Maharashtra: 6 రోజులకే చెడిపోయిన ఓలా స్కూటర్ - గాడిదకు కట్టి ఊరేగించేసిన యజమాని !

ఓలా స్కూటర్ డెలివరీ వచ్చిన వారం రోజులకే పని చేయడం మానేసింది. కంపెనీ పట్టించుకోలేదు. దీంతో కోపం వచ్చిన ఓ మహారాష్ట్ర కస్టమర్ గాడిదకు స్కూటర్‌ను కట్టి ఊరేగించేశాడు.

FOLLOW US: 

అతడురోజూ పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి విముక్తి పొందడానికి ఈ-బైక్ కొన్నాడు .  కానీ ఆరు రోజులకు అసలుకే మోసం వచ్చింది. చాలా చోట్ల జరుగుతున్నట్లుగా అతని బైక్ కాలిపోలేదు. కానీ చెడిపోయింది. అసలు స్టార్ట్ కావడం లేదు. రెండు రోజులు అపూరూపంగా చూసుకుని...పెట్రోల్ ఖర్చులు రూ. ఐదు వందలు మిగిలాయని సంబరపడుతూంటే.. మొత్తానికే మోసం వచ్చింది. దీంతో ఆయన కోపం పట్టలేకపోయారు. తన వాహనాన్ని చూస్తూ చూస్తూ ధ్వంసం చేసుకోలేరు. కానీ కోపం మాత్రం ఆగలేదు. అందుకే వినూత్నంగా ఆలోచించి కోపం తీర్చుకున్నారు. ఓ గాడిదను తీసుకొచ్చి దానికి తన విద్యుత్ వాహనాన్ని కట్టి వీధుల్లో ఊరేగించి కసి తీర్చుకున్నారు. 

ఈ ఈ-బైక్ ఊరూపేరూ లేని కంపెనీదేం కాదు. ఓలా కంపెనీది. చాలా రోజులుగా ఉదరగొట్టి మరీ మార్కెట్లోకి డెలివరీలు ప్రారంభించిన ఓలా కంపెనీ స్కూటర్లకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన సచిన్ గెట్టి కూడా గత ఏడాది అడ్వాన్స్ కట్టి ఈ ఏడాది ఓలా స్కూటర్ అందుకున్నారు. కానీ వారం రోజులకే మొరాయించింది. కంపెనీకి ఫిర్యాదు చేస్తే ఓ మెకానిక్ వచ్చి చూశాడు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది.పైగా ఓలా కస్టమర్ కేర్ సరిగ్గా సమాధానం చెప్పలేదు. దీంతో మోసపోయానని సచిన్ గెట్టే డిసైడయ్యాడు. ఓలాను సీక్స్ కొట్టాలని నిర్ణయించుకుని గాడిద ప్లాన్అమలు చేశాడు. 

View this post on Instagram
 
A post shared by LetsUpp Marathi (@letsupp.marathi)

ఓ గాడిదను తీసుకొచ్చి దానికి ఓలా స్కూటర్‌ను కట్టేశాడు. రెండు బ్యానర్లను కూడా గాడిదకు తగిలించాడు ఓలా కంపెనీని నమ్మోద్దు.. ఓలా కంపెనీ స్కూటర్లు కొనొద్దు అంటూ ఆ రెండు బ్యానర్లపై రాయించాడు. వాటిని సిటీ అంతా తిప్పాడు. ఈ నిరసన వైరల్ అయిపోయింది. ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. కామెడీ ఏమిటంటే... ఓలా కంపెనీకి ఇంత చెడ్డ పేరు వస్తున్నా ఆ కంపెనీ నుంచి మాత్రం స్పందనలేదు. 

Published at : 26 Apr 2022 03:04 PM (IST) Tags: maharashtra Electric Scooter Ola Electric vehicles Beed E-scooter

సంబంధిత కథనాలు

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

Kia EV6 Review: ఐదు వందల కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న ఎస్‌యూవీ " కియా ఈవీ 6 "

Kia EV6 Review:  ఐదు వందల కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న ఎస్‌యూవీ

టాప్ స్టోరీస్

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?