అన్వేషించండి

హెల్మెట్ బయట శుభ్రంగా ఉంటే సరిపోదు.. లోపల ఇలా క్లీన్ చేయకపోతే ఇబ్బందులే!

రోజూ హెల్మెట్ వాడేవారు దాని లోపలి ప్యాడింగ్ పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. హెల్మెట్‌ను శుభ్రం చేయడం, ఆరబెట్టడం & దుర్వాసన తగ్గించే చిట్కాలు ఇవే.

Helmet Cleaning Tips In Telugu: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి. ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, దానిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే అవసరం. చాలామంది హెల్మెట్‌ను బయట వైపు మాత్రమే శుభ్రం చేస్తుంటారు. లోపల ఉండే ప్యాడింగ్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోరు.

రోజూ హెల్మెట్ పెట్టుకునే వారికి తలపై చెమట పడుతుంది. జుట్టులోని నూనె, దుమ్ము & ఇతర పదార్థాలు కూడా హెల్మెట్ లోపలి భాగానికి చేరతాయి. ముఖ్యంగా హెల్మెట్‌లోని ప్యాడింగ్ వీటిని పీల్చుకుంటుంది. కొంతకాలం తర్వాత అక్కడ తేమ పేరుకుపోతుంది. దీంతో దుర్వాసన రావడంతో పాటు అసౌకర్యం కూడా కలగవచ్చు.

వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఉష్ణోగ్రతలు పెరగడంతో తలకు ఎక్కువగా చెమట పడుతుంది. వర్షాకాలంలోనూ ఇబ్బంది తప్పదు. వర్షంలో హెల్మెట్ తడిస్తే లోపలి భాగం త్వరగా ఆరకపోవచ్చు. తడిగా ఉన్న హెల్మెట్‌ను వెంటనే బ్యాగులో పెట్టేస్తే లోపల తేమ అలాగే ఉండిపోతుంది.

హెల్మెట్‌లో దుర్వాసన వచ్చినప్పుడు చాలామంది సులభమైన మార్గాన్ని ఎంచుకుంటారు. పెర్ఫ్యూమ్, డియోడరెంట్ వంటి స్ప్రేలు కొడతారు. దీంతో కొంతసేపు వాసన తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ప్యాడింగ్‌లో చేరిన చెమట, నూనె & దుమ్ము తొలగవు. కాబట్టి వాసనను కప్పిపుచ్చడం కంటే హెల్మెట్‌ను శుభ్రం చేయడం ముఖ్యం.

ఇలా శుభ్రం చేయండి..

చాలా ఆధునిక హెల్మెట్లలో లోపలి లైనర్ & చెంపల ప్యాడ్లను తొలగించే సౌకర్యం ఉంటుంది. వీటిని తయారీదారు సూచనల ప్రకారం శుభ్రం చేయాలి. సాధారణంగా మృదువైన సబ్బు లేదా తేలికపాటి షాంపూతో ప్యాడింగ్‌ను శుభ్రం చేయవచ్చు. గట్టిగా రుద్దడం మాత్రం మంచిది కాదు. ప్యాడింగ్‌ను మెలిపెట్టడం వల్ల దాని ఆకారం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

శుభ్రం చేసిన తర్వాత ప్యాడింగ్‌లోని నీటిని మెల్లగా తొలగించాలి. ఆ తర్వాత నీడలో, గాలి బాగా వచ్చే ప్రదేశంలో పూర్తిగా ఆరబెట్టాలి. ప్యాడింగ్ తడిగా ఉన్నప్పుడే హెల్మెట్‌లో తిరిగి అమర్చకూడదు. ఎండలో నేరుగా పెట్టి ఆరబెట్టడం కూడా మంచిది కాదు.

కొన్ని హెల్మెట్లలో లోపలి ప్యాడింగ్‌ను తొలగించలేం. అలాంటి వాటిని నీటిలో పూర్తిగా ముంచకూడదు. తక్కువ తేమ ఉన్న మృదువైన వస్త్రంతో లోపలి భాగాన్ని జాగ్రత్తగా తుడవాలి. హెల్మెట్ తయారీదారు సూచించిన శుభ్రపరిచే విధానాన్ని మాత్రమే పాటించాలి. శుభ్రం చేసిన తర్వాత హెల్మెట్‌ను పూర్తిగా ఆరనివ్వాలి.

ఇది కూడా చదవండి: మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్‌... TVS Orbiter ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ ఇంటి ముందుంటుంది!

మరికొన్ని సూచనలు

ప్రయాణం పూర్తయిన వెంటనే హెల్మెట్‌ను మూసివేసిన బ్యాగులో పెట్టకండి. కొంతసేపు గాలి తగిలేలా ఉంచండి. దీంతో లోపల ఏర్పడిన తేమ తగ్గుతుంది. వర్షంలో హెల్మెట్ తడిస్తే కూడా ఇదే విధంగా పూర్తిగా ఆరబెట్టాలి.

తడి జుట్టుతో హెల్మెట్ పెట్టుకోవడం కూడా తగ్గించాలి. వీలైతే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే హెల్మెట్ ధరించాలి. అలాగే తలకు ఎక్కువగా నూనె రాసుకుని వెంటనే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్యాడింగ్‌కు నూనె అంటుకునే అవకాశం ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం. ఇతరులతో హెల్మెట్ పంచుకోవడం మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకరి హెల్మెట్ ఉపయోగించాల్సి వస్తే దాని పరిశుభ్రతను ముందుగా చూసుకోవాలి. ఉతికి మళ్లీ ఉపయోగించగల పలుచని బ్రీతబుల్ క్యాప్‌ను హెల్మెట్‌తో పాటు ధరించడం కూడా మంచి ఆలోచన. దీంతో చెమట నేరుగా ప్యాడింగ్‌కు చేరకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.

హెల్మెట్ భద్రత కోసం మాత్రమే కాదు. దాని పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టడం కూడా అవసరం. బయట భాగం మెరిసేలా ఉంచడం ఎంత ముఖ్యమో, లోపలి ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. రోజూ ఉపయోగించే హెల్మెట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించి, అవసరమైనప్పుడు శుభ్రం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే భద్రతతో పాటు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఆఫీస్‌ లేదా కాలేజీకి వెళ్లడానికి రూ.లక్ష లోపు వచ్చే TVS టూవీలర్లు.. ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget