అన్వేషించండి

Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం

Lamborghini కొత్త Fenomeno Roadster సూపర్‌కార్‌ తీసుకొచ్చింది. పవర్‌ఫుల్ V12 Hybrid ఇంజిన్, టాప్ స్పీడ్, ఫీచర్లు ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సూపర్‌కార్లలో ఒకటిగా నిలుపుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Lamborghini Fenomeno Roadster: 15 యూనిట్లతో ప్రపంచ మార్కెట్లోకి విడుదల.
  • V12 హైబ్రిడ్ ఇంజిన్: 1080hp శక్తి, 2.4 సెకన్లలో 100km/h.
  • ఆకర్షణీయమైన డిజైన్: ఓపెన్ రూఫ్, 22 అంగుళాల అలాయ్ వీల్స్.
  • ధర: కోట్ల రూపాయలలో ఉంటుందని నిపుణుల అంచనా.

అతివేగంగా వెళ్లే కార్లు, లగ్జరీ కార్లు, సూపర్‌కార్లను ఇష్టపడే వారి కోసం Lamborghini కొత్త అద్భుతమైన కారు Fenomeno Roadsterను లాంచ్ చేసింది. ఈ కారు కేవలం వేగం మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన డిజైన్, అతి తక్కువ సంఖ్యలో ఉత్పత్తి (Limited Production) కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ ఈ సూపర్‌కార్‌ను ప్రపంచంలోని కొందరు ఎంపిక చేసిన కస్టమర్ల కోసం సిద్ధం చేసింది. పవర్‌ఫుల్ ఇంజిన్, ఓపెన్ రూఫ్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కారు అటు లగ్జరీ, ఇటు  పెర్ఫార్మెన్స్‌ల సూపర్ కాంబినేషన్‌గా నిలవనుంది. 

కేవలం 15 యూనిట్లు మాత్రమే తయారీ.. ఇది చాలా ప్రత్యేకం
Lamborghini బ్రాండ్ ప్రపంచంలో బెస్ట్ బ్రాండ్లలో ఒకటి. ఈ కంపెనీ తీసుకొస్తున్న Fenomeno Roadster కారు అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే అతి తక్కువ యూనిట్లు తయారు చేయడం. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్‌కార్‌ కేవలం 15 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అందుకే లాంచ్ అయిన వెంటనే ఈ కారు సూపర్‌కార్ ప్రియులలో హాట్ టాపిక్ అవుతోంది. తక్కువ యూనిట్లు ఉండటం వల్ల ఈ కారు చాలా ఎక్స్‌క్లూజివ్‌గా భావిస్తారు. దీనిలోని కొన్ని యూనిట్లు భారత్‌లోనూ కూడా కనిపించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ లాంబోర్గిని కారు దేశంలోని సంపన్న కార్ కలెక్షన్ కోరుకుని వారి వద్ద మరింత ప్రత్యేక ఆకర్షణగా మారవచ్చు.

V12 Hybrid ఇంజిన్ ఇచ్చే సూపర్ పవర్
Lamborghini ఈ సూపర్‌కార్‌లో పవర్‌ఫుల్ V12 Hybrid ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ సుమారు 1080hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కారు అత్యంత వేగాన్ని అందుకుంటుంది. దీంతో పాటు 8 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కూడా ఇచ్చారు. ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత అద్భుతంగా మారుస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూపర్‌కార్ కేవలం 2.4 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 340 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంతటి వేగం దీనిని ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రోడ్‌స్టర్ కార్లలో ఒకటిగా చేస్తుంది. పైగా లిమిటెడ్ ఎడిషన్ వల్ల మరింత పేరు వస్తుంది..

దీనిని ప్రత్యేకంగా మార్చనున్న డిజైన్, ఫీచర్లు 
Fenomeno Roadster డిజైన్ చాలా ఆకర్షణీయంగా, స్పోర్టీగా రూపొందించారు. ఇందులో LED హెడ్‌లైట్లు, LED DRL, భారీ 22 ఇంచుల అలాయ్ వీల్స్, అద్భుతమైన ఏరోడైనమిక్ బాడీ ఇచ్చారు. కారు ఓపెన్ రూఫ్ డిజైన్ దీనిని మరింత ప్రీమియంగా మార్చేస్తోంది. ఫెనోమెనో రోడ్‌స్టర్ ఇంటీరియర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కో-ప్యాసింజర్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఇచ్చారు. లాంబోర్గిని కంపెనీ కారులో కార్బన్ ఫైబర్ భాగాలను కూడా ఉపయోగించింది. దీనివల్ల బరువు మరింత తగ్గి కారు పనితీరు బెస్ట్ అనిపిస్తుంది. 

ధరపై కొనసాగుతున్న సస్పెన్స్..

Lamborghini కంపెనీ ప్రస్తుతానికి Fenomeno Roadster ధరకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, దీని లిమిటెడ్ ఎడిషన్, అద్భుతమైన ఫీచర్లను బట్టి చూస్తుంటే, దీని ధర కోట్ల రూపాయలలో ఉంటుందని ఆటో నిపుణులు చెబుతున్నారు. 

Frequently Asked Questions

Lamborghini కొత్తగా విడుదల చేసిన కారు పేరు ఏమిటి?

Lamborghini కొత్తగా విడుదల చేసిన కారు పేరు Fenomeno Roadster. ఇది అతివేగంగా వెళ్లే కార్లు, లగ్జరీ కార్లు, సూపర్‌కార్లను ఇష్టపడే వారి కోసం రూపొందించబడింది.

Fenomeno Roadster కారు ప్రత్యేకత ఏమిటి?

Fenomeno Roadster కారు ప్రత్యేకత ఏంటంటే ఇది అతి తక్కువ సంఖ్యలో, అంటే కేవలం 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడింది. ఇది ప్రపంచంలోని కొందరు ఎంపిక చేసిన కస్టమర్ల కోసం సిద్ధం చేయబడింది.

Fenomeno Roadster కారు ఇంజిన్ సామర్థ్యం ఎంత?

Fenomeno Roadster కారులో పవర్‌ఫుల్ V12 Hybrid ఇంజిన్‌ను అందించారు. ఇది సుమారు 1080hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది, 2.4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Fenomeno Roadster కారు టాప్ స్పీడ్ ఎంత?

Fenomeno Roadster కారు టాప్ స్పీడ్ గంటకు 340 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వేగం దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్‌స్టర్ కార్లలో ఒకటిగా నిలుపుతుంది.

Fenomeno Roadster కారు ధర ఎంత ఉంటుంది?

Lamborghini కంపెనీ Fenomeno Roadster కారు ధరకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది లిమిటెడ్ ఎడిషన్ మరియు అద్భుతమైన ఫీచర్లను బట్టి, దీని ధర కోట్ల రూపాయలలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ampere Magnus Grand vs Honda Activa eయాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
Mahindra Thar On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
టయోటా టైసర్‌ కొనాలా? తొందరపడొద్దు, ముందు ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోండి
అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఫ్యామిలీమ్యాన్‌ కోసం సింపుల్ ఎనర్జీ కొత్త ఇ-స్కూటర్ - రిజ్టాకు పోటీ, రేటు ఎంత ఉండొచ్చంటే?
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget