Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!
హీరో ద్విచక్రవాహనాల ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరగనున్నాయి.
Price Hike on Two Wheelers: ఇప్పుడు కొత్త ఆర్డీఈ నిబంధనలు అమలులోకి రావడానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం అప్‌డేట్, వాహనాల కొత్త ధరలను ప్రకటించడంలో నిమగ్నమై ఉన్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌కార్ప్ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం పెంచనున్నాయి.
వేరియంట్‌ల ప్రకారం ధరలు పెరుగుతాయి
వాహనాలపై పెరిగిన ధరలు వివిధ మోడళ్లకు చెందిన వివిధ వేరియంట్‌ల ప్రకారం వర్తిస్తాయి. ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ 2 (OBD 2) నిబంధనల కారణంగా తయారీ వ్యయం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. దీని తర్వాత దేశంలో అత్యధికంగా ఇష్టపడే స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ ధరలు దాదాపు రూ. 1,500 వరకు పెరగడాన్ని చూడవచ్చు.
2022 డిసెంబర్‌లో కూడా ధరలు పెరిగాయి
కొన్ని నెలల క్రితం 2022 డిసెంబర్ 1వ తేదీన కూడా ద్రవ్యోల్బణ ధరల పెరుగుదల కారణంగా కంపెనీ తన ద్విచక్రవాహనం ధరలను సుమారు రూ.1,500 పెంచింది. విభిన్న మోడల్‌లు, వేరియంట్‌ల ప్రకారం ఇది భిన్నంగా ఉంటుంది.
ద్విచక్ర వాహనాలు ఖరీదైనవి కావడానికి కారణాలు
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం వాహనాల రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గారాలను (RDE) పర్యవేక్షించడానికి ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్స్ అవసరం. అదే సమయంలో వాహనాల నుంచి ఉద్గారాల గురించి సమాచారాన్ని అందించడానికి పని చేస్తుంది.
రాబోయే కొద్ది సంవత్సరాల్లో మిలియన్ కంటే ఎక్కువ వాహనాల ఉత్పత్తి
Hero Motorcorp ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం కంపెనీ రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో ఒక మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తి చేయనుంది. అదే సమయంలో వాహనాల ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి, దాని వినియోగదారులకు ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడం కొనసాగిస్తుంది.
ఇటీవల హీరో మోటార్‌కార్ప్ అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జీరో మోటార్‌సైకిల్‌తో జతకట్టింది. హీరో మోటోకార్ప్ బోర్డు 2022 సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌లో రూ. 585 కోట్ల (USD 60 మిలియన్లు) వరకు ఈక్విటీ పెట్టుబడిని ఆమోదించింది.
హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా ఇటీవలే కొత్త షైన్ 100 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 100 సీసీ కమ్యూటర్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హోండా షైన్ 100లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, దాని కొత్త ఫ్యూయల్-ఇంజెక్ట్ 99.7 సీసీ ఇంజన్. ఇది 7.61 hp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 100 సీసీ సెగ్మెంట్‌లో పోటీని పెంచబోతోంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.
హోండా తన కొత్త షైన్ 100ని రూ.64,900 ధరలో విడుదల చేసింది. ఇది ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర. 100 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఇది మంచి కాంపిటీటివ్ స్ట్రాటజీ. కొత్త బైక్ కావాలనుకునే వారికి మంచి ఆప్షన్ కూడా.