News
News
X

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

వేగంగా వెళ్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయితే? ఏం చేయాలో తెలియక చాలా మంది డ్రైవర్లు టెన్షన్ పడతారు. ఫలితంగా ఘోర ప్రమాదాలకు గురవుతారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా బయటపడే అవకాశం ఉంటుంది.

FOLLOW US: 
 
ఇండియాలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం. అత్యంత వేగంగా వెళ్తున్న వాహనాలు కంట్రోల్ తప్పడం వల్లే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. బ్రేకులు ఫెయిల్ కావడం కూడా చాలా ప్రమాదాలకు కారణం అవుతోంది. కారు వేగంగా దూసుకెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని తెలిస్తే.. ఎంత అనుభవం ఉన్న డ్రైవర్‌లోనైనా వణుకు మొదలవుతుంది. ఆ సమయంలోనే స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి కారణమవుతారు. అయితే, బ్రేకులు ఫెయిల్ అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గండం నుంచి గట్టేక్కే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బ్రేకులు ఫెయిలైనా భయం వద్దు

చాలా వాహన ప్రమాదాలకు కారణం భయం. బ్రేకులు ఫెయిల్ అయిన విషయం తెలిసిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఆ సమయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ముందుగా భయాన్ని నియంత్రించుకోవాలి. బ్రేకులు ఫెయిల్ అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ గా ఉండవచ్చు.

2. పార్కింగ్ లైట్లు ఆన్ చేయండి

పార్కింగ్ లైట్లు (హాజార్డ్స్) అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడతాయి. వాహనం పార్కింగ్ లైట్లు ఆన్ చేయడం ద్వారా, వెనుక వాహనంలో వచ్చే వారు మీ వాహనంలో సమస్య ఉందని తెలుసుకుంటారు. మీ వాహనానికి కాస్త దూరంగా వెళ్లడమో? పక్కకు వెళ్లడమో? చేస్తారు.

3. గేర్లు మార్చడం

బ్రేక్‌లు పని చేయకపోతే వెంటనే  గేర్‌ మార్చండి. టాప్ గేర్  నుంచి నెమ్మదిగా గేర్లు మారుస్తూ ఫస్ట్ గేర్ వరకు తీసుకురావాలి. వెంటనే వేగం తగ్గుతుంది. ఆటో మేటిక్ కారులో అయినా ఇదే పద్దతిని పాటించాల్సి ఉంటుంది. చాలా ఆటో మేటిక్ కార్లలో మాన్యువల్ సెట్టింగ్‌ లు కూడా అందించబడ్డాయి. మీరు గేర్‌లను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ ఉండాలి. అంటే కారు 5వ గేర్‌లో ఉన్నట్లయితే, ముందుగా దానిని 4వ స్థానానికి ఆపై 3వ గేర్‌కి తగ్గించాల్సి ఉంటుంది. వెంటనే టాప్ నుంచి ఫస్ట్ గేర్ లేదంటే సెకెండ్ గేర్ లోకి మార్చడం మూలంగా ఇంజిన్ లో సమస్యలు వస్తాయి. అందుకే నెమ్మదిగా వన్ బై వన్ మార్చాలి.

News Reels

4. కారును పక్కకు తీసుకెళ్లండి

బ్రేక్ ఫెయిల్ అయితే, కారును రోడ్డు మధ్యలో అలాగే నడపకూడదు. వెంటనే దానిని పక్కకు తిప్పాలి. రోడ్డు మధ్యలో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కారు వేగంగా ఉన్నప్పుడు కంగారు స్టీరింగ్‌ను పక్కకు తిప్పకూడదు.

5. ఎమర్జెన్సీ హ్యాండ్‌ బ్రేక్‌ వాడండి

అత్యవసరం అనుకుంటేనే ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ ను వినియోగించాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పద్దతులను పాటించిన తర్వాత చివరగా హ్యాండ్ బ్రేక్ వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే కంగారు పడి.. వేగంగా వెళ్తున్న కారుకు హ్యాండ్‌ బ్రేక్‌  వేస్తే.. రోడ్డు మీదే పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. ఎదురుగా ఏదైనా వాహనం వస్తుంటే.. దాన్ని తప్పించడానికి  కంగారు పడకుండా స్టీరింగ్‌ను నిదానంగా పక్కకు తిప్పి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.  

Read Also: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Published at : 23 Nov 2022 07:16 PM (IST) Tags: Brakes Fail Emergency Handbrake Parking lights car tips Car driving tips

సంబంధిత కథనాలు

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!