Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
హ్యుండాయ్ శాంట్రో కారు ఉత్పత్తిని నిలిపివేసింది.
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో కంపెనీలు మాత్రమే కాకుండా వినియోగదారులు కూడా మెల్లగా ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో హ్యుండాయ్ కూడా భారతదేశంలోని తన ప్లాంట్‌లో శాంట్రో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. హ్యుండాయ్ విక్రయిస్తున్న అత్యంత చవకైన హ్యాచ్‌బ్యాక్ శాంట్రోనే.
ఈ కొత్త శాంట్రో 2018లో లాంచ్ అయింది. దీని సేల్స్ కూడా బాగానే జరిగాయి. 2018లోనే టచ్ స్క్రీన్‌ను, స్మూత్ ఏఎంటీ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు. అయితే హ్యుండాయ్ నియోస్ రాకతో శాంట్రోకు కొంచెం గడ్డు కాలం మొదలైంది. శాంట్రో కంటే దీని ధర కొంచెమే ఎక్కువ కావడంతో వినియోగదారులు దానికి మొగ్గు చూపారు.
అయితే పోను పోను వినియోగదారులు కూడా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీలు కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. హ్యుండాయ్‌లో తక్కువ ధర ఉన్న కార్ల కంటే కొంచెం ప్రీమియం మోడల్ అయిన క్రెటా సేల్స్ పెరగడమే దీనికి నిదర్శనం.
దీంతోపాటు కర్బన ఉద్గారాల విషయంలో ప్రభుత్వాలు నిబంధనలు మారుస్తున్నాయి. దానికి తగినట్లు కారుకు మార్పులు చేయడం కూడా కష్టం కాబట్టి శాంట్రోని డిస్‌కంటిన్యూ చేయాలనే నిర్ణయాన్ని హ్యుండాయ్ తీసుకుని ఉండవచ్చు.
ప్రభుత్వం ఇటీవలే కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నియమాన్ని కంపల్సరీ చేసింది. దీనికి శాంట్రోను కూడా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. హ్యుండాయ్ ఎస్‌యూవీ కార్లను డెవలప్ చేయడంపైనే దృష్టి పెట్టింది. కాబట్టి హ్యుండాయ్ భవిష్యత్తులో ఏం చేస్తుందో వేచి చూడాలి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram