అన్వేషించండి

నితిన్ గడ్కరీ సంచలన నిర్ణయం.. E100 ఫ్యూయల్ వాహనాలకు అనుమతి, టయోటా-హ్యుందాయ్ సిద్ధం!

భారత్‌లో E100 ఇంధన వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నితిన్ గడ్కరీ కీలక ప్రకటనతో టయోటా, సుజుకి, హ్యుందాయ్, ఎంజీ కంపెనీలు E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Nitin Gadkari approves E100 fuel: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో 100 శాతం ఇథనాల్ ఆధారిత ఇంధనం వినియోగానికి చట్టబద్ధ అనుమతి లభించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, E100 ఫ్యూయల్ వినియోగానికి సంబంధించిన నిబంధనల ఫైల్‌పై సంతకం చేసినట్లు ప్రకటించారు. దీంతో భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల యుగానికి మార్గం సుగమమైంది.

ఇటీవలే ఢిల్లీలో E85 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మరింత ముందడుగు వేస్తూ E100 ఫ్యూయల్‌కు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం విశేషం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ వినియోగం విస్తరిస్తుండగా, భవిష్యత్తులో మరింత అధిక ఇథనాల్ మిశ్రమాలతో నడిచే వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

E100 ఫ్యూయల్‌కు అధికారిక అనుమతి

నాగ్‌పుర్‌లో నిర్వహించిన 'షుగర్, ఇథనాల్ అండ్ బయో ఎనర్జీ ఇండియా కాన్ఫరెన్స్‌'లో మాట్లాడిన నితిన్ గడ్కరీ, E100 ఇంధన వినియోగానికి సంబంధించిన నియమావళిని తాను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో.. ఇథనాల్‌ను ప్రధాన ఇంధనంగా ఉపయోగించే వాహనాల అభివృద్ధికి చట్టపరమైన మార్గం ఏర్పడింది.

ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ, హైబ్రిడ్ వాహనాలకు మాత్రమే ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాధాన్యం ఉండగా, ఇకపై ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.

త్వరలో కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు

ఇప్పటికే మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ WagonRను ప్రదర్శించింది. హీరో మోటోకార్ప్ కూడా ఇథనాల్ ఆధారిత మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. గడ్కరీ చెప్పిన ప్రకారం... టయోటా, సుజుకి, హ్యుందాయ్, ఎంజీ వంటి ప్రముఖ కంపెనీలు మరో నెలన్నరలోనే E100 అనుకూల వాహనాలను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు, ఇథనాల్‌కు అనుకూలమైన ఫ్యూయల్ సిస్టమ్‌లపై పెట్టుబడులను మరింత పెంచే అవకాశం కల్పిస్తుంది. అధిక ఇథనాల్ మిశ్రమాలతో పనిచేసే వాహనాలకు ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్, ప్రత్యేక ఫ్యూయల్ లైన్లు, ఇతర సాంకేతిక మార్పులు అవసరమవుతాయి.

ఇంకా సవాళ్లు ఉన్నాయి

అయితే E100 ఫ్యూయల్‌కు అనుమతి లభించినంత మాత్రాన వెంటనే అన్ని వాహనాలు దీనిని వినియోగించలేవు. ప్రస్తుతం E20కు అనుకూలంగా ఉన్న వాహనాల్లో నేరుగా E100 నింపడం సాధ్యం కాదు. ఇందుకు ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్, ప్రత్యేక ఫ్యూయల్ సిస్టమ్ అవసరం.

మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రత్యేక E100 ఫ్యూయల్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను కూడా ఎథనాల్ లక్షణాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది.

మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా?

ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల E100 ఫ్యూయల్‌పై నడిచే వాహనాలు అదే దూరం ప్రయాణించేందుకు ఎక్కువ ఇంధనం వినియోగించే అవకాశం ఉంది. అంటే మైలేజ్ కొంత మేర తగ్గే అవకాశాన్ని నిపుణులు చెబుతున్నారు.

దేశానికి ప్రయోజనం ఏమిటి?

ఈ చర్యతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది. దీంతో రైతులకు అదనపు ఆదాయం, దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అనే రెండు ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయి.

E100 ఫ్యూయల్ విజయవంతం కావాలంటే వాహనాల లభ్యత, ఇంధన స్టేషన్ల మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అంగీకారం కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో భారత ఆటోమొబైల్ రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఎంత ప్రభావం చూపుతాయో ఆసక్తిగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ
రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ - డైలీ జర్నీ, లాంగ్‌ టూరింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైనింగ్‌, ధర ఎంతంటే?
రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?
పవర్ ఎక్కువైతే మైలేజ్ తగ్గుతుందా? రెనాల్ట్ డస్టర్ 1.0 - 1.3 రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవే!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget