అన్వేషించండి

EV Buses Electreon Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లు: కేబుల్స్ లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అయ్యే ఈవీ బస్సులు.. త్వరలోనే ఇండియాలోకి సరికొత్త టెక్నాలజీ

ఇజ్రాయెల్‌కు చెందిన ఎలెక్ట్రాన్ సంస్థ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండా రోడ్డుపైనే ఈవీ బస్సులను ఛార్జ్ చేసే వైర్‌లెస్ టెక్నాలజీని భారత్‌లోకి తీసుకురానుంది.

Electreon Wireless Charging Technology for EV Buses: ఎలెక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా ఎలెక్ట్రాన్ (Electreon) సంస్థ సరికొత్త వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. టెల్ అవీవ్‌లో జరిగిన సామ్సన్ స్మార్ట్ మొబిలిటీ సమిట్ 2026 లో భాగంగా మీడియాతో మాట్లాడిన కంపెనీ ప్రతినిధి గిలాడ్ షారన్ ఈ టెక్నాలజీ వివరాలను వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల కోసం డిజైన్ చేసిన ఈ సిస్టమ్ ద్వారా ఎలెక్ట్రిక్ బస్సులు ఎలాంటి హ్యాండ్లింగ్ లేదా మ్యాన్యువల్ కేబుల్స్ అవసరం లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అవుతాయి. కరెంట్ వైర్లు పెట్టే పనిలేకుండా డ్రైవర్లు బస్సులను ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: 2026 Tata Tiago CNG Facelift: టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్  

ఈవీ వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది?

ఈ సరికొత్త టెక్నాలజీలో భాగంగా రోడ్డు ఉపరితలం కింద, బస్ డిపోల పార్కింగ్ ఏరియాలో ప్రత్యేకమైన వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లను అమరుస్తారు. ఈ ఛార్జింగ్ పాయింట్లపై ఈవీ బస్సులను పార్క్ చేయగానే ఛార్జింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. డ్రైవర్లు ఎలాంటి ప్లగ్‌లు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇజ్రాయెల్‌లోని ఒక పెద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపోలో గత మూడేళ్లుగా ఈ సిస్టమ్ విజయవంతంగా రన్ అవుతోంది. రోజువారీ సర్వీస్ తిరిగే పదుల సంఖ్యలోని ఎలెక్ట్రిక్ బస్సులు ఈ వైర్‌లెస్ విధానాన్ని వాడుకుంటూ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి.

Read Also: 2026 TVS Jupiter 125 Colors: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి...

బ్యాటరీ లైఫ్ పెంచేలా షార్ట్ స్టాప్స్ లో టాప్-అప్స్

అల్ట్రా ఫాస్ట్ వైర్డ్ ఛార్జర్ల కోసం బస్సులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడమే ఈ సిస్టమ్ లోని అతిపెద్ద అడ్వాంటేజ్. బస్సులు టెర్మినల్స్ లేదా స్టాప్‌ల వద్ద ఆగిన ప్రతిసారీ చిన్న చిన్న ఎనర్జీ టాప్-అప్స్ లభిస్తాయి. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ప్రస్తుతం 90 కిలోవాట్ల (kW) స్పీడ్‌తో పవర్ అందిస్తుంది. పెద్ద ఎత్తున ఈవీ బస్సులను మెయింటెయిన్ చేసే సంస్థలకు ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ పద్ధతి. నిరంతరం అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గే ప్రమాదం ఉంటుంది, ఈ వైర్‌లెస్ విధానం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.

ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ.. 

ఇండియాలో ఎలెక్ట్రిక్ బస్సుల మార్కెట్ శరవేగంగా పెరుగుతుండటంతో ఎలెక్ట్రాన్ సంస్థ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. దేశంలో ఎలెక్ట్రిక్ రోడ్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ టెర్మినల్స్ డెవలప్ చేయడానికి ఇప్పటికే కొన్ని ఇండియన్ కంపెనీలు తమను సంప్రదించినట్లు గిలాడ్ షారన్ కన్ఫర్మ్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు ప్రైవేట్ కార్ల కోసం కూడా హోమ్ ఛార్జింగ్ సెటప్‌ను కంపెనీ రెడీ చేస్తోంది. గ్యారేజ్ ఫ్లోర్‌పై వైర్‌లెస్ మ్యాట్ అమర్చి కారును పార్క్ చేస్తే చాలు ఛార్జ్ అయిపోతుంది. భవిష్యత్తులో షాపింగ్ మాళ్లు, పబ్లిక్ పార్కింగ్ ఏరియాల్లో కూడా ఈ సిస్టమ్ రానుంది.

టాప్ హెడ్ లైన్స్

చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
బజాజ్ పల్సర్ 150 vs టీవీఎస్ అపాచీ 160.. మీ స్టైల్‌కి ఏది సరిగ్గా సెట్‌ అవుతుందో తెలుసా?
Bajaj Pulsar 150 వర్సెస్‌ TVS Apache RTR 160.. ఏ బైక్ బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల కంపారిజన్‌
Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్‌.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?
Bajaj Chetak ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జ్‌తో నిజంగా ఎంతదూరం వెళ్లింది? రేంజ్ టెస్ట్‌ రిజల్ట్స్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget