Car Discounts: ఈ కారుపై ఏకంగా రూ.12 లక్షలు డిస్కౌంట్ - ఇప్పుడు ధర ఎంతంటే?
Jeep Grand Cherokee: జీప్ గ్రాండ్ చెరోకీ కారుపై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. దీనిపై ఏకంగా రూ.12 లక్షల వరకు డిస్కౌంట్ ఇప్పుడు పొందవచ్చు. దీనికి సంబంధించి లిమిటెడ్ వేరియంట్ అందుబాటులో ఉంది.
Jeep Grand Cherokee Car on Discount: ప్రస్తుతం చాలా కంపెనీలు తమ కార్లపై మంచి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మోడల్‌పై ఆధారపడి ఈ తగ్గింపు ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. మరోవైపు అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ జీప్ తన ఎస్‌యూవీపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కంపెనీ అత్యధిక తగ్గింపును ఇస్తున్న ఎస్‌యూవీనే జీప్ గ్రాండ్ చెరోకీ. కంపెనీ ఈ ఎస్‌యూవీకి సంబంధించి లిమిటెడ్ వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తోంది. ఈ నెలలో జీప్ గ్రాండ్ చెరోకీపై రూ.12 లక్షల నగదు తగ్గింపును అందజేస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 80 లక్షల 50 వేలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఇది రూ.68.5 లక్షలకు తగ్గనుంది.
జీప్ గ్రాండ్ చెరోకీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కంపెనీ అందించింది. క్వాడ్రా ట్రాక్ 4*4 వివిధ మోడ్‌లను గ్రాండ్ చెరోకీలో చూడవచ్చు. ఈ ఎస్‌యూవీలో మీరు కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ సీట్లు వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి
ఈ లగ్జరీ కారు లోపలి భాగంలో 10 అంగుళాల హెడ్స్ అప్ డిస్‌ప్లే, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ రేడియో, 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెగ్మెంట్‌లోని కారులో మొదటిసారిగా 10.25 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేను ఇందులోనే అందించారు.
గ్రాండ్ ఎస్‌యూవీ చెరోకీ ఏడీఏఎస్ వంటి అనేక సెక్యూరిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఫుల్ స్పీడ్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ప్లస్ పెడెస్ట్రియన్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్, క్రాస్ పాత్ డిటెక్షన్ సిస్టమ్, పాసివ్ పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ సిస్టం, డ్రైవర్ యాక్టివిటీ డిటెక్షన్ సిస్టమ్, యాక్టివ్ లేన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వార్నింగ్ సిస్టమ్ వంటివి జంక్షన్ల లాంటి ప్రదేశాల్లో యాక్సిడెంట్లు అవ్వకుండా ఆపుతాయి. ఈ పూర్తి లగ్జరీ ఎస్‌యూవీ కారును ఆఫ్ రోడ్ డ్రైవింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. చెరోకీలో అందించిన గ్రిల్ డిజైన్ ఈ 5 సీటర్ SUV కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. జీప్ బ్రాండెడ్ కార్లకు మనదేశంలో మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా లగ్జరీ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఈ కార్ల రేట్లు కూడా కాస్త అధికంగానే ఉంటాయి.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
Driving forward the legacy of crafting luxury adventures with the iconic Jeep Grand Cherokee. Experience ultra-premium features that enhance your drives to the next best level. The most awarded luxury adventure SUV now comes with limited-time privileges. #jeep #jeepindia… pic.twitter.com/Ipan7KdufH
— Jeep India (@JeepIndia) July 16, 2024