అన్వేషించండి

New KTM 250 Duke: రూ.2.4 లక్షల్లోనే డ్యూక్ లాంచ్ చేసిన కేటీయం - ఏకంగా 250 సీసీ ఇంజిన్‌తో!

New KTM 250 Duke Price: భారతదేశంలో కేటీయం 250 డ్యూక్ అప్‌డేటెడ్ వెర్షన్‌ని కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర రూ.2.41 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ బైక్‌లో కొన్ని మార్పులు చేశారు.

KTM 250 Duke Updated: కేటీయం 250 డ్యూక్‌కు సంబంధించిన కొత్త ఎడిషన్ భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ కేటీయం బైక్‌లో కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది. దీంతో పాటు కొత్త ఎడిషన్ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లే కాకుండా ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లను కూడా అమర్చారు. 390 డ్యూక్ తరహాలో ఉండే ఫీచర్లు ఈ బైక్‌లో అందించారు. ఈ కొత్త 250 డ్యూక్ ధర రూ.2.41 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎక్స్ షోరూం ధర.

కేటీయం కొత్త బైక్‌లో ప్రత్యేకత ఏమిటి?
ఈ కేటీయం బైక్‌లో అమర్చిన కొత్త హెడ్‌ల్యాంప్ రాత్రిపూట మంచి కాంతిని అందిస్తుంది. ఈ బైక్‌లో ఇంతకుముందు ఎల్సీడీ స్క్రీన్ ఉంది, దాని స్థానంలో కొత్త రంగుల యూనిట్ వచ్చింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా హెడ్‌సెట్, మొబైల్ ఫోన్‌ని కనెక్ట్ చేయవచ్చు. లెఫ్ట్ హ్యాండిల్ బార్‌పై అమర్చిన స్విచ్ క్యూబ్‌లతో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. కొత్త స్క్రీన్, కొత్త హెడ్‌ల్యాంప్‌లను అందించడం మినహా ఈ బైక్‌లో ఇతర మార్పులు చేయలేదు.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

కేటీయం 250 డ్యూక్ పవర్
కేటీయం 250 డ్యూక్ కొత్త మోడల్ పవర్‌ట్రెయిన్‌లో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. ఈ బైక్‌లో 249.07 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 9,250 ఆర్పీఎం వద్ద 30.57 బీహెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా అందించారు.

ఈ కేటీయం బైక్ ముందు చక్రం 320 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. వెనుక చక్రం ఫ్లోటింగ్ కాలిపర్‌తో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. బైక్‌లో సూపర్‌మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. ఈ బైక్ అప్‌డేటెడ్ వెర్షన్ కూడా మునుపటి మోడల్ లాగానే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget