అన్వేషించండి

Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి

Mahindra Thar Modification: ఒక వ్యక్తి తన కారులో ఏవైనా మార్పులు చేస్తే, వారు వెంటనే తమ బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలపాలి. లేకపోతే పంజాబ్‌లో జరిగిన సీన్ రిపీట్ అయి నష్టపోతారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాహన మోడిఫికేషన్లు ఇన్సూరెన్స్‌పై ప్రభావం చూపుతాయని చాలామందికి తెలియదు.
  • పంజాబ్‌లో థార్ యజమాని మోడిఫికేషన్లతో ₹4 లక్షల క్లెయిమ్ కోల్పోయాడు.
  • బీమా సంస్థకు తెలియకుండా మార్పులు చేస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురైంది.
  • వాహన మార్పుల గురించి బీమా సంస్థకు వెంటనే తెలియజేయడం తప్పనిసరి.

Mahindra Thar Modification: నేటి రోజుల్లో ప్రజలు తమకు కావాల్సిన తీరుగా వాహనాలు, వస్తువులను మార్చుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. కార్లను ప్రత్యేకంగా (యూనిక్‌గా) చూపించుకోవడం కోసం మోడిఫై చేయించుకుంటున్నారు. అందుకే కార్లకు పెద్ద టైర్లు వేయించడం, సస్పెన్షన్ మార్చడం, అలాగే బాడీలోనే మార్పులు చేయడం కొందరికి కామన్ అయిపోయింది. అయితే, ఇలాంటి మోడిఫికేషన్లు చేయించడం వల్ల వాహన ఇన్సూరెన్స్ పై కూడా ప్రభావం పడుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

ఇటీవల పంజాబ్‌లో ఒక మహీంద్రా థార్ (Mahindra Thar) యజమానికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఒక రోడ్డు ప్రమాదం తర్వాత వాహనం యజమానికి రావాల్సిన 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను బీమా కంపెనీ రిజెక్ట్ చేసింది. ఆ మహీంద్రా థార్ యజమాని తన కార్లో పలు మార్పులు చేశాడు. ఆ వివరాలను ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయలేదు. ఆ తర్వాత కారు యాక్సిడెంట్ అయినప్పుడు, నష్టపరిహారం కోసం అందరిలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. దీనిపై బీమా కంపెనీ దర్యాప్తు చేయగా, కారులో చేసిన మోడిఫికేషన్ల విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ కంపెనీ నిబంధనల ప్రకారం.. కారు ఓరిజినల్ స్ట్రక్చర్, సాంకేతికతలో మార్పులు చేశారు. ఇది పాలసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది.

 క్లెయిమ్‌ను కంపెనీ ఎందుకు రిజెక్ట్ చేసింది?
కారులో చేసిన మోడిఫికేషన్ల వల్ల దాని రూపం పూర్తిగా మారిపోయిందని, ఈ మార్పుల గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొంది. అందుకే క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనివల్ల కారు యజమాని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని తానే భరించాల్సి వచ్చింది.

ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం
అందుకే ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరైనా తన కారులో ఎలాంటి పెద్ద మార్పులు చేయించినా, వెంటనే తమ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం ఎంతో అవసరం. చాలా సందర్భాలలో బీమా కంపెనీలు అలాంటి మోడిఫికేషన్లను పాలసీలో చేర్చుకుంటాయి లేదా ప్రీమియం మొత్తంలో మార్పులు చేర్పులు చేస్తుంది. కానీ మాడిఫికేషన్ సమాచారాన్ని దాచిపెడితే మాత్రం, ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు పంజాబ్‌లో జరిగిన మహీంద్రా థార్ ప్రమాదం ఘటనే నిదర్శనం.

ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎప్పుడూ వాహనం ఓరిజినల్ ఫ్యాక్టరీ కండిషన్ ఆధారంగానే జారీ చేస్తారు. ఒకవేళ కారు నిర్మాణం, ఇంజిన్, టైర్లు, సస్పెన్షన్ లేదా ఇతర ముఖ్యమైన భాగాలలో మార్పులు చేయడం ఇన్సూరెన్స్ రిస్క్‌ను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటప్పుడు నిబంధనల ఉల్లంఘన కింద క్లెయిమ్‌ను తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఉంటుంది. కనుక, మీరు కూడా మీ కారు లేదా ఎస్‌యూవీ (SUV)ని మోడిఫై చేయాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా బీమా కంపెనీ, ఆర్టీఓ (RTO) నిబంధనల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకపోతే ప్రమాదం జరిగిన సమయాల్లో, వాహనం డ్యామేజీ అయిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Frequently Asked Questions

మహీంద్రా థార్ యజమాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించబడింది?

యజమాని తన కారులో మార్పులు చేశాడు, అయితే ఈ వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయలేదు. కారు ఒరిజినల్ స్ట్రక్చర్, సాంకేతికతలో మార్పులు చేయడం పాలసీ నిబంధనలకు విరుద్ధమని కంపెనీ పేర్కొంది.

కారుకు పెద్ద మార్పులు చేసిన తర్వాత ఏమి చేయాలి?

కారులో ఎలాంటి పెద్ద మార్పులు చేయించినా, వెంటనే తమ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం చాలా ముఖ్యం. ఇది ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ తిరస్కరణను నివారించడంలో సహాయపడుతుంది.

కారు మోడిఫికేషన్లు వాహన ఇన్సూరెన్స్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి?

కారు నిర్మాణం, ఇంజిన్, టైర్లు వంటి ముఖ్యమైన భాగాలలో మార్పులు చేస్తే ఇన్సూరెన్స్ రిస్క్ పెరుగుతుంది. సమాచారం ఇవ్వకుండా మార్పులు చేస్తే క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget