ఫెరారీ సూపర్ కారు పురోసాంగ్వే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.10.5 కోట్లుగా నిర్ణయించారు. ఫెరారీ లాంచ్ చేసిన మొదటి నాలుగు డోర్ల కారు ఇదే. అయితే ఈ రూ.10.5 కోట్ల ధర ఎక్స్ షోరూమ్ రేటు మాత్రమే. ఆన్ రోడ్ ప్రైస్ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇది ప్రారంభ ధర మాత్రమేనని తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట. ఇందులో ఉన్న వీ12 ఇంజిన్ దీనికి ప్రధాన ప్లస్ పాయింట్. ఇది 725 హెచ్‌పీ పవర్‌ని, 716 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఇదే.