అన్వేషించండి

Mahindra XEV 9S: ఏ వేరియంట్‌ బెస్ట్‌? బడ్జెట్‌, ఫీచర్ల ఆధారంగా క్లియర్ రికమెండేషన్

Mahindra XEV 9S మూడు బ్యాటరీ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లు, విస్తృత ఫీచర్లతో వచ్చింది. బడ్జెట్‌, అవసరాలు, ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని ఏ వేరియంట్‌ బెస్ట్‌ అనేది సింపుల్‌గా వివరించాం.

Mahindra XEV 9S Variant Guide: భారతదేశపు తొలి ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ 3-రో SUV అయిన మహీంద్రా XEV 9S అధికారికంగా లాంచ్ అయింది. ఎక్స్‌-షోరూమ్‌లో ధరలు ₹19.95 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఈ ధర Mahindra BE 6 కన్నా కాస్త ఎక్కువగా, XEV 9e కన్నా కాస్త తక్కువ రేంజ్‌లో ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది.

Mahindra XEV 9S SUVలో మూడు బ్యాటరీ ఆప్షన్లు (59kWh, 70kWh, 79kWh), నాలుగు వేరియంట్లు (Pack One Above, Pack Two Above, Pack Three, Pack Three Above) అందుబాటులో ఉన్నాయి. అయితే అసలు ప్రశ్న - ఏ వేరియంట్‌ కొనడం లాభం? ఇదే విషయాన్ని ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం సింపుల్‌గా, వివరంగా తెలుసుకుందాం.

బ్యాటరీ ఆప్షన్లు - మీకు ఏది సరిపోతుంది?

59kWh బ్యాటరీ - ఎంట్రీ-లెవల్ Pack One Above లో మాత్రమే

సాధారణ సిటీ-రేంజ్‌, ఫ్యామిలీ యూజ్‌కు సరిపోతుంది.

తక్కువ బడ్జెట్ లో 7-సీటర్ EV కావాలంటే ఇది బెస్ట్.

70kWh బ్యాటరీ - Pack Two Above లో మాత్రమే

600km ARAI రేంజ్ అందించే మధ్యస్థాయి బ్యాటరీ.

రియర్-మౌంటెడ్ మోటార్‌తో మంచి పనితీరు ఇస్తుంది.

హైవే యూజ్ ఎక్కువైతే ఇది క్లియర్ అడ్వాంటేజ్.

79kWh బ్యాటరీ - అన్ని ట్రిమ్‌లకు

అన్ని వేరియంట్లలో దొరికే లార్జెస్ట్ బ్యాటరీ.

లాంగ్-రేంజ్‌ ట్రావెల్స్, ఫ్యామిలీ టూరింగ్‌కు సూట్ అవుతుంది.

వేరియంట్లు & ఫీచర్లు - దేనిలో ఏం ఉంది?

XEV 9S Pack One Above (₹19.95–₹21.95 లక్షలు)

ఇది బేస్‌ వేరియంట్‌ అయినా, ఫీచర్లు మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి.

హైలైట్స్‌:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • పెద్ద 12.3-అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌
  • 12.3-అంగుళాల సెంట్రల్‌ టచ్‌స్క్రీన్‌ + ప్యాసెంజర్‌ స్క్రీన్‌
  • పనోరమిక్‌ సన్‌రూఫ్‌
  • డ్రైవ్‌ మోడ్‌లు, రెజెన్‌ లెవల్స్‌, ఫ్రంక్‌ స్పేస్‌
  • స్మార్ట్‌ LED లైటింగ్‌

ఈ ధరకు ఇన్ని ఫీచర్లు ఇవ్వడం చాలా అరుదు. 7-సీటర్‌ EVని బడ్జెట్‌లో కావాలనుకునే వారికి ఇది స్ట్రాంగ్‌ వాల్యూ.

XEV 9S Pack Two Above (₹24.45–₹25.45 లక్షలు)

Pack One Above‌ ఫీచర్లకు అదనంగా:

  • ADAS
  • 360° కెమెరా
  • 16-స్పీకర్ Harman Kardon సిస్టమ్‌
  • డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌
  • వెంటిలేటెడ్‌ ఫ్రంట్ సీట్స్‌
  • పవర్డ్‌ డ్రైవర్‌ సీటు
  • లెదరెట్‌ ఇంటీరియర్

ఈ వేరియంట్‌ ఫీచర్లు గొప్పవే, కానీ ధర రూ. 4.5 లక్షలకు పైగా ఎక్కువ. వాల్యూ-ఫర్‌-మనీ పరంగా ఇది కొంచెం స్ట్రెచ్‌.

XEV 9S Pack Three (₹27.35 లక్షలు)

Pack two Above‌ ఫీచర్లతో పాటు అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్‌లో సేఫ్టీ & లగ్జరీ లెవెల్‌ ఇంకా పెరుగుతుంది.

అదనపు హైలైట్స్:

  • 7 ఎయిర్‌బ్యాగ్స్‌ [నీ (knee) ఎయిర్‌బ్యాగ్‌ సహా]
  • అడ్వాన్స్‌డ్‌ ADAS (రియర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌, ఆటో స్టీరింగ్‌ మొదలైనవి)
  • సిక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లు
  • బాస్‌ మోడ్‌ సీటు
  • వెంటిలేటెడ్‌ రెండో వరుస సీట్లు
  • అంబియెంట్‌ లైటింగ్‌

ఈ వేరియంట్‌ చాలా రిచ్‌ ఫీచర్లు ఇస్తుంది. ధర పెరిగినా వాల్యూ మాత్రం మంచి స్థాయిలో ఉంటుంది.

XEV 9S Pack Three Above (₹29.45 లక్షలు)

Pack Three ఫీచర్లకు అదనంగా:

  • AR హెడ్‌-అప్‌ డిస్‌ప్లే
  • ఆటో పార్కింగ్‌ అసిస్ట్
  • డ్రైవర్ & ప్యాసెంజర్‌ డ్రౌసినెస్‌ మానిటరింగ్‌
  • కార్‌లో వీడియో కాలింగ్‌

టెక్నాలజీ అదిరిపోతున్నప్పటికీ, వాల్యూ-ఫర్‌-మనీ పరంగా కొంచెం ఎక్కువ ధర అనిపిస్తుంది.

ఏ వేరియంట్ కొనాలి?

బడ్జెట్‌లో 7-సీటర్ EV కావాలంటే: Pack One Above (59kWh లేదా 79kWh) తీసుకోవచ్చు. ధరకు తగ్గ అత్యధిక ఫీచర్లు ఇవ్వడంలో ఇది క్లియర్ విన్నర్‌.

ఫీచర్లు + ప్రీమియం అనుభవం కావాలంటే:  Pack Three (79kWh). అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ, లగ్జరీ, సౌలభ్యం అన్నీ కలిసి ధరకు సరిపోయే బలమైన ప్యాకేజింగ్‌.

టాప్-టెక్‌ మాత్రమే కావాలంటే: Pack Three Above తీసుకోవచ్చు. కానీ ధర కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget