News
News
X

Hyundai SUV Sales: అమ్మకాల్లో దుమ్మురేపుతున్న హ్యుందాయ్, దేశీయంగా 29.6% వృద్ధి నమోదు!

హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాల్లో దూసుకెళ్తోంది. అక్టోబర్ 2022లో 58,006 యూనిట్లను విక్రయించి సత్తా చాటింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాల్లో 29.6% వృద్ధిని సాధించింది.

FOLLOW US: 

అమ్మకాల్లో దుమ్మురేపిన హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ భారతీయ మార్కెట్లో అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నది.  అక్టోబర్ 2022లో 48,001 యూనిట్లను రిటైల్ చేసింది. గతేడాది అక్టోబర్ తో పోల్చితే ఈ అక్టోబర్ లో అమ్మకాల వృద్ధి భారీగా పెరిగింది. 29.6% జంప్‌ సాధించింది.  తమిళనాడులోని ఇరుంగట్టుకోట్టై, శ్రీపెరంబుదూర్‌లోని ఈ కొరియన్ ఆటోమేకర్ కు సంబంధించిన రెండు తయారీ ప్లాంట్ల నుంచి ఎగుమతులు కూడా 53.1% పెరిగాయి. హ్యుందాయ్ అక్టోబర్ 2021లో 6,535 యూనిట్లను ఎగుమతి చేయగా, అక్టోబర్ 2022లో 10,005 యూనిట్లను ఎగుమతి చేసింది.HMC యొక్క గ్లోబల్ ఎగుమతి హబ్‌ లో HMIL కీలకమైన భాగం. ఇది ప్రస్తుతం ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు ఆసియా పసిఫిక్ అంతటా 85 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

అక్టోబర్ 2022లో 58,006 యూనిట్ల విక్రయం

అక్టోబర్ 2022లో 58,006 యూనిట్లు విక్రయించడంతో క్యుములేటివ్లీ బ్రాండ్ 33.1% వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2021లో ఈ బ్రాండ్ మొత్తం 43,556 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. HMIL ప్రస్తుతం భారతదేశంలోని 1,458 సర్వీస్ సెంటర్లలో 577 డీలర్లను కలిగి ఉంది. "మా సూపర్ పెర్ఫార్మర్ SUV బ్రాండ్‌లతో CY2022లో రికార్డు స్థాయిలో దేశీయ అమ్మకాలను నమోదు చేయబోతున్నాం" అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ వెల్లడించారు. j

News Reels

SUV మోడల్స్ ఇవే!

HMIL యొక్క SUV లైనప్‌లో - వెన్యూ, క్రెటా, అల్కాజార్, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ SUV ఉన్నాయి. అదనంగా, బ్రాండ్ దాని N-లైన్ శ్రేణి i20 మరియు వెన్యూ మోడల్‌లను కూడా కలిగి ఉంది. "ఎప్పటికప్పుడూ మెరుగుపడుతున్న సెమీ కండక్టర్ పరిస్థితితో, మేము మా కస్టమర్ల డిమాండ్‌ను తీర్చగలిగాము. అక్టోబర్‌  పండుగ సీజన్‌లో వారి కార్లను డెలివరీ చేయగలిగాము" అని తరుణ్ గార్గ్ వివరించారు. సెమీ కండక్టర్ల కొరత కారణంగా చాలా వాహన తయారీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడిప్పుడే వీటి కొరత తీరడంతో మళ్లీ వాహన ఉత్పత్తి పెరిగింది.

11 కారు మోడళ్లను విక్రయిస్తున్న హ్యుందాయ్

ఇక హ్యుందాయ్ ప్రస్తుతం అన్ని సెగ్మెంట్లలో 11 కారు మోడళ్లను విక్రయిస్తోంది. SUVలు కాకుండా, గ్రాండ్ i10 NIOS, i20, ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ మరియు వెర్నా కాంపాక్ట్ సెడాన్ కూడా ఉన్నాయి. బ్రాండ్ ఇటీవలే గ్రాండ్ i10 నియోస్ యొక్క కార్పొరేట్ ఎడిషన్‌ను నిలిపివేసింది.  i20, Aura మోడల్‌ ల రంగు ఎంపికలను మార్చింది.  ఐ20 ఇకపై మెటాలిక్ కాపర్, సన్‌బర్న్ స్వే కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో లేదు. ఆరా ఇకపై వింటేజ్ బ్రౌ షేడ్‌తో అందుబాటులో ఉండదని కంపెనీ ఇప్పటికే వెళ్లడించింది.

Read Also: సరికొత్త జీప్ గ్రాండ్ చెరోకీ SUV రిలీజ్ డేట్ ఫిక్స్, ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి!

Published at : 02 Nov 2022 10:00 PM (IST) Tags: Hyundai Hyundai SUVs Cars Hyundai sales 29 Percent Domestic Growth

సంబంధిత కథనాలు

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Mercedes-Benz EQB: దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే బెంజ్ కారు, త్వరలో తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUV లాంచ్

Mercedes-Benz EQB: దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే బెంజ్ కారు, త్వరలో తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUV లాంచ్

Royal Enfield Super Meteor 650: భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ధర ఎంతో తెలుసా?

Royal Enfield Super Meteor 650: భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ధర ఎంతో తెలుసా?

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి