అన్వేషించండి

Hero Xtreme 125R, TVS Raider 125, Honda CB125 Hornet - ఇంజిన్‌, ఫీచర్లు, ధరల్లో ఏది బెస్ట్‌?

Hero Xtreme 125R, TVS Raider 125, Honda CB125 Hornet బైక్‌ల మధ్య పోలిక. ఇంజిన్‌ పవర్‌, ఫీచర్లు, 0-60 స్పీడ్‌, ఎక్స్‌-షోరూమ్‌ ధరల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Best 125cc Bikes 2026 India: భారత మార్కెట్‌లో 125cc బైక్‌ సెగ్మెంట్‌ ఇప్పుడు యూత్‌ను టార్గెట్‌ చేస్తూ బాగా హీటెక్కింది. ఒకప్పుడు మైలేజ్‌ మాత్రమే ఈ సెగ్మెంట్‌కు గుర్తింపుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పవర్‌, డిజైన్‌, డిజిటల్‌ ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీతో 125cc బైక్‌లు కూడా స్పోర్టీగా మారాయి.

ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే పాపులర్‌ అయిన Hero Xtreme 125R, TVS Raider 125లకు ఇప్పుడు Honda CB125 Hornet పోటీగా దిగింది. మరి ఈ మూడు బైక్‌లలో ఏది యూత్‌కు సరైన ఆప్షన్‌ అవుతుంది?.

ఇంజిన్‌, పెర్ఫార్మెన్స్‌

Honda CB125 Hornetలో 123.94cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 11hp శక్తిని 7,500rpm వద్ద, 11.2Nm టార్క్‌ను 6,000rpm వద్ద ఇస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌ 0 నుంచి 60 kmph వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుంది. కెర్బ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఆయిల్స్‌ పూర్తిగా నింపిన తర్వాతి బరువు) 124kg కావడంతో ఇది వేగంగా స్పందిస్తుంది.

TVS Raider 125లో 124.8cc ఇంజిన్‌ ఉంటుంది. ఇది 11.2hp శక్తి, 11.2Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కెర్బ్‌ వెయిట్‌ కేవలం 123kg మాత్రమే కావడంతో, ఈ మూడు బైక్‌లలో ఇదే తేలికైనది. 0 నుంచి 60 kmph వేగాన్ని 5.8 సెకన్లలో చేరుకుంటుంది.

Hero Xtreme 125Rలో 124.7cc ఇంజిన్‌ ఉంది. ఇది 11.4hpతో ఈ మూడింటిలో అత్యధిక పవర్‌ను ఇస్తుంది. అయితే టార్క్‌ 10.5Nm మాత్రమే. కెర్బ్‌ వెయిట్‌ 136kg కావడంతో బరువు ఎక్కువ. 0 నుంచి 60 kmph వేగం చేరడానికి 5.9 సెకన్లు పడుతుంది.

ఫీచర్లలో ఏ బండి బలం ఎలాంటిది?

ఫీచర్ల విషయానికి వస్తే.... TVS Raider 125 ముందంజలో నిలుస్తుంది. ఇందులో 5 ఇంచుల TFT డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, SmartXconnect టెక్నాలజీ, వాయిస్‌ కమాండ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. అయితే ఇందులో ABS లేకపోవడం కొంతమందికి మైనస్‌ పాయింట్‌గా అనిపించొచ్చు.

Honda CB125 Hornet సేఫ్టీపై ఎక్కువ ఫోకస్‌ చేసింది. ఇందులో సింగిల్‌ ఛానల్‌ ABS, ఈ సెగ్మెంట్‌లో తొలిసారి ఇచ్చిన USD ఫ్రంట్‌ ఫోర్క్స్‌ ఉన్నాయి. అలాగే 4.2 ఇంచుల TFT స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ (Honda RoadSync యాప్‌ ద్వారా), Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

Hero Xtreme 125R సింపుల్‌ & ఉపయోగపడే ఫీచర్లతో వస్తుంది. ఇందులో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, USB ఛార్జింగ్‌, అలాగే సింగిల్‌ ఛానల్‌, డ్యుయల్‌ ఛానల్‌ ABS ఆప్షన్లు ఉన్నాయి.

ధరల కంపారిజన్ - యూత్‌ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది?

TVS Raider 125: రూ. 82,010 (ఎక్స్‌-షోరూమ్‌)

Hero Xtreme 125R: రూ. 89,000 (ఎక్స్‌-షోరూమ్‌)

Honda CB125 Hornet: రూ. 1,14,582 (ఎక్స్‌-షోరూమ్‌)

యూత్‌కు ఏది బెస్ట్‌?

బడ్జెట్‌, ఫీచర్లు కావాలంటే TVS Raider 125

సేఫ్టీతో పాటు ప్రీమియం ఫీల్‌ కావాలంటే Honda CB125 Hornet

పవర్‌, స్పోర్టీ లుక్‌ ఇష్టమైతే Hero Xtreme 125R 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget