Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ రేపట్నుంచే - వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే?
Mahindra Thar Roxx Waiting Period: మహీంద్రా థార్ రాక్స్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బుకింగ్స్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Mahindra Thar Roxx Booking: భారతదేశంలో ఈ సంవత్సరం అతిపెద్ద లాంచ్‌లలో ఒకటైన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. మహీంద్రా థార్ అధికారిక ఎక్స్/ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసిన పోస్ట్‌లో మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అక్టోబర్ 3వ తేదీన ఉదయం 11 గంటల నుంచి దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ పోస్ట్‌లో తెలిపింది. దీన్ని బుక్ చేస్తే సుమారు 90 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండవచ్చని తెలుస్తోంది.
మహీంద్రా తన థార్ రాక్స్‌ను ఆగస్టు 15వ తేదీన విడుదల చేసింది. మహీంద్రా థార్ రాక్స్ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో 2 లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టీజీడీఐ)ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 119 కేడబ్ల్యూ పవర్, 330 ఎన్ఎం టార్క్ డెలివర్ చేస్తుంది. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఈ కారు 130 కేడబ్ల్యూ పవర్‌ని, 380 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
మహీంద్రా థార్ రాక్స్ పవర్‌ట్రెయిన్, ధర
మహీంద్రా థార్ రాక్స్‌లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ మహీంద్రా కారులో 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్ కలదు. ఈ కారు ఆర్‌డబ్ల్యూడీ, 4*4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారులోని డీజిల్ ఇంజన్ గరిష్టంగా 128.6 కేడబ్ల్యూ శక్తిని, 370 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా థార్ రాక్స్ ఒక ఆఫ్ రోడర్ కారు. ఈ ఎస్‌యూవీ థార్ 3 డోర్ మోడల్ నుంచి చాలా భిన్నంగా ఉంటుంది.
మహీంద్రా థార్ రాక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర రూ. 22.49 లక్షల వరకు ఉంది. దీని 4*4 వేరియంట్‌ల ధర రూ. 18.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహీంద్రా ఇటీవలే మొదటి థార్ రాక్స్‌ను వేలానికి ఉంచింది. దీని వీఐపీ నంబర్ ప్లేట్ కోసం ప్రజలు వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ కారు 001 వీఐఎన్ కోడ్ వేలం కూడా కోటి రూపాయలను దాటింది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
‘THE’ moment you’ve been waiting for is almost here. Here’s what you need to do for a smooth booking process.
— Mahindra Thar (@Mahindra_Thar) October 2, 2024
Step 1 - Head over to https://t.co/bkMUag2ujh
Step 2 - Login to your account with your registered mobile number and finalise your preferred configuration of Thar ROXX… pic.twitter.com/F6RsDi0yDt