అన్వేషించండి

Mahindra Offer: మహీంద్రా సంచలనం: బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్ పై బై-బ్యాక్ ఆఫర్ !

Mahindra Offer: లిమిటెడ్ ఎడిషన్ విషయంలో మాట తప్పినందుకు కస్టమర్ల నుండి వచ్చిన విమర్శలతో మహీంద్రా తన బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్ కార్లను తిరిగి కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత ఆటోమోటివ్ చరిత్రలో ఇలాంటి బై-బ్యాక్ ఆఫర్ ఇదే మొదటిసారి.

Mahindra Offer: ప్రముఖ డొమెస్టిక్ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా, తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'బీఈ 6' (BE 6) బ్యాట్‌మాన్ ఎడిషన్ విషయంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేవలం 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పి, రెండో బ్యాచ్‌ను కూడా మార్కెట్లోకి వదలడంతో పాత కస్టమర్ల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, తమ కారు కొనుగోలు పట్ల అసంతృప్తిగా ఉన్న యజమానుల నుండి వాహనాలను తిరిగి కొనుగోలు (Buy-Back) చేస్తామని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

అస‌లేమైందంటే..?

మహీంద్రా గతేడాది ఆగస్టులో బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌ను 'లిమిటెడ్ రన్' మోడల్‌గా లాంచ్ చేసింది. అప్పట్లో కేవలం 999 యూనిట్లు మాత్రమే తయారు చేస్తామని ప్రకటించడంతో, బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. అయితే, సరిగ్గా ఏడు నెలల తర్వాత అంటే 2026 మార్చి 6న, మళ్లీ మరో 999 యూనిట్లతో రెండో బ్యాచ్‌ను కంపెనీ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ కన్నా ధర రూ. 70,000 పెంచినప్పటికీ, ఇవి కూడా కేవలం ఏడు నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. కానీ, 'లిమిటెడ్ ఎడిషన్' అని నమ్మి కొన్న పాత కస్టమర్లు తమ కారు వాల్యూ తగ్గిపోయిందని భావించి సోషల్ మీడియాలో కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బై-బ్యాక్ ఆఫర్ నిబంధనలు

కస్టమర్ల నుండి వచ్చిన వ్యతిరేకతను గమనించిన మహీంద్రా యాజమాన్యం, మార్చి 18 నుండి 30 రోజుల పాటు బై-బ్యాక్ విండోను ఓపెన్ చేస్తోంది. తమ కారును తిరిగి ఇచ్చేయాలనుకునే యజమానులు సంబంధిత డీలర్‌షిప్‌ను సంప్రదించి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ స్పెషల్ ఎడిషన్ బీఈ 6 లోని 'ప్యాక్ త్రీ' (Pack Three) వేరియంట్ ఆధారంగా రూపొందింది. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఈ అసామ‌న్య‌మైన‌ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే తొలిసారి..!

సాధారణంగా లిమిటెడ్ ఎడిషన్ కార్లకు ఉండే క్రేజ్ వాటి అరుదైన లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. మహీంద్రా రెండో బ్యాచ్ తీసుకురావడంతో ఆ ప్రత్యేకత దెబ్బతిందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక బ్రాండ్‌గా కస్టమర్లతో ఉన్న సంబంధాన్ని దెబ్బతినకుండా చూసుకోవడానికి ఈ బై-బ్యాక్ ఆఫర్ ఒక సాహసోపేతమైన అడుగుగా అభివ‌ర్ణిస్తున్నారు. ఇప్పటివరకు భారత ఆటోమొబైల్ హిస్టరీలో ఒక కంపెనీ ఇలాంటి కారణంతో కార్లను తిరిగి కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

భారత ఆటోమొబైల్ చరిత్రలో మహీంద్రా BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకత ఏమిటి?

ఒక కంపెనీ 'లిమిటెడ్ ఎడిషన్' మోడల్ విషయంలో ఇలాంటి కారణంతో కార్లను తిరిగి కొనుగోలు చేయడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Turbo Engine Maintenance: టర్బో ఇంజిన్‌ కార్‌ మైలేజీ, పెర్ఫార్మెన్స్‌ బాగుండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!
మీ కారులో టర్బో ఇంజిన్‌ ఉందా? ఈ చిన్న తప్పులు చేయొద్దు, లేదంటే భారీ ఖర్చులు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget