Kia New Car: ఎర్టిగాకు పోటీనిచ్చే కియా కొత్త కారు - సెవెన్ సీటర్లలో కింగ్ కానుందా?
Kia Carens Facelift India Launch: కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇది మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ ఇవ్వనుంది. మనదేశంలో ఎర్టిగాకు మంచి డిమాండ్ ఉంది.
Kia Carens Facelift: భారతదేశంలో సెవెన్ సీటర్ కార్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. ప్రజలు పెద్ద కుటుంబం కోసం 7 లేదా 8 సీటర్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మారుతీ సుజుకి ఎర్టిగా మనదేశంలో ఈ సెగ్మెంట్‌ను కైవసం చేసుకుంది. ఈ కారుకు దేశంలో మంచి స్పందన లభిస్తోంది. ఇదిలా ఉండగా కియా కొత్త 7 సీటర్ కారును కూడా విడుదల చేయనుంది. అయితే ఈ కారుకు త్వరలో మార్కెట్లో గట్టి పోటీ రానుంది. ఎందుకంటే కియా కంపెనీ త్వరలో కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని తెలుస్తోంది.
దీని స్పెషాలిటీ ఏంటి?
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం కియా భారతదేశంలో 2025 మధ్య నాటికి కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. అదే సమయంలో ఈ కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో కూడా అనేక మార్పులు చూడవచ్చు. ఈ కొత్త 7 సీటర్ కారులో కంపెనీ కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్త టైల్‌లైట్లు, కొత్త అల్లాయ్ వీల్‌ను కూడా అందిస్తుందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా రాబోయే ఈ కారు కొత్త కలర్ ఆప్షన్‌ను కూడా పొందే అవకాశం ఉంది.
కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
ఇప్పుడు ఈ కొత్త కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్ కెమెరా వంటి అనేక ఫీచర్లను కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో చూడవచ్చు. అదే సమయంలో కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయడం లేదు. ఇది మాత్రమే కాకుండా కియా ఇండియా ఈ కొత్త కారును రూ. 10 నుండి 12 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేయవచ్చు.
మారుతీ సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ
మారుతి సుజుకి మనదేశంలో ఎక్కువగా విక్రయించే 7 సీటర్ కారు ఎర్టిగా అని చెప్పవచ్చు. మారుతి ఎర్టిగాలో 1462 సీసీ ఇంజన్‌ను కంపెనీ అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 86 నుంచి 101 బీహెచ్‌పీ పవర్‌తో 136.8 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుంచి మొదలై రూ. 13.03 లక్షల వరకు ఉంటుంది.
Make family adventure memorable with the Kia Carens. From its spacious interiors to advanced safety features, with Carens every ride is as enjoyable as the destination.
— Kia India (@KiaInd) June 26, 2024
Book a test drive now.#Kia #KiaIndia #KiaLife #MovementThatInspires #Carens #KiaCarens #FromADifferentWorld pic.twitter.com/6FUc44O0Kf
Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూపర్ - భారత్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?