Vehicle Details Online: ఆన్‌లైన్‌లో మీ బండి వివరాలు ఎలా తెలుసుకోవాలి? - RC, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ డేటా చెక్ చేసే సులభమైన మార్గాలు
Parivahan Vehicle Information: RC, బీమా, ఫిట్‌నెస్ వంటి వాహన వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. మీరు ఇంట్లోనే కూర్చుని, మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే ఆ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

RC Insurance Fitness Certificate Status Checking: కారు, స్కూటర్ లేదా బైక్ యజమానులు తన వాహనానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్), బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లాంటి పత్రాల గడవు తీరిపోతే, రోడ్డుపై పోలీసులు ఆపినప్పుడు ఇబ్బందులు తప్పవు. వాహనం యాక్సిడెంట్ కేసులో చిక్కుకున్నప్పుడు బీమా డబ్బులు రావాలంటే పాలసీ యాక్టివ్‌గా ఉండాలి. అంతేకాదు, మీరు సెకండ్‌హ్యాండ్ బండి కొనబోతున్నప్పుడు కూడా ఆ వాహనం గత రికార్డులు చెక్ చేస్తే మోసపోకుండా ఉంటారు. ఇలాంటి ముఖ్యమైన పనులను ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయొచ్చు. ఇంటి నుంచే కొన్ని నిమిషాల్లో వివరాలు తెలుసుకోవచ్చు.
RC వివరాలు చెక్ చేసే విధానం
- RC అంటే Registration Certificate. ఇది, మీ వాహనం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పొందిందని చెప్పే పత్రం. దీన్ని చెక్ చేయడం చాలా సులభం.
- ముందుగా, పరివాహన్ పోర్టల్ Parivahan.gov.in లోకి వెళ్లండి.
- "Know Your Vehicle Details" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- మీ వాహనం నంబర్ ఎంటర్ చేసి Submit క్లిక్ చేయండి.
- వెంటనే వాహన మోడల్, యజమాని పేరు, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వంటి అన్ని వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ సమాచారం వాహనం నిజమైన యజమాని ఎవరో, వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యిందో స్పష్టంగా చూపిస్తుంది.
బీమా వివరాలు ఎలా తెలుసుకోవాలి?
వాహనం ఇన్సూరెన్స్ వ్యాలిడ్‌గా లేకపోతే లీగల్‌గా ఆ వాహనాన్ని నడపలేరు. పరివాహన్ పోర్టల్ (Parivahan.gov.in) లో RC డేటా చెక్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నంబర్, వాలిడిటీ ముగిసే తేదీ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా మీ బీమా కంపెనీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే కూడా డైరెక్ట్‌గా ఈ సమాచారం అందుతుంది.
ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత
కమర్షియల్ వాహనాల కోసం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ట్రక్కులు, లారీలు, ఆటోలు, క్యాబ్‌లు ఈ సర్టిఫికేట్ లేకుండా రోడ్డు మీద నడవకూడదు. పరివహన్ పోర్టల్‌లో Fitness Certificate Status ఆప్షన్ ఉంటుంది. మీ వెహికల్ నంబర్ ఎంటర్ చేయగానే, ఫిట్‌నెస్ వాలిడ్ ఉన్న తేదీ వరకు సమాచారం కనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్ లేకుండా నడిపితే భారీ ఫైన్ విధించబడుతుంది.
తెలంగాణలో మొబైల్ యాప్ ద్వారా...
తెలంగాణలో బండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ల కోసం T App Folio అనే యాప్ ప్రత్యేకంగా ఉంది. ఈ యాప్‌లో వాహనం నంబర్ ఎంటర్ చేయగానే RC, బీమా, ఫిట్‌నెస్ డేటా అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. అదేవిధంగా DigiLocker యాప్ ద్వారా మీరు RC, బీమా పత్రాలను డిజిటల్‌గా భద్రపరచుకోవచ్చు. దీని వల్ల మీరు ఒరిజినల్ పేపర్లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
వెహికల్ వివరాలు ఎందుకు చెక్ చేయాలి?
- లీగల్ ఇబ్బందులు రాకుండా ఉంటుంది.
- సెకండ్‌హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే ముందు యజమాని నిజమా కాదా అని నిర్ధారించుకోవచ్చు.
- RC, బీమా, ఫిట్‌నెస్ అప్‌టుడేట్‌గా ఉంటే రోడ్డుపై ఎటువంటి టెన్షన్ ఉండదు.
- బీమా వ్యాలిడిటీ ఉంటేనే యాక్సిడెంట్ సందర్భంలో మీకు రక్షణ లభిస్తుంది.
మీరు వాహనాన్ని కొన్న వెంటనే RC అప్లికేషన్‌ను తప్పులు లేకుండా నింపి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీలను ముందుగానే గుర్తుంచుకోవాలి. కమర్షియల్ వాహనాల యజమానులు ఫిట్‌నెస్ చెక్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ పనులన్నీ మీ ఇంటి నుంచే, మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో కొన్ని నిమిషాల్లోనే చెక్ చేయవచ్చు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా, భవిష్యత్తులో లీగల్ సమస్యలు, అనవసర ఖర్చులు తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి వాహన యజమాని ఇది అలవాటు చేసుకుంటే రోడ్డు మీద ప్రయాణం మరింత సేఫ్‌గా, టెన్షన్ లేకుండా సాగుతుంది.





















