అన్వేషించండి

కొత్త కలర్‌ థీమ్‌తో మార్కెట్‌లోకి దిగిన TVS Ronin Agonda Edition - ధర ₹1.31 లక్షలే

గోవా అగొండా బీచ్‌ నుంచి ప్రేరణ పొందిన TVS Ronin Agonda Edition లాంచ్‌ అయింది. కొత్త వైట్‌-బ్లూ-రెడ్‌ కలర్‌ స్కీమ్‌తో వచ్చిన ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర ₹1.31 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

TVS Ronin Agonda Edition Specs: టీవీఎస్‌ కంపెనీ, తాజాగా, గోవా అగొండా బీచ్‌ స్పూర్తితో రూపొందించిన కొత్త లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ బీచ్‌ పేరే దీనికి కూడా అదే పెట్టింది - TVS Ronin Agonda Edition. ఈ ఎడిషన్‌ TVS MotoSoul 2025 ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Ronin ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారైన మొదటి లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇదే కావడం కూడా ఆసక్తికర అంశం.

ధర
ముందుగా ధర విషయానికి వస్తే, ఈ ప్రత్యేక ఎడిషన్‌ ₹1.31 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ వద్ద లభిస్తుంది. ఇది బేస్‌ Ronin కంటే ₹5,000 మాత్రమే ఎక్కువ. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో కూడా ఈ మోడల్‌ ఈ నెలాఖరుకు షోరూమ్‌లకు చేరుకోనుంది.

కొత్త కలర్‌ స్కీమ్‌ ప్రధాన ఆకర్షణ
Ronin Agonda Editionలో ముఖ్యంగా చూపులు ఆకర్షించేది దాని పెయింట్‌ థీమ్‌. ఇందులో వైట్‌ బేస్‌పై క్లాసిక్‌ బ్లూ, రెడ్‌ పిన్‌ స్ట్రైప్స్‌ ట్యాంక్‌పై షార్ప్‌గా కనిపిస్తాయి. ట్యాంక్‌ మీద ఉన్న ప్రత్యేక Agonda బ్యాడ్జ్‌ దీనికి అదనపు అందాన్ని జత చేస్తుంది. అదనంగా కొత్త డిజైన్‌తో సీటు కవర్‌ కూడా ఈ ఎడిషన్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఈ కలర్‌ కాంబినేషన్‌ యువత, టూరింగ్‌ రైడర్స్‌ ఇద్దరికీ ఆకర్షణీయంగా అనిపించేలా ఉంది. గోవా అగొండా బీచ్‌ నిశ్శబ్దాన్ని, అక్కడి ప్యూర్‌ ఎస్తేటిక్‌ను మోటార్‌సైకిల్‌లో ప్రతిబింబించాలని TVS చేసిన ప్రయత్నం బైక్‌ని చూస్తూనే తెలుస్తుంది.

ఇంజిన్‌, పనితీరు - ఇప్పటికే నిరూపించుకున్న అదే శక్తి
డిజైన్‌లో కొత్తదనం ఉన్నా, ఇంజిన్‌ భాగం మాత్రం బేస్‌ Ronin‌ లాగే ఉంటుంది. ఇందులో

225.9cc సింగిల్‌-సిలిండర్‌, ఆయిల్‌-కూల్‌డ్‌ ఇంజిన్‌

20.4hp శక్తి @ 7,750rpm

19.9Nm టార్క్ @ 3,750rpm

5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌

స్లిప్పర్‌ & అసిస్ట్‌ క్లచ్‌

లాంటివన్నీ లభిస్తాయి. పట్టణ రైడింగ్‌కైనా, వీకెండ్‌ రైడ్‌లకైనా సరిపోయే శక్తిమంతమైన ఇంజిన్‌ సెటప్‌ ఇది.

ఫీచర్లు - బేస్‌ వెర్షన్‌ ఆధారంగా
Agonda Edition బేస్‌ Ronin‌పై ఆధారపడి ఉండటంతో, ఇందులో సింగిల్‌-ఛానల్‌ ABS, బ్లూటూత్‌ కనెక్టివిటీతో వచ్చిన LCD కన్సోల్‌ లాంటి ఆప్షన్లు మాత్రమే లభిస్తాయి. అయితే డ్యూయల్‌-ఛానల్‌ ABS, అడ్జస్టబుల్‌ లీవర్స్‌, గోల్డెన్‌ USD ఫోర్క్‌ వంటి ఫీచర్లు మాత్రం ఈ ఎడిషన్‌లో లేవు. అంటే... ఇది ఫీచర్ల కంటే స్టైల్‌ & ఎక్స్‌క్లూజివిటీని ప్రధానంగా చూపించే ఎడిషన్‌ అని అర్థం.

ఎవరికి బాగా సరిపోతుంది?
స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చే యువ రైడర్స్‌కి, అందరూ కళ్లప్పగించి చూసేలా తమ బైక్‌ ఉండాలని కోరుకునే వాళ్లకు TVS Ronin Agonda Edition బాగా నప్పుతుంది. పెర్ఫార్మెన్స్‌ విషయంలో Ronin ప్లాట్‌ఫామ్‌ ఇప్పటికే తన సత్తా నిరూపించుకుంది. అందుకే ప్రత్యేక లుక్స్‌ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

తెలుగు రాష్ట్రాల్లో దీని స్థానమేంటి?
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ మార్కెట్లలో Ronin సిరీస్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. కొత్త Agonda Edition ఈ సిరీస్‌కి ఒక ప్రత్యేకతను జోడిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని యువత ఈ కలర్‌ స్కీమ్‌ను బాగా ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి.

కొత్త TVS Ronin Agonda Edition పెద్ద ఫీచర్‌ అప్‌డేట్‌లు లేకపోయినా, లుక్‌, ఫీలింగ్‌, స్టైల్‌ విషయంలో మాత్రం పూర్తిగా ప్రత్యేకమైన మోటార్‌సైకిల్‌. Ronin సిరీస్‌ని కొంచెం డిఫరెంట్‌గా ఆస్వాదించాలనుకునేవాళ్లకు ఇది సరైన ఆప్షన్‌.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget