Honda Unicorn Price Cut: GST 2.0తో హోండా యునికార్న్ రేటు ఎంత దిగొచ్చింది? AP, తెలంగాణలో కొనాలంటే ముందు ఇది తెలుసుకోవాలి
Honda Unicorn GST Cut: హోండా యునికార్న్ 163 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పరిగెడుతుంది. ఈ ఇంజిన్ 13 bhp శక్తిని ఇస్తుంది.

Honda Unicorn Price GST Affect: కేంద్ర ప్రభుత్వం GST రేట్లను సవవరించింది, దీనిని GST 2.0 అని పిలుస్తున్నారు. జీఎస్‌టీ సంస్కరణల (GST reforms) కింద, ఇప్పుడు, ప్రజలు ద్విచక్ర వాహనాలు & కార్లను కొనుగోలు చేయడం సులభం అవుతుంది. GST తగ్గింపు తర్వాత ఈ రెండు రకాల వాహనాల ధరలు తగ్గుతాయి. హోండా యునికార్న్ రేటు కూడా దిగొచ్చింది. మీరు ఈ పండుగ సీజన్‌లో ఈ బండిని కొనాలని ప్లాన్ చేస్తుంటే, మునుపటితో పోలిస్తే ఇప్పుడు హోండా యునికార్న్ ఎంత చౌకగా మారిందో ముందు తెలుసుకోవాలి.
హోండా యునికార్న్ ధర ఎంత మారింది?
Honda Unicorn బైక్‌లో 163cc సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 350 cc కంటే తక్కువ కేటగిరీ కాబట్టి, మీరు ఈ బండి మీద ఏకంగా 10% GST తగ్గింపును పొందుతారు. తెలుగు రాష్ట్రాల్లో హోండా యునికార్న్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష 20 వేల 727. 10% GST తగ్గింపు తర్వాత, ఈ ధర దాదాపు రూ. 1 లక్ష 9 వేలు (Honda Unicorn New Price After GST Cut) అవుతుంది. ఈ విధంగా, మీరు ఈ బైక్‌పై దగ్గరదగ్గరగా 12 వేల రూపాయల ప్రయోజనాన్ని (తగ్గింపు) పొందుతారు. ఈ తగ్గింపు ధరలు ఈ నెల 22 నుంచి (22 సెప్టెంబర్ 2025) అమలవుతాయి.
హోండా యునికార్న్ ఫీచర్లు
హోండా యునికార్న్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (Honda Unicorn Features) ఏర్పాటు చేశారు. దీంతో పాటు, LED హెడ్‌ల్యాంప్‌లు, సర్వీస్ రిమైండర్, 15 వాట్ల USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ మోటార్ సైకిల్‌లో అందించారు. ఈ బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్ & ఎకో ఇండికేటర్ కూడా ఉన్నాయి. హోండా యునికార్న్‌లోని ఈ కొత్త ఫీచర్లతో, ఈ బైక్ అమ్మకాల ద్వారా హోండా తన మార్కెట్ వాటా పెంచుకోవాలనుకుంటోంది.
హోండా యునికార్న్ పవర్
163 cc సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో (Honda Unicorn Engine) నడిచే హోండా యునికార్న్, 13 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది & 14.6 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ బైక్ ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు, ఇది వేగంలోనూ స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
హోండా యునికార్న్ మైలేజ్
హోండా యునికార్న్‌లో OBD2 (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ 2) కూడా అమర్చారు, దీని కారణంగా ఈ బైక్ ఒక పరిమితి కంటే ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేయదు. ARAI సర్టిఫై చేసిన ప్రకారం, హోండా యునికార్న్ మైలేజ్ (Honda Unicorn Mileage) లీటరుకు 60 కిలోమీటర్లు. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ప్రతిపాదిత మైలేజీ ప్రకారం, 780 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.





















