Harley X440 T కొత్త మోడల్ – Speed 400, CB350RS, Classic 350 కంటే బెటర్‌గా ఉందా?
Harley Davidson X440 T కొత్త మోడల్ వచ్చేసింది. Triumph Speed 400, Honda CB350RS, Royal Enfield Classic 350 తో పోలిస్తే ఇది ఎంత పవర్‌ఫుల్?.

Harley Davidson X440 T Comparison: హార్లే డేవిడ్సన్ X440 T తాజాగా మన మార్కెట్లోకి అడుగుపెట్టింది. Harley Davidson X440 సిరీస్‌లో ఇది టాప్ మోడల్. అదనపు ఫీచర్లు, అప్‌డేట్ చేసిన లుక్, మెరుగైన ఎలక్ట్రానిక్స్‌తో ఇది ప్రత్యర్థులైన Triumph Speed 400, Honda CB350RS, Royal Enfield Classic 350 కి గట్టి పోటీ ఇస్తోంది. ఈ నాలుగు బైక్స్‌ను కంపేర్ చేసినప్పుడు.. ఏ బండి ముందు వరుసలో నిలుస్తుంది?.
ఇంజిన్ పవర్ – ఏ బండి శక్తి ఎక్కువ?
ఈ సెగ్మెంట్‌లో Triumph Speed 400 స్పష్టంగా ముందుంది. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది, అలాగే 40hp శక్తిని ఇస్తుంది. మిగిలిన బైక్స్ కంటే ఇది ఎక్కువ పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. Speed 400 టార్క్ 37.5Nm ఉండగా, X440 T 38Nm టార్క్ ఇస్తుంది. అంటే పవర్ విషయంలో X440 T దగ్గరగా వచ్చినప్పటికీ, Triumph దే పైచేయి.
Harley X440 T, Honda CB350RS, Classic 350 - ఈ మూడు కూడా లోయర్ రేవ్ రేంజ్‌లో టార్క్‌ను ఇస్తాయి. దీనివల్ల సిటీ రైడింగ్‌లో ఈ మూడు బైక్స్ మరింత బెటర్ అనిపిస్తాయి.
Harley & Triumph 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుండగా, Honda & Royal Enfield 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కొనసాగిస్తున్నాయి.
బరువు, సైజ్ – ఏ బండి తేలిక?
ఇక్కడ కూడా Triumph Speed 400 ముందుంది, ఇది ఈ నాలుగింటిలో తేలికైనది. తక్కువ బరువు + ఎక్కువ పవర్ = మెరుగైన పనితీరు.
Royal Enfield Classic 350 మాత్రం 195 కేజీలతో ఈ లిస్ట్‌లో అత్యంత బరువైన బండి. కొత్త X440 T కూడా 1.5kg పెరిగి 192kg లకు చేరింది.
Honda CB350RS 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది, దీనిని ఒక్కసారి ఫిల్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు.
సస్పెన్షన్, బ్రేకులు, టైర్లు – ఏ సెటప్ బెస్ట్?
Harley X440 T & Triumph Speed 400 రెండు కూడా USD ఫ్రంట్ ఫోర్క్స్ ఉపయోగిస్తాయి. Honda & Royal Enfield మాత్రం టెలిస్కోపిక్ సెటప్‌ను కొనసాగిస్తున్నాయి.
రియర్‌లో మాత్రం Triumph మాత్రమే మోనోషాక్ ఉపయోగిస్తోంది. మిగతా మూడు బైక్స్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌తో వస్తాయి.
Harley X440 T పెద్ద డిస్క్ బ్రేక్స్ అందిస్తోంది, ఇది బ్రేకింగ్ పనితీరులో స్పష్టమైన ప్రయోజనం.
టైర్ సైజ్‌లలో కూడా వ్యత్యాసం ఉంది. Triumph రెండూ 17 అంగుళాల టైర్లతో రోడ్-ఓరియెంటెడ్‌గా ఉంటుంది. Classic 350 మాత్రమే 17 అంగుళాల రియర్ వీల్‌ను ఉపయోగించని ఏకైక బైక్.
ఫీచర్లు – ఏ టూవీలర్ ముందుంది?
ఇక్కడ పూర్తి స్పష్టత ఉంది - Harley-Davidson X440 T ది అప్పర్ హ్యాండ్. ఈ బైక్‌లో:
- రైడ్-బై-వైర్
- రోడ్ & రెయిన్ మోడ్‌లు
- ట్రాక్షన్ కంట్రోల్ (మార్చుకోవచ్చు)
- డ్యూయల్-ఛానల్ ABS
- 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే
- హార్డ్ బ్రేకింగ్ పానిక్ అలర్ట్
అంటే, మోడ్రన్ ఎలక్ట్రానిక్స్‌లో X440 T ఎవరూ అందించని ప్యాకేజీని ఇస్తోంది. ఇతర బైక్స్‌లో అన్నీ అనలాగ్-డిజిటల్ క్లస్టర్లు మాత్రమే ఉన్నాయి. Classic 350కి ట్రిప్పర్ నావిగేషన్ ఉన్నా, అది వేరే విషయం.
ధర – ఏ మోటర్‌సైకిల్ అందుబాటులో ఉంది?
- Harley-Davidson X440 T - రూ. 2.80 లక్షలు
- Triumph Speed 400 - రూ. 2.34 లక్షలు
- Honda CB350RS - రూ. 1.97 లక్షలు – రూ. 2 లక్షలు
- Royal Enfield Classic 350 - రూ. 1.81 లక్షలు – రూ. 2.16 లక్షలు
ఈ లిస్ట్‌లో, Royal Enfield Classic 350 ది అతి తక్కువ ధర. Speed 400 కూడా స్ట్రాంగ్ ప్యాకేజీ + వాల్యూతో మంచి స్థానం దక్కించుకుంది. Harley X440 T ధర మాత్రం ఎక్కువ, కానీ అందించే ఫీచర్లను చూస్తే అదీ సరైనదే.
ఓవరాల్‌గా చెప్పాలంటే... పెర్ఫార్మెన్స్ కావాలంటే Triumph Speed 400; రెట్రో లుక్, ఈజీ రైడింగ్ కావాలంటే Classic 350; అధునిక ఫీచర్లు, ప్రీమియం టెక్నాలజీ కావాలంటే Harley X440 T స్పష్టమైన ఎంపిక. ప్రతి బైక్ ప్రత్యేకంగా ఏదో ఒక విభాగంలో షైనింగ్ స్టారే. రైడర్ ప్రాధాన్యతతను బట్టి బైక్‌ను నిర్ణయించుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















