Kia Carens: కియా కారెన్స్ లాంచ్ తేదీ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. రికార్డు స్థాయిలో బుకింగ్స్ కూడా!
ప్రముఖ కార్ల కంపెనీ కియా మనదేశంలో తన కొత్త కారెన్స్ కారును ఫిబ్రవరి 15వ తేదీన లాంచ్ చేయనుంది.
కియా సెల్టోస్, కార్నివాల్, సోనెట్‌ల తర్వాత మనదేశంలో నాలుగో కియా కారు లాంచ్ కానుంది. అదే కియా కారెన్స్. ఈ కారు ధర మనదేశంలో ఫిబ్రవరి 15వ తేదీన ప్రకటించనున్నారు. ఈ మూడు వరుసల ఎంపీవీ కారును కంపెనీ 2021 డిసెంబర్‌లోనే ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి.
ఈ కారును బుక్ చేసుకోవాలనుకుంటే కంపెనీ వెబ్ సైట్ ద్వారా లేదా కియా డీలర్ షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ప్రారంభం అయిన మొదటిరోజే 7,738 కార్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. కియా కారెన్స్ ధర సెల్టోస్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు అందించారు. 1.5 లీటర్ల పెట్రోల్ యూనిట్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ యూనిట్లు కూడా ఇందులో అందించారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యూనిట్.. 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ అందుబాటులో ఉంది.
1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ వేరియంట్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, ప్యాడిల్ షిఫ్టర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు కూడా ఇందులో అందించనున్నారు. ఈ డీజిల్ వేరియంట్ 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.
ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండనుంది. దీంతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, బోస్ సౌండ్ సిస్టం, ఎలక్ట్రిక్ డబుల్ ఫోల్డింగ్ సెకండ్ రో సీట్లు వంటి ఫీచర్లు ఇందులో అందించారు.
ఆరు ఎయిర్ బాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కార్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు డిస్క్ బ్రేకులు, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఇందులో అందించనున్నారు.