ప్రస్తుతం ప్రజలు సూపర్ బైక్స్ కొనేముందు వాటి పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎక్కువ పవర్, క్లాస్ లుక్‌తో చాలా బైక్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.5 లక్షల రేంజ్‌లో ఎన్నో బైక్స్ ఉన్నాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 ఎక్స్ షోరూం ధర రూ.2.33 లక్షలుగా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ ఎక్స్ షోరూం ధర రూ.3.19 లక్షలుగా ఉంది. కేటీయం ఆర్సీ 390ని రూ.3.18 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. యమహా ఆర్3 ఎక్స్ షోరూం ధర రూ.4.65 లక్షలుగా ఉంది. అల్ట్రా వయొలెట్ ఎఫ్77 ఎక్స్ షోరూం ధర రూ.3.8 లక్షలుగా ఉంది. ఏప్రిలా ఆర్ఎస్457 ఎక్స్ షోరూం ధర రూ.4.1 లక్షలుగా ఉంది. కేటీయం 390 డ్యూక్ ఎక్స్ షోరూం ధర రూ.3.1 లక్షలుగా ఉంది.