అన్వేషించండి

Hero Xtreme 250R నుంచి Pulsar NS400Z.. బడ్జెట్‌లో పవర్‌ఫుల్ బైక్‌లు, వాటి ఫీచర్లు ఇవే

Best bikes in budget | భారత్ లో 2 లక్షల లోపు హీరో ఎక్స్‌ట్రీమ్ 250R, బజాజ్ పల్సర్ NS400Z వంటి బైకులు ఉన్నాయి. ధర, ఇంజిన్, ఫీచర్లు, మైలేజ్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు యువతకు 2 లక్షల రూపాయల కంటే తక్కువ ధరలో పలు పవర్‌ఫుల్ బైక్స్ వస్తున్నాయి. మీరు స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా.. Hero Xtreme 250R, Triumph Speed T4 బైక్, Bajaj Pulsar NS400Z మీకు అద్భుతమైన ఛాయిస్ కావచ్చు. ఈ 3 బైక్‌లు శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉండటంతో పాటు ఆధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉన్నాయి.

Hero Xtreme 250R

హీరో మోటోకార్ప్ కొత్త Hero Xtreme 250R కంపెనీ 250cc ప్లాట్‌ఫారమ్‌పై వచ్చింది. బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,65,938. ఇందులో 249.03cc లిక్విడ్ కూల్డ్ DOHC సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 30 PS (29.5 bhp) శక్తిని, 25 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బైక్ డిజైన్ చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS, 320mm ఫ్రంట్ డిస్క్, 230mm రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫీచర్లలో డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, 3 రంగు ఎంపికలతో వచ్చింది.

Triumph Speed T4

భారతదేశంలోని బడ్జెట్ విభాగంలో తన అత్యంత సరసమైన బైక్  ట్రయంఫ్ - Triumph Speed T4ని ప్రారంభించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,92,539. ఇది 398.15cc లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 30.58 bhp శక్తిని, 36 Nm టార్క్‌ను అందిస్తుంది.

డిజైన్ పరంగా చూస్తే ఇది క్లాసిక్ కేఫ్ రేసర్ స్టైల్ బైక్. ఇది రౌండ్ LED హెడ్‌లైట్, ఫ్లాట్ హ్యాండిల్‌బార్, సింగిల్ సీటును కలిగి ఉంది. ఇది రెట్రో లుక్‌ను ఇస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఛానల్ ABS, 310mm ఫ్రంట్, 255mm రియర్ డిస్క్‌లు ఉన్నాయి. ఫీచర్లలో డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్, USB సాకెట్, 5 రంగు ఎంపికలు (ఫిల్ట్రో యెల్లో, కాస్పియన్ బ్లూ వంటివి) ఉన్నాయి.

బజాబ్ పల్సర్ (Bajaj Pulsar NS400Z)

మీరు పవర్, పనితీరు విషయంలో రాజీ పడకూడదనుకుంటే Bajaj Pulsar NS400Z మీకు సరైన బైక్. దీని ప్రారంభ ధర రూ. 1,92,794. ఇది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 400cc బైక్‌లలో ఒకటి. ఇది 373.27cc లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్ DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 PS శక్తిని, 35 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బజాజ్ పల్సర్ బైక్ కేవలం 6 సెకన్లలో 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

డిజైన్ పరంగా NS400Z మస్క్యులర్ స్ట్రీట్‌ఫైటర్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది LED హెడ్‌లైట్‌లు, ఫ్లోటింగ్ ప్యానెల్‌లు, బోల్డ్ గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఫీచర్లలో TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్, 4 రంగు ఎంపికలు ఉన్నాయి. కొత్త 2025 వెర్షన్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది. ఇది గేర్ షిఫ్టింగ్‌ను మరింత వేగంగా, సులభతరం చేస్తుంది. ఈ బైక్ KTM 390 Duke బైక్, TVS Apache RTR 310 లకు  పోటీనిస్తుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget