అన్వేషించండి

Honda Activa మ్యాజిక్‌!, కంపెనీలో అత్యధిక అమ్మకాలు సాధించిన టూవీలర్‌, ధర & ఫీచర్లు ఇవే

Honda Activa Price: హైదరాబాద్‌/విజయవాడలో హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ. 84 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ బండి యువతకు ఇష్టమైన టూవీలర్‌.

Honda Activa Price, Mileage And Features In Telugu: హోండా టూ వీలర్స్, మొత్తం భారతదేశంలో, రెండో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ. ఈ కంపెనీ, గత నెలలో ‍‌(జులై 2025) అమ్మకాల పరంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది, నెలవారీ గరిష్ట స్థాయిని సాధించింది. గత నెలలో, ఈ బ్రాండ్‌ టూవీలర్లు తెగ అమ్ముడయ్యాయి. వాటిలో హోండా యాక్టివా ఫుల్‌ యాక్టివ్‌గా కనిపించింది.

హోండా అమ్మకాల జాబితాలో (Honda sales report, August 2025), హోండా యాక్టివా అగ్రస్థానంలో ‍‌(Honda Activa Most Selling Scooter) ఉంది. గత నెలలో మొత్తం 2 లక్షల 37 వేల 413 మంది కస్టమర్లు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గత ఏడాది అదే నెల, అంటే జులై 2024లో అమ్ముడైన మొత్తం 1 లక్ష 95 వేల 604 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది జులైలో 41,809 యూనిట్లను ఎక్కువగా అమ్మింది. ఇది 21 శాతం వార్షిక పెరుగుదలను చూపిస్తుంది.

రెండు & మూడు ర్యాంకుల్లో ఏ బండి ఉంది? 
జులై 2025లో అమ్మకాల పరంగా, Honda Shine రెండో స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 1 లక్ష 38 వేల 665 మంది ఈ బైక్‌ను కొనుగోలు చేశారు. అయితే, ఇది వార్షిక ప్రాతిపదికన ‍‌(జులై 2024 తో పోలిస్తే) స్వల్ప తగ్గుదలను చూపిస్తుంది. 2025 జులై సేల్స్‌ జాబితాలో Honda Unicorn మూడో స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 30 వేల 572 యూనిట్ల హోండా యునికార్న్ అమ్ముడైంది. 

హోండా యాక్టివా ధర 
తెలుగు రాష్ట్రాల్లో హోండా యాక్టివా (స్టాండర్డ్‌/బేస్‌ వేరియంట్‌) ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173 నుంచి (Honda Activa ex-showroom price, Hyderabad Vijayawada) ప్రారంభమవుతుంది. దీనిని విజయవాడలో దాదాపు రూ. 1.11 లక్షల ఆన్‌-రోడ్‌ రేటుకు (Honda Activa on-road price, Vijayawada) ఇంటికి తీసుకురావచ్చు. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 1.04 లక్షలు (Honda Activa on-road price, Hyderabad). 

విజయవాడలో హోండా యాక్టివా H-స్మార్ట్ వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 97,694 కాగా, ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 1.26 లక్షలు. హైదరాబాద్‌లో ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 97,168 కాగా, ఈ టాప్‌ స్పెక్‌ మోడల్‌ను దాదాపు 1.20 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు కొనవచ్చు. 

హోండా యాక్టివా స్కూటర్‌లో 109.51 cc ఇంజిన్ ఉంది, ఇది గరిష్టంగా 7.79 PS శక్తిని & 8.84 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్‌ వేరియంట్‌లో, ఈ టూవీలర్‌కు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఇంకా.. అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ESP టెక్నాలజీ & షట్టర్ లాక్ ఉన్నాయి. 

కంపెనీ లెక్క ప్రకారం, ఈ స్కూటర్ 50 కి.మీ. వరకు మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్‌కు 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ఉంది. మైలేజ్‌ లెక్క ప్రకారం, ఈ ట్యాంక్‌ను ఫుల్‌ చేస్తే 260 కిలోమీటర్ల వరకు మళ్లీ పెట్రోల్‌ బంక్‌ మొహం చూడాల్సిన అవసరం రాదు. హోండా యాక్టివా బరువు దాదాపు 109 కిలోలు.

మార్కెట్లో, TVS జూపిటర్ (TVS Jupiter) & సుజుకి యాక్సెస్ (Suzuki Access) వంటి స్కూటర్‌లకు హోండా యాక్టివా ప్రత్యక్ష పోటీని ఇస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget