Thar Roxx vs Jimny: మహీంద్రా థార్ రోక్స్ వర్సెస్ మారుతి జిమ్నీ - రెండిట్లో ఏది బెస్ట్?
Mahindra Thar Roxx: మహీంద్రా ఇటీవలే లాంచ్ చేసిన థార్ రోక్స్... మారుతి జిమ్నీతో పోటీ పడనుంది. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Mahindra Thar Roxx vs Maruti Jimny: మహీంద్రా ఇటీవల తన కొత్త 5 డోర్ల థార్ మహీంద్రా థార్ రోక్స్‌ని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన 3 డోర్ థార్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అయిన థార్ రోక్స్ పవర్‌ఫుల్ ఇంజిన్‌తో పాటు గొప్ప డిజైన్, ఆధునిక ఫీచర్లను పొందింది.
మహీంద్రా థార్ రాక్స్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే డీజిల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీ... మారుతి సుజుకి జిమ్నీతో నేరుగా పోటీపడుతుంది. మహీంద్రా థార్ రోక్స్, మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర, వీటిలో ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్‌ట్రెయిన్, డైమెన్షన్స్‌లో ఏది బెస్ట్?
మహీంద్రా థార్ రాక్స్ పవర్‌ట్రెయిన్ చాలా బాగుంది. ఈ వాహనంలో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 160 బీహెచ్‌పీ పవర్, 330 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండోది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చింది. ఇది 150 బీహెచ్‌పీ పవర్, 330 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Also Read: హైబ్రిడ్ వెర్షన్‌లో రానున్న ఫేమస్ కారు- ఫేస్‌లిఫ్ట్ డిజైన్, మరెన్నో స్మార్ట్ ఫీచర్లు
మారుతి సుజుకి జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే పొందుతుంది, ఇది 105 బీహెచ్‌పీ శక్తిని, 134 బీహెచ్‌పీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వాహనాల కొలతల్లో కూడా చాలా తేడా ఉంది. మహీంద్రా థార్ రోక్స్ పొడవు 4,428 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,877 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,923 మిల్లీమీటర్లుగానూ, వీల్‌బేస్ 2,850 మిల్లీమీటర్లుగానూ ఉంది. అదే సమయంలో మారుతి సుజుకి జిమ్నీ పొడవు 3,985 మిల్లీమీటర్లు కాగా... వెడల్పు 1,645 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,720 మిల్లీమీటర్లు గానూ, వీల్‌బేస్ 2,590 మిల్లీమీటర్లు గానూ ఉంది. రెండు ఎస్‌యూవీ సైజులో స్పష్టమైన తేడాను చూడవచ్చు.
దేని ధర ఎంత?
మహీంద్రా థార్ రోక్స్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 12.99 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య ఉంది. అయితే డీజిల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉంది. అదే సమయంలో మారుతీ సుజుకి జిమ్నీ ధర భారతీయ మార్కెట్లో రూ. 12.74 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్‌లో రూ. 14.95 లక్షల వరకు ఉంది. ఈ విధంగా రెండు ఎస్‌యూవీల ధరలలో స్పష్టమైన వ్యత్యాసాన్ని కూడా మనం చూడవచ్చు.
4 wheels that carried the nation's anticipation now set a new standard in the world of SUVs - the only one that matters! Introducing the all new Thar ROXX.
— Mahindra Thar (@Mahindra_Thar) August 14, 2024
Prices start at
Petrol: ₹12.99 Lakh*
Diesel: ₹13.99 Lakh*
Know more: https://t.co/f9KpNAxVXI#THESUV #TharROXX… pic.twitter.com/acSJkRsfV4
Also Read: మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?