భారతదేశంలో కారు, బైకుల దొంగతనాలు క్రమేపీ ఎక్కువ అవుతున్నాయి. ఆకో సంస్థ నివేదిక ప్రకారం... 2023లో వాహనాలు పోయాయన్న ఫిర్యాదులు చాలా ఎక్కువగా వచ్చాయి. ఏయే నగరాల్లో వాహనాలు ఎక్కువ పోయాయో కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కథనం ప్రకారం దేశరాజధాని ఢిల్లీలో ఎక్కువగా వాహనాలు పోతున్నాయి. 2023లో ఢిల్లీలో ప్రతి రోజూ 105 వాహన కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అంటే సగటున ప్రతి 14 నిమిషాలకూ దేశ రాజధానిలో ఒక వాహనం పోతుందన్న మాట. ఈ జాబితాలో రెండో స్థానంలో చెన్నై, మూడో స్థానంలో బెంగళూరు నిలిచాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో కోల్‌కతా ఉన్నాయి. బిల్డింగ్స్‌లో, కాలనీల్లో పార్కింగ్ స్పేస్ తక్కువగా ఉండటం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనాలను కేవలం స్పేర్ పార్ట్స్ కోసమే దొంగిలిస్తున్నట్లు ఈ కథనంలో తెలిపారు.