అన్వేషించండి

Mahindra XUV700 ఫేస్‌లిఫ్ట్‌ పేరు Mahindra XUV 7XO - జనవరి 5న భారీ ఎంట్రీ; కొత్త డిజైన్‌, మూడు స్క్రీన్లు

మహీంద్రా & మహీంద్రా, XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా XUV 7XO గా ప్రకటించింది. కొత్త హెడ్‌ల్యాంప్స్‌, రీడిజైన్‌ గ్రిల్‌, మూడు స్క్రీన్ల సెటప్‌ వంటి అప్‌డేట్‌లతో గ్రాండ్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది.

Mahindra XUV700 Facelift -  Mahindra XUV 7XO: మహీంద్రా & మహీంద్రా, ఎట్టకేలకు, XUV700 ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన సస్పెన్స్‌కు తెర దించింది. ఈ మోడల్‌కు XUV 7XO అనే కొత్త పేరు పెట్టినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే, 2026 జనవరి 5న ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌ ICE SUV గ్రాండ్‌గా డెబ్యూ అవుతుంది. ఇప్పటికే XUV3XOతో ప్రారంభించిన కొత్త నేమింగ్‌ ట్రెండ్‌లో ఇది రెండో భారీ మోడల్‌. ఈసారి మహీంద్రా డిజైన్‌, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో స్పష్టమైన అప్‌గ్రేడ్స్‌ ఇచ్చినట్టు టీజర్లు చెబుతున్నాయి.

కొత్త డిజైన్‌లో షార్ప్‌ అప్‌డేట్‌లు
మహీంద్రా విడుదల చేసిన మొదటి టీజర్‌లో... 7-ఆకారంలో ఉండే షార్ప్‌ DRLs, ట్రపీజాయిడ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, కొత్త స్లాటెడ్‌ గ్రిల్‌ లుక్‌ చూపించారు. ఇవి మొత్తం చూస్తే XEV 9S మోడల్‌ స్పూర్తితో రూపొందించినట్టు అనిపించినా, XUV 7XOకి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చేలా కనిపిస్తాయి.

తాజా స్పై షాట్స్‌ ప్రకారం, బాడీ షీట్‌ మెటల్‌లో పెద్ద మార్పులు లేవు. అంటే, ఇప్పటికే ప్రజాదరణ పొందిన XUV700 సిల్హౌట్‌ని అలాగే కొనసాగిస్తున్నారు. కానీ ఫ్రంట్‌, రియర్‌ లైటింగ్‌ ఎలిమెంట్స్‌లో మాత్రం పూర్తిగా కొత్త స్టైల్‌ కనిపిస్తుంది.

క్యాబిన్‌లో మూడు స్క్రీన్ల హై-టెక్‌ సెటప్‌
ఇంటీరియర్‌ విషయంలో మహీంద్రా గట్టి మార్పులు చేసినట్టు ఆటో రంగంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా XEV 9e, 9S మోడల్స్‌లో ఉన్న ట్రిపుల్‌ స్క్రీన్‌ సెట్‌అప్‌ XUV 7XOలో కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్‌ డిస్‌ప్లే, సెంటర్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, కో-డ్రైవర్‌ స్క్రీన్‌లతో అత్యాధునిక డిజిటల్‌ అనుభవం ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టుంది.

సీటింగ్‌ లేఅవుట్‌లో 6-సీటర్‌ & 7-సీటర్‌ ఆప్షన్‌లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 5-సీటర్‌ వచ్చే అవకాశంపై మాత్రం క్లారిటీ లేదు.

ఇంజిన్‌ ఆప్షన్‌ల్లో మార్పులు లేవు
మార్కెట్‌కు బాగా పరిచయమైన 2.0-లీటర్‌ టర్బో పెట్రోల్‌, 2.2-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌లు ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా కొనసాగుతాయి. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లు అలాగే ఉంటాయి. డీజిల్‌ వేరియంట్‌లో AWD ఆప్షన్‌ కూడా XUV700లాగే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ పవర్‌ట్రైన్లు పనితీరు, శక్తిమంతమైన రెస్పాన్స్‌, కంఫర్ట్‌ విషయంలో ఇప్పటికే మంచి టాక్‌ తెచ్చుకున్నాయి కాబట్టి, మహీంద్రా ఇక్కడ పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

ఎంత ఉండొచ్చు ధర - AP & TG కొనుగోలుదారులకు కీలక సమాచారం
ప్రస్తుతం XUV700 ధరలు ₹13.66 లక్షల నుంచి ₹23.71 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్‌-షోరూమ్‌). XUV 7XO మరికొంత ఎక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఈ బండికి హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో డిమాండ్‌ భారీగా ఉన్నందున, ప్రారంభ ధరలే చర్చకు వస్తాయి. ప్రత్యేకంగా 7-సీటర్‌ కుటుంబ SUV సెగ్మెంట్‌లో ఇది Tata Safari, MG Hector, Hyundai Alcazar వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది.

XUV700 ఇప్పటికే మార్కెట్‌లో మంచి పేరు సంపాదించగా... దానికి టెక్‌, డిజైన్‌, ప్రీమియం ఫీల్‌ అప్‌డేట్‌లు జోడించి XUV 7XOగా తీసుకురావడం మహీంద్రా వేస్తున్న పెద్ద అడుగు. ఇప్పుడు అందరి చూపు జనవరి 5 లాంచ్‌పైనే ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైన SUV కొనాలనుకునే వారికి ఇది ఒక బలమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget