Jeep Grand Cherokee: సరికొత్త జీప్ గ్రాండ్ చెరోకీ SUV రిలీజ్ డేట్ ఫిక్స్, ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి!
జీప్ ఇండియా నుంచి సరికొత్త కారు రాబోతుంది. గ్రాండ్ చెరోకీ SUV పేరుతో విడుదల కానుంది. తాజాగా కంపెనీ ఈ లేటెస్ట్ కారు రిలీజ్ డేట్ ప్రకటించింది. దేశీయంగా 5-సీటర్ వేరియంట్ అందుబాటులోకి రానుంది.
జీప్ కంపెనీ పెద్ద ఫ్లాగ్ షిప్ SUVని దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది. గ్రాండ్ చెరోకీ బ్యాడ్జ్ ను సరికొత్తగా పరిచయం చేయబోతున్నది. కొత్త తరం గ్రాండ్ చెరోకీ, మరింత స్టైలిష్ గా ప్రీమియం లుక్ తో వస్తుంది. పూర్తి స్థాయి లగ్జరీ SUVగా విడుదల కానుంది. గ్రాండ్ చెరోకీ కూడా రాంగ్లర్ ప్లస్ కంపాస్, మెరిడియన్తో పాటు భారత్ లోనే అసెంబుల్ చేయబడుతుంది.తాజాగా ఈ సరికొత్త గ్రాండ్ చెరోకీ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11న ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలిపింది.
గ్రాండ్ చెరోకీ ఇంజిన్ ప్రత్యేకతలు
అంతర్జాతీయ మార్కెట్లో గ్రాండ్ చెరోకీ 5.7లీటర్ వీ8 ఇంజిన్ తో అందుబాటులో ఉంది. ఇది 357 బీహెచ్పీతో 528 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్ టర్బోఛార్జ్ పెట్రోల్ మోటార్ ఆప్షన్ సైతం లభిస్తున్నది. ఈ మోటార్ 375 బీహెచ్పీతో 637 ఎన్ఎం టార్క్ ను అందిస్తున్నది. అటు 3.6లీటర్ వీ6 పెట్రోల్ మోటార్ లో 294హెచ్పీతో 348ఎన్ఎం టార్క్ ను అందిస్తున్నది.
గ్రాండ్ చెరోకీ ఫీచర్లు, ధర వివరాలు
జీప్ గ్రాండ్ చెరోకీ సరికొత్త మోడల్ సైతం.. పాత వాటితో పోలికను కలిగి ఉంటుంది. చూడ్డానికి మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ గ్రిల్ని అద్భుతంగా రూపొందించారు. ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్స్ ఇట్టే ఆకట్టుకునేలా తయారు చేశారు. ఇంటీరియర్ విషయానికి వస్తే మరింత అత్యధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. 10.25 అంగుళాల స్క్రీన్, యాపిల్కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు మరికొన్ని నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అటు వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్ట్రీమింగ్ సైట్స్ కూడా అందుబాటులో ఉండేలా రూపొందించారు.అంతేకాదు, ఈ కారులో 4G ఇన్ బిల్ట్ గా రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. 19 స్పీకర్ సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఇప్పటికే గ్రాండ్ చెరోకీ టీజర్ విడుదల
ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. జీప్ ఇండియా లైనప్ లో గ్రాండ్ చెకోరి నాలుగో SUVగా అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే కంపాస్, వ్రాంగ్లర్, మెరీడియన్ ఎస్యూవీలు భారత మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఈ మూడు కార్లు టయోటా కంపెనీకి చెందిన ఫార్చునర్ వాహనానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి.
ఏ కార్లతో పోటీ పడుతుందంటే?
కొత్త గ్రాండ్ చెరోకీ Mercedes-Benz GLE, BMW X5, ఆడి Q7తో సహా లగ్జరీ క్లాస్ లో చాలా SUVలతో పోటీపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 7-సీటర్ వెర్షన్ కూడా ఉంది. అయితే, 5-సీట్ల వేరియంట్ ను మాత్రమే భారత్ లో విడుదల చేయబోతున్నది. ఇక ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ధర వివరాలను విడుదల సందర్భంగా జీప్ ఇండియా వెల్లడించనుంది.
Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!