Honda WN7 Electric Bike: 130km రేంజ్, 30 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ బైక్
Honda WN7 Electric Bike Unveiled: హోండా తొలి ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ బైక్ WN7 తెర తొలగింది. 130km రేంజ్, CCS2 ఫాస్ట్ ఛార్జింగ్, 18kW మోటార్ పవర్‌తో యూత్ కోసం సూపర్ ఛాయిస్‌గా రాబోతోంది.

Honda WN7 Electric Bike Launch Features: హోండా ఎట్టకేలకు తన తొలి ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. Honda WN7 పేరుతో తొలుత యూరోప్ మార్కెట్లకు పరిచయం చేసిన ఈ బైక్, ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో హోండా కొత్త యుగానికి నాంది పలికింది. ఇది, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో హోండాకు మరో మలుపు లాంటింది. ఈ బైక్ “EV Fun Concept” నుంచి అభివృద్ధి చేసిన మోడల్, EICMA 2024 లో కనిపించిన కాన్సెఫ్టుకు ప్రాక్టికల్ రూపమే ఈ EV.
డిజైన్ & పేరు వెనకున్న అర్థం
Honda WN7 డిజైన్ పూర్తిగా మినిమలిస్ట్‌గా, షార్ప్‌గా ఉంది. 2024లో EICMAలో చూపించిన కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉండే లుక్స్ ఈ బైకు ఇచ్చారు. WN7 అనే పేరుకూ ప్రత్యేక అర్థం ఉంది.
W అంటే Wind (డెవలప్‌మెంట్ థీమ్ నుంచి)
N అంటే Naked (బైక్ స్టైల్‌కి గుర్తింపు) - ఈ బైక్ నేకెడ్ స్టైల్‌లో ఉంటుంది, ఎక్కువగా కనబడే యాక్సెంట్స్ తగ్గించి సూటిగా ఉంటుంది.
7 అంటే ఇది ఉన్న పవర్ క్లాస్ - ఇది హోండా ప్రకారం ఒక సబ్సెట్యూల్ పవర్ ఏరియాలో ఉంది.
ఈ ఎలక్ట్రిక్ బైకును స్లిమ్, మినిమల్ డిజైన్‌తో తయారు చేశారు. స్వెల్ట్ బాడీ ప్యానెల్స్, సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్, స్టైలిష్ లైన్స్ ఇచ్చారు.
రేంజ్ & ఛార్జింగ్
బ్యాటరీ: ఫిక్స్‌డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, మార్చలేని విధంగా బ్యాటరీ బాడీ భాగంగా ఉంటుంది.
రేంజ్: ఈ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే Honda WN7 130 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుందని హోండా క్లెయిమ్ చేస్తోంది.
CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: 20% నుంచి 80% వరకూ ఛార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాలే పడుతుంది.
హోమ్ ఛార్జర్ (6kVA వాల్ బాక్స్) ఉపయోగిస్తే, ఈ బ్యాటరిని 0 నుంచి 100% పూర్తిగా ఛార్జ్ చేయడానికి మూడు గంటల లోపే సరిపోతుంది.
ఇంజిన్ పవర్, వేరియంట్లు & పెర్ఫార్మెన్స్
ప్రధాన వేరియంట్: Honda WN7లో 18kW (24.5hp) వాటర్-కూల్డ్ మోటార్ ఉంది. హోండా ప్రకారం, ఇది 600cc ICE బైక్ పెర్ఫార్మెన్స్‌కి లేదా సుమారు 24.5 హార్స్‌పవర్‌కి దగ్గరగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా, 100Nm టార్క్ ఉండటం వల్ల బైక్ పికప్ చాలా శక్తిమంతంగా ఉంటుంది.
రో వేరియంట్: యూత్ రైడర్స్ కోసం హోండా ప్లాన్ చేసిన మరో వెర్షన్ ఇది. ఇది 11kW (15hp) వేరియంట్, A1 లైసెన్స్ హోల్డర్స్ కోసం ప్రత్యేకంగా యూరప్‌లో అందుబాటులోకి రానుంది.
బరువు: 217 కిలోలు - ఇది ఫుల్ సైజ్ ఎలక్ట్రిక్ బైక్‌లలో సరాసరి బరువు.
ఫీచర్లు & టెక్నాలజీ
Honda WN7లో ఫీచర్ల పరంగా కూడా కొత్త లెవెల్‌లో ఉంది
5 అంగుళాల TFT డిస్‌ప్లే
RoadSync స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
EV-స్పెషల్ మెనూ
ఆల్ LED లైటింగ్ - బైక్ ముందు-వెనుక కూడా పూర్తిగా LED లైటింగ్
సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్ (కాన్సెప్ట్ నుంచి కొనసాగింపు) - డిజైనింగ్‌లో స్టైలిష్ టచ్.
కలర్ ఆప్షన్లలో Gloss Black with Copper Accents, Matte Black, Grey ఉన్నాయి.
ధర & లాంచ్ వివరాలు
యూరప్‌లో Honda WN7 ప్రారంభ ధరను GBP 12,999 గా నిర్ణయించారు. మన దేశంలో ఇది సుమారు ₹15.5-15.6 లక్షలకు సమానం.
లాంచ్ తేదీ: స్పెసిఫిక్ డేట్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. అయితే, 2025 నవంబర్‌లో జరగనున్న EICMA లో పూర్తి స్పెసిఫికేషన్లు ఉంటాయి. డెలివరీలు 2026 నుంచి యూరోప్ మార్కెట్‌లో ప్రారంభం కావచ్చు.
కానీ, కొన్ని విషయాలు ఇంకా స్పష్టంగా లేవు. బ్యాటరీ కాపాసిటీ (kWhలో), టాప్ స్పీడ్, ఛార్జింగ్ స్టేషన్లు, ఇండియాలో లాంచింగ్, మెయిన్‌టెనెన్స్ ఖర్చులపై క్లారిటీ లేదు. ఈ వివరాలన్నీ లాంచ్ టైమ్‌లో తెలుస్తాయి.





















