & రోనిన్‌ సిరీస్‌లో కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉన్న ఈ బైకుల్లో మరిన్ని టెక్నాలజీ ఫీచర్లను జోడించింది. అపాచీ RTR 160, RTR 160 4V, RTR 200 4V మోడళ్లలో కొత్త టాప్‌ వేరియంట్లు వచ్చాయి. రోనిన్‌ బైక్‌లోని వేర్వేరు వేరియంట్లలోనూ కొత్త సదుపాయాలు అందించారు.

అపాచీ సిరీస్‌ బైక్‌లు

అపాచీ RTR 160 కొత్త టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.28 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ వేరియంట్‌లో ట్రాక్షన్‌ కంట్రోల్‌ ఉంది. జారుడు రోడ్లపై బైక్‌ అదుపు తప్పకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. హజార్డ్‌ లైట్లు & LED ఇండికేటర్లను కూడా అందించారు. ఈ బైక్‌ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

అపాచీ RTR 160 4V కొత్త టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.41 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఇందులో మ్యాప్స్‌ మిర్రరింగ్‌ సదుపాయం ఉంది. దీంతో బైక్‌ డిస్‌ప్లేలోనే మ్యాప్‌ సమాచారాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. పానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌ కూడా ఇచ్చారు. అకస్మాత్తుగా బ్రేక్‌ వేసినప్పుడు వెనుక వచ్చే వాహనాలను అప్రమత్తం చేయడంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఉంది. ఈ మోడల్‌ నాలుగు రంగుల్లో లభిస్తుంది.

అపాచీ RTR 200 4V కొత్త టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఇందులోనూ మ్యాప్స్‌ మిర్రరింగ్‌, పానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌, టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి. అడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ USD ఫోర్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రైడర్‌ అవసరానికి అనుగుణంగా ఫోర్క్‌ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బైక్‌ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 200cc విభాగంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేసిన బైక్‌గా టీ.వీ.ఎస్‌ దీనిని పేర్కొంది.

కొత్త అపాచీ బైకుల డెలివరీలు ఈ పండగ సీజన్‌లో ప్రారంభం కానున్నాయి. దీంతో పండగ సమయంలో కొత్త బైక్‌ కొనాలనుకునే వారికి ఇవి మరో ఎంపికగా మారనున్నాయి.

RTR 310 & RR 310 బైకులకు కొత్త బ్లాక్‌ డైమండ్‌ ఎడిషన్లు వచ్చాయి. RTR 310 ధర రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). RR 310 ధర రూ.2.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ రెండు మోడళ్లలో కీ లెస్‌ గో సాంకేతికతను అందించారు. దీంతో తాళం ఉపయోగించకుండా బైక్‌ను ఆపరేట్‌ చేసే సౌలభ్యం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్‌... TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ ఇంటి ముందుంటుంది!

రోనిన్‌ సిరీస్‌ బైక్‌లు

రోనిన్‌ సిరీస్‌లోనూ TVS కొన్ని మార్పులు చేసింది. రోనిన్‌ బేస్‌+ వేరియంట్‌ ధర రూ.1.42 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఇందులో రెండు కొత్త రంగులను జోడించారు. డ్యూయల్‌ ఛానల్‌ ABS కూడా అందించారు.

మిడ్‌ స్పెక్‌ రోనిన్‌ ధర రూ.1.51 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఇందులో టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌, కనెక్టెడ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, డ్యూయల్‌ ఛానల్‌ ABS ఉన్నాయి. గోల్డ్‌ ఫినిష్‌తో కూడిన USD ఫోర్క్‌ను కూడా అందించారు.

టాప్‌ స్పెక్‌ రోనిన్‌ ధర రూ.1.63 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఇందులో ప్రీమియం సీటు, ట్రాక్షన్‌ కంట్రోల్‌, టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌ & అడ్జస్టబుల్‌ లీవర్లు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హెల్మెట్ బయట శుభ్రంగా ఉంటే సరిపోదు.. లోపల ఇలా క్లీన్ చేయకపోతే ఇబ్బందులే!
హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఆరోగ్య సమస్యలు!
మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్‌... TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ ఇంటి ముందుంటుంది!
యూత్‌ తెగ కొంటున్న టీవీఎస్‌ ఆర్బిటర్‌ స్కూటర్‌ను కేవలం రూ.2000 EMIతో మీరూ కొనొచ్చు
ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!
రూ.1 లక్ష దాటని టీవీఎస్ బైక్‌ లేదా స్కూటర్‌ కొనాలా? మీ బడ్జెట్‌ తగిన బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో!
రూ.3.60 లక్షల స్పాట్‌ క్యాష్‌తో Mahindra XUV 7XO మీదే! ఈజీ EMI ప్లాన్‌ ఎంచుకుంటే చాలు
కేవలం రూ.21,000 EMIతో Mahindra XUV 7XO మీ సొంతమవుతుంది! ఎన్నేళ్లు చెల్లించాలంటే?
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
SCENE Title Glimpse: 'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ  శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు
డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు BCCI శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
Abhishek Sharma Century Celebrations: 30 బంతుల్లోనే విధ్వంసంక సెంచ‌రీ, మెడిటేషన్ సెలబ్రేషన్ తో దుమ్మురేపిన‌ అభిషేక్ 
30 బంతుల్లోనే విధ్వంసంక సెంచ‌రీ, మెడిటేషన్ సెలబ్రేషన్ తో దుమ్మురేపిన‌ అభిషేక్ 
Embed widget