Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల అయ్యింది. ఇది 6 లేదా 7 సీటర్ కాన్ఫిగరేషన్స్‌తో వస్తుంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ ధర రూ. 14.99 లక్షలుగా ఉంది. ఇందులో రెండు కుటుంబాలు సులభంగా వెళ్లవచ్చు.
Hyundai Alcazar Facelift Version Launched: సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ SUV నేడు మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ భారీ ఎస్‌యూవీ 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు కుటుంబాలు సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
డిజైన్స్ & డైమెన్షన్స్
సరికొత్త వెర్షన్‌లో పూర్తి అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన ఈ హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ డిఫరెంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, H-ఆకారపు LED DRLలు, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ LED టెయిల్ ల్యాంప్‌లతో ఆకర్షణీయమైన డిజైన్‌తో విడుదల అయ్యింది. ఈ ఎస్‌యూవీ అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫియరీ రెడ్, స్టార్రి నైట్, టైటాన్ గ్రే మాట్‌తో పాటు మొత్తం 9 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ కారు పొడవు 4,560 mm, వెడల్పు 1,800 mm, 1,710 mm ఎత్తుని కలిగి ఉంంది. అంతే కాకుండా ఇది 2,760 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
కొత్త హ్యుందాయ్ అల్కాజార్ SUV రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటైన 1.5-లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 158 bhp పవర్‌ని 253 nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అదే సమయంలో, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 113 bhp పవర్‌ని 250 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్స్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటాయి.
డ్రైవింగ్ మోడ్స్
ఈ SUV 3 డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తుంది. ఎకో మరియు స్పోర్ట్. అదనంగా, ఇది మూడు ట్రాక్షన్ మోడ్‌లను కలిగి ఉంటుంది: వివిధ పరిస్థితులలో డ్రైవింగ్ పనితీరును మెరుగుపరచడానికి మంచు, మట్టి మరియు ఇసుక.
ఫీచర్లు
ఆల్కజార్ ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ మునుపటి కంటే సరికొత్తగా అందుబాటులో ఉంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఎయిర్‌బ్యాగ్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Also Read: నీటిలో మునిగిన కార్లు చౌక ధరకు కొంటున్నారా? అవి పని చేస్తాయో లేదో తెలుసుకోవడం ఎలా?
వారంటీ ప్యాకేజీలు
హ్యుందాయ్ అల్కాజార్ మూడు సంవత్సరాల పాటు అపరిమిత కిలోమీటర్ వారంటీ ప్యాకేజీతో వస్తుంది. ఇందులో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) కూడా ఉంటుంది. కస్టమర్‌లు ఐదేళ్ల వరకు ట్రస్ట్ రన్నింగ్ రిపేర్ ప్యాకేజీ లేదా ఏడు సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ ఆప్షన్‌లతో పాటు సూపర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ ప్యాకేజీ వంటి అదనపు ప్యాకేజీలను కూడా అధిక ధరలో ఎంచుకోవచ్చు.
మార్కెట్ పోటీ
ఈ హ్యుందాయ్ అల్కాజర్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా సఫారి, మహీంద్రా XUV700, MG హెక్టర్, సిట్రోయిన్ C3 ఎయిర్‌క్రాస్, కియా కేరెన్స్ వంటి ఇతర SUVలకు గట్టి పోటీని అందిస్తుంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు కొత్తగా ఫ్యామిలీ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి సరిపోతుంది.