Kia Clavis SUV: కొత్త కారుతో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న కియా - ఈసారి బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారు!
Kia Clavis SUV India Launch: కియా కొత్త కారు క్లావిస్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. దీని డిజైన్, ఇంటీరియర్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
Kia Clavis SUV: కియా త్వరలో లాంచ్ చేయనున్న క్లావిస్ ఎస్‌యూవీని సోనెట్ పైన సెగ్మెంట్‌లో ఉంచనుంది. అయితే ఇది బాక్సియర్ ఎస్‌యూవీ లుక్‌తో వస్తుంది. సెల్టోస్, సోనెట్ మధ్య ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వివిధ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని క్లావిస్‌ను తయారు చేశారు. మూడు ఎస్‌యూవీల విభిన్న వేరియంట్‌ల ధరలలో చాలా వ్యత్యాసం ఉంటుందని భావిస్తున్నప్పటికీ, క్లావిస్ మరింత పవర్‌ఫుల్ మోడల్‌గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈవీ9 తరహాలో స్క్వేర్ వీల్ ఆర్చ్‌లు, వర్టికల్ డీఆర్ఎల్స్, హెడ్‌ల్యాంప్ డిజైన్ వంటి బాక్సియర్ డిజైన్‌ను ఆశించవచ్చు.
డిజైన్, ఫీచర్లు ఇలా...
డిఫరెంట్ లుక్, కొత్త రంగులతో పాటు ఇది 16 అంగుళాల వీల్స్, డ్యూయల్ టోన్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. క్లావిస్‌లోని పెట్రోల్ ఇంజన్లు కూడా సోనెట్ తరహాలో ఉంటాయని అంచనా. ఇంటీరియర్‌లోని చాలా అంశాలు సెల్టోస్ లాగానే ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా డిజైన్ పరంగా అలాగే ఉండవచ్చని సమాచారం. ఇది కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
ఇది సోనెట్ నుండి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా పొందుతుంది. అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెల్టోస్ వంటి కస్టమైజ్డ్ డిజైన్‌ను పొందవచ్చు. ముఖ్యంగా ఈవీ6 వంటి ప్రీమియం ఆఫర్‌ల తర్వాత క్లావిస్... కియా అందిస్తున్న మొట్టమొదటి మాస్ మార్కెట్ ఈవీ. అయితే బ్యాటరీ ప్యాక్, రేంజ్ వివరాలు వెల్లడించలేదు.
వేటితో పోటీ?
క్లావిస్ కొత్త కార్లతో పోటీపడనుంది. ఇవి కూడా మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి. పోటీలో ప్రధాన అంశం ధరగా ఉంటుంది. ధర తక్కువగా ఉండాలి. మరింత లోకలైజేషన్‌తో సోనెట్‌కు దీని ధర దగ్గరగా ఉండాలి. అయితే దీని ధర సోనెట్ బేస్ వేరియంట్ కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కియా క్లావిస్ ఈవీ వెర్షన్ టాటా పంచ్ ఈవీతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో క్లావిస్ పెట్రోల్ వేరియంట్ ధర మరింత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?