అన్వేషించండి

RC Transfer Online: ఇంట్లోనే కూర్చుని RC ట్రాన్సఫర్‌, లైసెన్స్‌ అడ్రస్‌ మార్చుకోవచ్చు - ఆన్‌లైన్‌ విధానం ఇదే

Driving License Address Change: RC బుక్‌ను కొత్త ఓనర్‌ పేరుపైకి ట్రాన్సఫర్‌ చేయడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో మీ అడ్రస్‌ మార్చుకోవడం వంటివి మీ మంచికే ఉపయోగపడతాయి, చట్టపరమైన ఇబ్బందులు తప్పిస్తాయి.

RC Book Transfer & Driving License Address Change Online: ఏదైనా కారు, బైక్‌ లేదా స్కూటర్‌ కొన్నప్పుడు, అమ్మినప్పుడు లేదా లేదా మరో ఊరికి మారినప్పుడు RC బుక్‌ (వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌) ట్రాన్సఫర్‌, అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్పు చాలా ముఖ్యం. ఇవి చేయకపోతే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ప్రతి వాహనదారుడు ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి, అప్‌డేటెడ్‌గా ఉండాలి.

RC బుక్‌ ట్రాన్సఫర్‌ ఎందుకు అవసరం?
మీరు మీ వాహనాన్ని అమ్మినప్పుడు, కొత్త కొనుగోలుదారుడే దాని చట్టబద్ధమైన యజమాని అవుతాడు. అమ్మిన తర్వాత కూడా RC బుక్‌ మీ పేరుపైనే ఉంటే ప్రమాదం. ట్రాఫిక్‌ ఫైన్‌ లేదా క్రిమినల్‌ కేసుల వంటి సమస్యలు మీకే తగులుతాయి. అందుకే RC బుక్‌ ట్రాన్సఫర్‌ చేయడం తప్పనిసరి, అది మీకే మంచిది.

RC బుక్‌ ట్రాన్సఫర్‌కి కావలసిన డాక్యుమెంట్లు

  • ఒరిజినల్‌ RC
  • ఫామ్‌ 28, 29, 30 (Parivahan వెబ్‌సైట్‌ లేదా RTO కార్యాలయంలో లభిస్తాయి)
  • ఇన్సూరెన్స్‌ కాపీ
  • PUC సర్టిఫికేట్‌
  • సెల్లర్‌, బయ్యర్ ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌లు
  • వాహనం మీద లోన్‌ ఉంటే NOC (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌)

RC బుక్‌ ట్రాన్సఫర్‌ ప్రక్రియ

  • Parivahan వెబ్‌సైట్‌ parivahan.gov.in లోకి వెళ్లి → Online Services → Vehicle Related Services ఎంపిక చేయాలి.
  • వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఇవ్వాలి.
  • RC Transfer కోసం Application Form నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.
  • ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • అవసరమైతే RTO కార్యాలయానికి వెళ్ళి డాక్యుమెంట్లను వెరిఫికేషన్‌ చేయించాలి.
  • ఒకసారి అప్రూవ్‌ అయితే, RC కొత్త యజమాని పేరుతో జారీ అవుతుంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్పు ఎందుకు చేయాలి?

మీరు కొత్త ఊరికి, కొత్త రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, మీ లైసెన్స్‌లో ఉన్న పాత చిరునామాను వాడితే చట్టపరమైన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఐడీ ప్రూఫ్‌గా లైసెన్స్ ఉపయోగించే సమయంలో సమస్యలు తలెత్తుతాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు

  • ఒరిజినల్‌ లైసెన్స్
  • కొత్త చిరునామా ప్రూఫ్‌ (ఆధార్‌, రెంట్ అగ్రిమెంట్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • దరఖాస్తు ఫారం

లైసెన్స్‌ అడ్రస్ మార్పు ప్రక్రియ

  • Parivahan (దేశంలో ఎవరైనా) లేదా T App Folio (తెలంగాణ వాసులకు మాత్రమే) యాప్‌ ద్వారా అప్లికేషన్‌ సబ్మిట్‌ చేయాలి.
  • ఫారం నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.
  • ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • RTOలో బయోమెట్రిక్స్‌ కోసం హాజరు కావాలి.
  • అప్రూవ్‌ అయిన తర్వాత కొత్త చిరునామాతో లైసెన్స్‌ జారీ అవుతుంది.

అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • అన్ని ఫారాలను తప్పులు లేకుండా నింపండి.
  • వాహనంపై లోన్‌ ఉంటే ముందుగా NOC తీసుకోండి.
  • వాహనాన్ని అమ్మిన వెంటనే RC ట్రాన్సఫర్‌ ప్రక్రియ మొదలుపెట్టండి.
  • లైసెన్స్ అడ్రస్‌ మార్పును ఆలస్యం చేస్తే, కొత్త ఊరిలో ఇన్సూరెన్స్‌, వాహన ఫైనాన్స్‌లకు ఇబ్బంది అవుతుంది.

RC బుక్‌ ట్రాన్సఫర్‌, లైసెన్స్‌ అడ్రస్‌ మార్పు చిన్న పనిగా అనిపించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒకప్పుడంటే RTO ఆఫీస్‌ చుట్టూ తిరగాలి గానీ, ఇప్పుడు డిజిటల్‌ సౌకర్యాల వల్ల ఈ పనులు ఆన్‌లైన్‌లోనే సులభంగా పూర్తవుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget