Mahindra XUV 3XO Bookings: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో బుకింగ్స్ షురూ - రూ.21 వేలు కడితే చాలు!
Mahindra XUV 3XO Sale: ప్రముఖ కార్ల బ్రాండ్ మహీంద్రా ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు.
Mahindra XUV 3XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మహీంద్రా లాంచ్ చేసిన ఈ కారు బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు అధికారిక బుకింగ్ నేటి (మే 15వ తేదీ) నుంచి ప్రారంభం అయింది. మే 26వ తేదీ నుంచి కంపెనీ ఈ కార్లను డెలివరీ చేయనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో బుకింగ్ ధర ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాహనాలకు గట్టి పోటీనిస్తోంది. మహీంద్రా ఈ కారు టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌లకు ప్రత్యర్థి కారు. ఈ కారు బుకింగ్‌ను అధికారిక డీలర్‌షిప్ ద్వారా చేయవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ బుకింగ్ ధర రూ.21 వేలుగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ధర రూ.7.49 లక్షల నుంచి మొదలై రూ. 15.49 లక్షల వరకు ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఫీచర్లు...
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో అప్‌డేట్ చేసిన డిజైన్, అనేక తాజా ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారులో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ కారు పవర్‌ట్రెయిన్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 లాగా ఉంచారు. ఈ ఎస్‌యూవీ ముందు ప్రొఫైల్ మార్చారు. కారు ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇన్‌వర్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో ఇన్వర్టెడ్ రేడియేటర్ గ్రిల్ జోడించారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇంటీరియర్స్...
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. ఈ కారులో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ కారు లోయర్ వేరియంట్‌లలో సింగిల్ పేన్ సన్‌రూఫ్ అందించారు. ఈ మహీంద్రా కారులో లెవెల్ 2 ఏడీఏఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ట్రాన్స్‌మిషన్‌కు మాన్యువల్, ఏఎంటీ రెండు యూనిట్లను జోడించే అవకాశం ఉంది.
Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పవర్‌ట్రైన్... మహీంద్రా ఎక్స్‌యూవీ300 లానే ఉంది. మహీంద్రా కొత్త కారు ఇంజన్ మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 109 బీహెచ్‌పీ పవర్‌ని, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మహీంద్రా కారులో 1.2 లీటర్ టీజీడీఐ ఇంజన్ కూడా ఉంది. ఇది 129 బీహెచ్‌పీ పవర్‌ని, 230 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ రెండు ఇంజిన్లతో పాటు మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?