అన్వేషించండి

త్రివేణీ సంగమంలో ఈ-బైక్‌ రైడ్‌ - అరగంటకు 10 రూపాయలే, సింగిల్‌ చార్జ్‌తో 60 కి.మీ రేంజ్‌

Triveni Sangam: సంగమ్‌ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌లు లాంచ్‌ అయ్యాయి. ఒక్కో చార్జ్‌తో 60 కి.మీ రేంజ్‌, తక్కువ రెంటల్‌ ఛార్జీలు, డిజిటల్‌ పేమెంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి.

Prayagraj Smart City E Bikes: త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే తెలుగు వాళ్లకు గుడ్‌ న్యూస్‌. ఎక్కువ దూరం నడవలేక పడే ఇబ్బందులకు కాలం చెల్లింది, ఇప్పుడు సీన్‌ మారింది. ప్రయాగ్‌రాజ్‌ (సంగమ్‌ సిటీ) లో, స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద, పబ్లిక్‌ బైక్‌ షేరింగ్‌ సిస్టమ్‌ (PBS) కొత్త లెవల్‌కి వెళ్లింది. సిటీలోకి ఎలక్ట్రిక్‌ బైక్‌లు (E-Bikes) ఎంటర్‌ అయ్యాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి త్రివేణీ సంగమానికి (ప్రయాగ్‌రాజ్‌) వెళ్లే పెద్దలు, మహిళలు, యువత - ఎవరైనా సరే, సిటీలో చిన్న దూరం నుంచి కాస్త ఎక్కువ దూరం వరకు సులభంగా ట్రావెల్‌ చేయవచ్చు. 

కొత్తగా వచ్చిన ఈ-బైక్‌లు
ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న Charted Bike Pvt Ltd ఇప్పటికే 25 ఈ-బైక్‌లను సిటీలోకి తీసుకువచ్చింది. వచ్చే 2, 3 నెలల్లో మరో 40 బైక్‌లు కూడా జోడించనుంది. ప్రారంభ దశలో సివిల్‌ లైన్స్‌తో పాటు 5 మెజర్‌ PBS స్టేషన్లలో ఈ-బైక్‌లు అందుబాటులోకి వస్తాయి.    

రెంటల్‌ ఛార్జీలు & రిజిస్ట్రేషన్‌
ఈ-బైక్‌లను ఉపయోగించాలంటే యూజర్స్‌ మొదటగా ₹500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. తర్వాత రెంటల్‌ ఛార్జీ కట్టాలి. ఈ ఛార్జీలను కూడా చాలా తక్కువగా ఫిక్స్‌ చేశారు:       

మొదటి 30 నిమిషాలకు = ₹10 

ప్రతి అదనపు నిమిషానికి = ₹1      

ఎప్పుడో ఒకసారి వెళ్లే యాత్రికులకే కాదు, డైలీ ఉపయోగించుకునే వాళ్లకు కూడా ప్రత్యేక ఆఫర్‌ ఉంది. రెగ్యులర్‌ యూజర్స్‌ కోసం వారపు పాస్‌ ₹400, నెల పాస్‌ ₹1,500 గా నిర్ణయించారు.    

రేంజ్ & టెక్నాలజీ
ఒక్కో ఈ-బైక్‌ ఖరీదు సుమారు ₹70,000. సింగిల్‌ చార్జ్‌తో, పెడల్‌ లేకుండా 40 కి.మీ. దూరం & పెడల్‌తో కలిపి 60 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. ప్రతి బైక్‌లో GPS సిస్టమ్‌, ఆటో-లాక్‌ మెకానిజం ఉంటుంది. అంటే, బైక్‌ సిటీ జియో-బౌండరీ దాటితే ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతుంది. దీంతో దొంగతనం రిస్క్‌ జీరో! .       

మీకు వీలైన ప్రాంతంలో హ్యాండోవర్‌ చేయొచ్చు
ఈ ప్రాజెక్ట్‌ కింద, సంగమ్‌ సిటీలో ఇప్పటికే 70 బైక్‌ స్టేషన్లు నిర్మించారు. వీటిని త్వరలోనే ఈ-బైక్‌లతో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. అద్దెకు తీసుకునే వ్యక్తి, ఒక స్టేషన్‌లో బైక్‌ తీసుకుని, మరొక స్టేషన్‌లో అప్పగించవచ్చు. దీనివల్ల తెలుగు యాత్రికులకు సమయం ఆదా అవుతుంది. బైక్‌ అప్పగించడానికి మొదటి స్టేషన్‌కు తిరిగి రావలసిన అవసరం లేదు కాబట్టి ఆ దూరానికి చెల్లించాల్సిన డబ్బు కూడా ఆదా అవుతుంది.    

డిజిటల్‌ పేమెంట్స్‌
అన్ని లావాదేవీలు డిజిటల్‌గా జరుగుతాయి. మీ చేతిలో డబ్బు లేకపోయినా, స్మార్ట్‌ ఫోన్‌ లేదా కార్డ్‌ ఉంటే చాలు. అన్ని లావాదేవీలు క్యాష్‌లెస్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతాయి.      

సంగమ్‌ సిటీలో కొత్తగా ప్రారంభమైన ఈ-బైక్‌లు అర్బన్‌ మొబిలిటీకి కొత్త దారి చూపిస్తున్నాయి. అంతేకాదు, తక్కువ ఖర్చు, ఈజీ రైడ్‌, గ్రీన్‌ ట్రావెల్‌ వల్ల యాత్రికులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు.       

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget