అన్వేషించండి

ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!

రూ.1 లక్షలోపు టీవీఎస్ బైక్స్ & స్కూటర్ల వివరాలు ఇవే. రైడర్, జూపిటర్, జూపిటర్ 125, స్పోర్ట్, రేడియన్, స్టార్ సిటీ ప్లస్ & XL 100 ధరలు చూడండి.

TVS Bikes Scooters Under Rs 1,00,000: ఈ పండుగ టైమ్‌లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని చూస్తున్నారా? బడ్జెట్ రూ.1 లక్షలోపేనా? అయితే TVS మోటార్ కంపెనీకి చెందిన 10 మోడళ్లు మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి కమ్యూటర్ బైక్‌ల నుంచి కుటుంబ అవసరాలకు సరిపోయే స్కూటర్ల వరకు టీవీఎస్ వివిధ మోడళ్లను ఆప్షన్లను అందిస్తోంది.

ప్రస్తుతం రూ.1 లక్షలోపు టీవీఎస్ ద్విచక్ర వాహనాల జాబితాలో రైడర్, జూపిటర్, జూపిటర్ 125, రేడియన్, స్పోర్ట్, స్టార్ సిటీ ప్లస్ & XL 100 వంటి మోడళ్లు ఉన్నాయి. ఆర్బిటర్ & ఎన్‌టార్క్ 125 మోడళ్లలో కొన్ని వేరియంట్లు కూడా రూ.1 లక్షలోపే ఉన్నాయి.

ముందుగా TVS Raider విషయానికి వస్తే, ఇది యువతను ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.83,410 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.99,620 వరకు ఉంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ లీటరుకు 56.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని పేర్కొనబడింది.

స్కూటర్ కొనాలనుకునే వారికి TVS Jupiter ఒక ఆప్షన్. దీని ధర రూ.73,400 నుంచి రూ.86,900 వరకు ఉంది. ఇందులో 113cc ఇంజిన్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మైలేజ్ 53.8 కిలోమీటర్లుగా ఉంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను రూపొందించారు.

ఇంకాస్త ఎక్కువ సామర్థ్యం ఉన్న స్కూటర్ కావాలంటే TVS Jupiter 125ను పరిశీలించవచ్చు. దీని ధర రూ.81,100 నుంచి రూ.89,940 వరకు ఉంది. 125cc ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మైలేజ్ 50 కిలోమీటర్లుగా ఉంది.

TVS Zest 110 కూడా రూ.1 లక్ష లోపు అందుబాటులో ఉన్న స్కూటర్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.70,850 నుంచి రూ.75,750 వరకు ఉంది. ఇది 110cc స్కూటర్. తక్కువ బడ్జెట్‌లో రోజువారీ ప్రయాణానికి స్కూటర్ కోరుకునేవారికి, ముఖ్యంగా మహిళలకు ఇది ఒక ఆప్షన్‌.

TVS Ntorq 125 కూడా ఈ జాబితాలో ఉంది. దీని ప్రారంభ ధర రూ.83,350. అయితే టాప్ వేరియంట్ ధర రూ.1.01 లక్షల వరకు ఉంటుంది. అంటే కొన్ని వేరియంట్లు మాత్రమే రూ.1 లక్ష బడ్జెట్‌లోకి వస్తాయి. ఇందులో 125cc ఇంజిన్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. మైలేజ్ 48.5 కిలోమీటర్లుగా ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునేవారికి TVS Orbiter ఒక ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.88,250. అయితే టాప్ వేరియంట్ ధర రూ.1.05 లక్షల వరకు ఉంది. ఇందులో 1.8 కిలోవాట్ అవర్ నుంచి 3.1 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల నుంచి 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది.

ఇది కూడా చదవండి: హై మైలేజ్‌ కారు వ్యాగన్‌ ఆర్‌.. నెలకు రూ.8,200 EMIతో! ఎంత లోన్‌ తీసుకోవాలి, ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?

బాగా తక్కువ ధరలో బైక్ కావాలనుకునేవారికి TVS Radeon అందుబాటులో ఉంది. దీని ధర రూ.55,400 నుంచి రూ.78,200 వరకు ఉంది. 

TVS Sport ధర రూ.55,500 నుంచి రూ.57,500 వరకు ఉంది. ఇది 110cc ఇంజిన్‌తో వస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. మైలేజ్ 80 కిలోమీటర్లుగా పేర్కొనబడింది.

TVS Star City Plus ధర రూ.72,500 నుంచి రూ.75,200 వరకు ఉంది. ఇందులో 110cc ఇంజిన్ & మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్నాయి. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

ఇక TVS XL 100 ప్రత్యేకమైన మోడల్. ఇది రోజువారీ అవసరాలకు, చిన్న వ్యాపార అవసరాలకు ఉపయోగపడే మోపెడ్. దీని ధర రూ.45,350 నుంచి రూ.61,360 వరకు ఉంది.

కాబట్టి రూ.1 లక్షలోపు టీవీఎస్ వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి బడ్జెట్, వినియోగం & ఇంధన అవసరాలను బట్టి పలు ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ బైక్ కావాలంటే రైడర్, స్పోర్ట్, రేడియన్ & స్టార్ సిటీ ప్లస్ ఉన్నాయి. స్కూటర్ కావాలంటే జూపిటర్, జూపిటర్ 125 & ఎన్‌టార్క్ 125 ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనం కావాలంటే ఆర్బిటర్‌ను పరిశీలించవచ్చు.

గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ఎక్స్-షోరూమ్ ధరలు. వేరియంట్, నగరం & ఇతర ఛార్జీలను బట్టి తుది ధర మారవచ్చు.

ఇది కూడా చదవండి: Honda SP 125 EMI: హోండా SP 125 ఆన్‌రోడ్ ధర ఎంత, లోన్‌ ఎంత వస్తుంది, EMI ఎంత కట్టాలి?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget