అన్వేషించండి

Hyundai V2G Technology: హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!

Hyundai V2G Technology: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్ వినూత్న ప్రయోగం చేపట్టింది. వెహికల్ టు గ్రిడ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ V2G టెక్నాలజీతో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ స్టేషన్లుగా మార్చుతుంది.
  • జెజు ఐలాండ్‌లో 40 మంది యజమానులతో V2G పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
  • వాహన బ్యాటరీలు విద్యుత్తును గ్రిడ్‌కు పంపి, అవసరాలను స్థిరీకరిస్తాయి.
  • ఈ ప్రాజెక్ట్ పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచి, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

Hyundai V2G Technology: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ అవసరం లేని వాహనాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో ఇవి శక్తి వనరులుగా మారబోతున్నాయి. ఈ దిశగా దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్‌ మోటార్ గ్రూప్‌ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. దక్షిణ కొరియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం జెజు ఐలాండ్‌లో వ్యక్తిగత ఎలక్ట్రిక్‌ వాహన యజమానుల కోసం వెహికల్‌ టు గ్రిడ్‌ టెక్నాలజీ (Hyundai V2G Technology)పైలట్‌ ప్రాజెక్టును ఆ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. 

ఈ వీ2జీ టెక్నాలజీ ఏంటీ?

సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వాహనాన్ని(Electric Vehicles) ఛార్జింగ్ సాకెట్‌కు అనుసంధానించినప్పుడు, గ్రిడ్‌ నుంచి విద్యుత్ వాహనంలోని బ్యాటరీకి చేరుతుంది. అయితే వీ2జీ టెక్నాలజీ దీనికి భిన్నంగా పని చేస్తుంది. ఇది వాహనాన్ని ఒక మొబైల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌గా మారుస్తుంది. అంటే వాహనంలోని బ్యాటరీలో ఉన్న విద్యుత్‌ను అవసరమైనప్పుడు తిరిగి పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. దీని వల్ల కారు కేవలం ప్రయాణ సాధనమే కాకుండా, ఒక నడిచే పవర్ బ్యాంక్‌లా ఉపయోపడుతుంది. 

Also Read: ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

ప్రాజెక్టులో ఎవరు భాగమై ఉన్నారు?

హ్యుందాయ్‌ మోటార్ గ్రూప్‌ ఈ ప్రాజెక్టును జెజు స్థానిక అధికారుల సహకారంతో చేపట్టింది. ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా 40 మంది ప్రైవేటు వాహన యజమానులను ఎంపిక చేశారు. ఇందులో పాల్గొనే వారు హ్యుందాయ్‌కి చెందిన loniq9 (Hyundai Ioniq 9)లేదా కియాకి చెందిన ఈవీ 9(Kia EV9) మోడళ్లను కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు వీ2జీ సాంకేతికతకు అనుకూలంగా రూపొందించారు. 

Also Read:హ్యాందాయ్‌ నుంచి 10 లక్షల బడ్జెట్‌లో ఉన్న మోడల్స్ ఇవే! కారు కొనే ముందు ఓ లుక్‌ వేయండి!

గతంలో అంటే 2025 ద్వితీయార్థంలో, హ్యుందాయ్ సోకార్‌ అనే మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు దీనిని నేరుగా సాధారణ వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడు (మే 15న) వెలువడింది. 2025లో నిర్వహించిన పైలట్ ప్రోగ్రామ్‌ విజయవంతం కావడంతో ఇప్పుడు దీనిని మరింత మందికి చేరువ చేస్తూ హ్యుందాయ్‌ నిర్ణయం తీసుకుంది. 

ఎందుకు జేజు ఐలాండ్‌ ఎంచుకున్నారు?

జెజు ఐలాండ్‌ (Jeju Island )ఈ ప్రయోగానికి అత్యంత అనువైన ప్రాంతం. ఇక్కడ గాలి, సౌర శక్తిపై ఆధారపడి ప్రజలు జీవిస్తారు. అయితే ప్రకృతి సిద్ధంగా లభించే ఈ విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్‌లో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఈవీ బ్యాటరీల్లో స్టోర్ చేయవచ్చు. విద్యుత్ ఉత్పత్తి తగ్గినా లేదా డిమాండ్ పెరిగినా వాహనాల్లో నిల్వ ఉన్న శక్తిని తిరిగి గ్రిడ్‌కు పంపి సరఫరాను స్థిరీకరించవచ్చు. దీని వల్ల విద్యుత్‌ వృథా కాకుండా ఉండటమే కాకుండా పవర్‌ గ్రిడ్‌పై భారం పడదు. 

Also Read: EV త్రీ-వీలర్ మార్కెట్లో సంచలనం.. హ్యుందాయ్, టీవీఎస్ మోటార్స్ Joint Venture! దేశీ రోడ్ల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ ఆటోలు

దీని వల్ల ప్రయోజనం ఏంటీ?

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాహన యజమానులకు హ్యుందాయ్‌ భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. వీ2జి(Vehicle to Grid) సపోర్ట్ చేసే ప్రత్యేక ఛార్జర్లను హ్యుందాయ్ ఉచితంగా ఇన్‌స్టాల్చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు నడుస్తున్న కాలంలో వాహన యజమానులు తమ కార్లను ఛార్జ్ చేసుకునేందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయాల్సిన అవసరం లేదు. దీనిని కంపెనీయే భరిస్తుంది. పునరుత్పాదక ఇంధనాన్ని సమర్థవంతంగా వాడటం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించవచ్చు. 

Also Read: ఎండల్లో సేఫ్ డ్రైవింగ్ టిప్స్ - సమ్మర్ గ్లేర్ నుండి తప్పించుకోవడానికి ఎన్ హెచ్ఏఐ కీలక సూచనలు

భారత్ వంటి దేశాల్లో కూడా విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతోంది. బెజు ఐలాండ్‌లో జరుగుతున్న ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్‌లో మన దేశంలో కూడా ఇలాంటి సాంకేతికను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా సోలార్ పవర్‌ ఎక్కువగా వాడే ప్రాంతాల్లో వీ2జి టెక్నాలజీ ఒక విప్లవమే అవుతుంది. 

Frequently Asked Questions

హ్యూందాయ్ V2G టెక్నాలజీ అంటే ఏమిటి?

V2G టెక్నాలజీ వాహనంలోని బ్యాటరీలో ఉన్న విద్యుత్‌ను అవసరమైనప్పుడు తిరిగి పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేయడానికి అనుమతిస్తుంది. దీని వల్ల కారు ఒక నడిచే పవర్ బ్యాంక్‌లా పనిచేస్తుంది.

ఈ V2G ప్రాజెక్టులో ఎవరు పాల్గొనవచ్చు?

ఈ ప్రాజెక్టులో పాల్గొనడానికి Hyundai Ioniq 5 లేదా Kia EV6 మోడళ్లను కలిగి ఉండాలి. వీరు జెజు ఐలాండ్‌లో నివసిస్తూ ఉండాలి.

జేజు ఐలాండ్‌ను ఈ ప్రాజెక్టుకు ఎందుకు ఎంచుకున్నారు?

జేజు ఐలాండ్‌ పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడుతుంది. V2G టెక్నాలజీ ద్వారా అదనపు విద్యుత్‌ను నిల్వ చేసి, విద్యుత్‌ వృథాను తగ్గించవచ్చు.

ఈ ప్రాజెక్టులో పాల్గొనేవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

పాల్గొనేవారికి V2G సపోర్ట్ చేసే ఛార్జర్లను ఉచితంగా ఇన్‌స్టాల్చేస్తారు. పైలట్ ప్రాజెక్టు కాలంలో ఛార్జింగ్‌కు ఎటువంటి ఫీజు ఉండదు.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Embed widget