అన్వేషించండి

How To Buy Car: నీటిలో మునిగిన కార్లు చౌక ధరకు కొంటున్నారా? అవి పని చేస్తాయో లేదో తెలుసుకోవడం ఎలా?

Car Buying Tips In Telugu | నీటిలో మునిగిన కార్లు చౌక ధరకుకొనుక్కుంటున్నారా...? మరి అవి పని చేస్తాయో లేదో తెలుసుకోవడం ఎలా అంటారా. ఈ వివరాలు తెలుసుకుంటే మీ కారు పనితీరు అర్థమవుతుంది.

Buying a flood affected car is safe Know Details in Telugu | ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విలయతాండవం చేయడంతో భారీ వర్షాలు కురిశాయి. పెద్ద నగరాలు నుంచి మొదలుకొని చిన్నచిన్న గ్రామాల వరకు జల ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. భారీ వర్షానికి జల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రోడ్లపై, ఇంటి ముందు ఉండే కొన్ని వాహనాలు కంటికి కనబడకుండా కొట్టుకుపోయాయి. రోడ్లపై ఉండే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు నీట మునిగి బురదమయం అయిపోయాయి.

స్క్రాప్ రూపంలో అమ్మకాలు 
ఇళ్లలో ఉండే సోఫా సెట్లు, బెడ్లు, కుర్చీలు  ఇనుము సామాగ్రి వస్తువులు ఎండకు పెడితే ఎండుతాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు నీటిలో తడిచాయి అంటే ఇంకా అంతే సంగతులు. మరి వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ లాంటి వస్తువులయితే నీటిలో తడిస్తే పర్లేదు కానీ లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే కార్లు నీటిలో తడిశాయంటే ఇంక అంతే పరిస్థితి అనుకుంటారు. లక్షల రూపాయలు పెట్టి, కొనుగోలు చేసిన ఆ కార్లను స్క్రాప్ రూపంలో అమ్మకాలు చేస్తుంటారు.

నీటిలో మునిగిన ఖరీదైన కార్లను కొందరు చవకగా స్క్రాప్ లో కొనుగోలు చేస్తుంటారు. మరి ఈ కార్లను కొనుగోలు చేయొచ్చా..? ఒకవేళ చేస్తే అవి పనికి వస్తాయా ..? అయితే కార్లు నీటిలో మునిగిన తర్వాత కారు ఇంజన్ కు ఏమైనా అవుతుందా...? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాలను "ABP DESAM" ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కార్ నీటిలో మునిగితే ఏం అవుతుంది...

వాహనాలు నీటిలో తడవడం సహజమే కానీ మామూలుగా తడవడానికి పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి తేడా ఉంటుంది. సామాన్యంగా కార్లలో వెళ్లేటప్పుడు వర్షం పడితే కారు తడుస్తుంది .మరి అప్పుడు రాని సమస్య నీటిలో మునిగినప్పుడు ఎందుకు వస్తుందని  చాలా మందిలో సందేహాలను తీసుకువస్తుంది.

అయితే మానవ శరీరంలో మెదడు, గుండె, కాలేయం, నరాలు ఎలా పనిచేస్తాయి వాహనాలకు కూడా ECM (ENGINE CONTROL MODULE),ECU (ELECTRONIC CONTROL UNIT), ఎయిర్ ఫిల్టర్, సైలెన్సర్, వైరింగ్, సెల్ఫ్ మోటర్, డైనమా అనే కొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి.

ECM, ECU అంటే ఏంటి అది ఎలా పని చేస్తుంది...?

ఈ ECM, ECU అంటే మానవ శరీరంలో మెదడు శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఈ ECM, ECU లు కూడా కారు ఇంజను స్మూత్ గా ఉండేందుకు ఎలక్ట్రానిక్ వైరింగ్ సిస్టంని కంట్రోల్ చేసేందుకు పనిచేస్తాయి. ముఖ్యంగా కారులో ఉండే వైరింగ్ సిస్టం ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ నుంచి ఎంత పవర్ ని పంపించాలి డైనమా నుండి ఎంత పవర్ ని తీసుకోవాలి అనే పని ECM,ECU చేస్తుంటాయి.

ఫోర్ వీలర్ టెక్నీషియన్...

ఫోర్ వీలర్ వాహనాలు వర్షంలో తడిసాయి అంటే ముందుగా 90% వరకు పాడైపోతాయని అంటున్నారు టెక్నీషియన్. ముందుగా సైలెన్సర్ బాగా నుండి కారు ఇంజన్ లోకి నీరు చేరుకుంటుందని కారు ఇంజన్లోకి నీరు చేరుకోగానే ఈ సీఎం లు బ్యాటరీ షార్ట్ అయిపోయి వైరింగ్ అంతా షాట్ సర్క్యూట్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ కార్ని స్టార్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఇంజన్ తోపాటు డైనమా బ్యాటరీ వైరింగ్ మొత్తం పాడు అయిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు టెక్నీషియన్...

మరి ఈ వాహనాలను స్క్రాప్ లో కొనుగోలు చేస్తే పనికి వస్తాయా...

అడ్వాన్సుడ్ స్టేజ్ లో ఉండే క్యాన్సర్ పేషెంట్ కి ఎంతకాలం బతుకుతాడో అనే నమ్మకం ఎలా ఉంటుందో ఈ నీటిలో మునిగిన వాహనాలను కొనుగోలు చేసి వాటిని బాగు చేయించుకోవడం కూడా అలాంటిదే అని అంటున్నారు సీనియర్ టెక్నీషియన్ దాసరి వంశీ. వాహనాలు నీటిలో మునిగిపోయిన గంటసేపటి వ్యవధిలోనే వైరింగ్ మొత్తం జంక్ పడుతుందని.. ఒకవేళ వారి అదృష్టం బాగుంటే వాహనం బాగు అయ్యే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget