![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Winter Car Care Tips: వింటర్‌లో కారు స్టార్ట్ కావట్లేదా? - ఈ టిప్స్ ఫాలో అయితే తోయాల్సిన అవసరం రాదు!
Car Care Tips: వింటర్‌లో కారు స్టార్ట్ అవ్వకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి.
![Winter Car Care Tips: వింటర్‌లో కారు స్టార్ట్ కావట్లేదా? - ఈ టిప్స్ ఫాలో అయితే తోయాల్సిన అవసరం రాదు! Follow These Car Care Tips in Winter Starting Trouble Will be Solved Winter Car Care Tips: వింటర్‌లో కారు స్టార్ట్ కావట్లేదా? - ఈ టిప్స్ ఫాలో అయితే తోయాల్సిన అవసరం రాదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/05/5ea9462413924546e7dd1b1a73d2dcbd1677999239672551_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Car Care Tips in Winter: అన్ని సీజన్లలో మీ కారును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే శీతాకాలంలో దాని అవసరం కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ సరిగా పని చేయక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి తెలుసుకుందాం.
1. వోల్టేజీని చెక్ చేయండి
మీ కారు తక్కువగా ఉపయోగించినట్లయితే దాని బ్యాటరీ తరచుగా డిశ్చార్జ్ అవుతుంది. దీని కారణంగా మీరు మంచి పనితీరును పొందలేరు. అందువల్ల మొదట బ్యాటరీ స్టేటస్‌ను చెక్ చేయడం ముఖ్యం. దీని కోసం వోల్టేజ్ టెస్టింగ్ చేయడం మంచిది. ఇది బ్యాటరీ పరిస్థితి గురించి చెబుతుంది. అవసరమైతే సరైన ఛార్జ్ పెట్టుకోవడం మంచిది. దీని కారణంగా బ్యాటరీతో పాటు కారు పనితీరు కూడా పెరుగుతుంది.
2. ఛార్జింగ్ సిస్టమ్ పనిచేయకపోవడం
మీ కారు బాగానే నడుస్తున్నప్పటికీ, బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ కావడం లేదు. ఒక్కోసారి కారును తోసే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు తప్పక మంచి మెకానిక్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్‌ను చెక్ చేయాలి. దీని కారణంగా ఏదైనా లోపం ఉంటే దాన్ని గుర్తించి మరమ్మతులు చేయవచ్చు.
3. బ్యాటరీని జాగ్రత్తగా చూసుకోండి
చాలా మంది కార్ల యజమానులు కారులోని ఇతర విషయాలపై శ్రద్ధ చూపుతారు. టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయిస్తారు. కానీ బ్యాటరీపై సరైన శ్రద్ధ చూపరు. దానివల్ల అందులో సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బ్యాటరీ కనెక్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. కార్బన్ డిపాజిట్లను తొలగించండి. దీని కోసం మీరు పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు.
4. బ్యాటరీని ఎంతకాలం ఉపయోగించవచ్చు?
చాలా కంపెనీలు బ్యాటరీపై 30 నెలల వరకు వారంటీని అందిస్తాయి. అదనపు ఛార్జీకి పొడిగించిన వారంటీని కూడా అందిస్తాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే మూడేళ్లకు మించి వాడుకోవచ్చు.
మరోవైపు బడ్జెట్ టెస్లా కారు రూ. 20 లక్షల కంటే తక్కువ ధరలో మనదేశంలో లాంచ్ కానుందట. అయితే ఇప్పుడే కాదు 2026లో ఈ కారు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రూ. 60 లక్షల ధరతో కలిగిన మోడల్ 3 త్వరలో ఇండియా విడుదల కావచ్చు. బడ్జెట్ ధరలో రూ.20 లక్షలలోపు టెస్లా కారును కొనుగోలు చేయాలనుకుంటే మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. టెస్లా దాని సీబీయూ ప్రొడక్ట్స్‌లో కొన్నింటిని భారతదేశంలో లాంచ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే మోడల్ 3, మోడల్ వై మొదటగా లాంచ్ కానున్నాయి. వాటి ధర రూ. 60 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇంపోర్టెడ్ ఛార్జీలలో మినహాయింపు ఇస్తే ఈ ధర ఇంకా కొంచెం తక్కువగా ఉండవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)