అన్వేషించండి

Driving Licence Renewal: డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో ఎలా రెన్యువల్‌ చేయాలి, ఎంత ఫీజ్‌ కట్టాలి?

Driving Licence Renewal Process Online: మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయాలా?, అపరాధ రుసుములు ఎంత అవుతుందో తెలుసా?. ఆన్‌లైన్ స్టెప్ బై స్టెప్ ప్రక్రియను తెలుసుకోండి.

Driving Licence Renewal Online Complete Guide: మనలో చాలామంది, గడువు తీరిన తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (DL) ను రెన్యువల్‌ చేయించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపయోగించకూడదు. లైసెన్స్ రెన్యూవల్ ఆలస్యం చేస్తే మీకు ఫైన్‌ విధించవచ్చు. అంతేకాదు, మీరు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే, చెల్లని లైసెన్స్ ఉన్నందుకు జ‌రిమానా కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలనుకుంటే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకోవాలి. మరి, రెన్యూవల్ ఎలా చేయాలి? ఎంత ఫీజు చెల్లించాలి?.

రెన్యూవల్ చేయాల్సిన సమయం
మీ డ్రైవింగ్‌ లైసెన్స్ గడువు ముగియడానికి 30 రోజుల ముందు నుంచి రెన్యూవల్‌కు అప్లై చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత 5 సంవత్సరాల లోపు అప్లై చేస్తే, మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ అవసరం ఉండదు. కానీ 5 ఏళ్లు దాటితే కొత్తగా DL కోసం అప్లై చేయాలి.

ఆన్‌లైన్‌లో రెన్యూవల్ ఎలా చేయాలి?

  • parivahan.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి
  • “Online Services > Driving Licence Related Services” సెలెక్ట్ చేయండి
  • మీ రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్‌ లేదా తెలంగాణ) ఎంపిక చేసుకోండి
  • “Apply for DL Renewal” క్లిక్ చేయండి
  • అవసరమైన ఫారం (Form 2) నింపండి
  • డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  • పేమెంట్ పూర్తి చేసి, సబ్మిట్ చేయండి
  • SMS/Email ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ తెలుసుకోవచ్చు

అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్
  • ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడీ ప్రూఫ్
  • మెడికల్ సర్టిఫికెట్ (వయస్సు 40 ఏళ్లు దాటినవారికి తప్పనిసరి)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • స్కాన్‌ చేసిన సంతకం కాపీ

ఫీజులు & అపరాధ రుసుములు:

వివరాలు       మొత్తం ₹
రెన్యూవల్ ఫీజు  ₹200
గడువు ముగిసిన తర్వాత (30 రోజులు దాటితే)  ₹300 అపరాధ రుసుం
ఆలస్యం అయిన ప్రతి సంవత్సరానికి ₹100 అదనపు ఫీజు

ఉదాహరణకు... మీ లైసెన్స్ రెన్యువల్‌ 1 సంవత్సరం ఆలస్యమైతే: ₹200 + ₹300 + ₹100 = ₹600 చెల్లించాలి

ఆఫ్‌లైన్ ప్రక్రియ కూడా ఉంది
మీ స్థానిక RTO కార్యాలయానికి నేరుగా వెళ్లి కూడా రెన్యూవల్ అప్లై చేయవచ్చు. అవసరమైన ఫారాలు నింపి, ఫీజును DD రూపంలో చెల్లించి సమర్పించవచ్చు. అక్కడ బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఫొటో, ఫింగర్‌ప్రింట్‌లు ఇచ్చి ఈ పనిని పూర్తి చేయొచ్చు.

మీ డ్రైవింగ్‌ లైసెన్స్ గడువు పూర్తయ్యే 30 రోజుల ముందు రెన్యూవల్ చేయడం ఉత్తమం. ఆలస్యం చేస్తే ఎక్కువ ఫైన్‌ పడతుంది. RTO కార్యాలయానికి వెళ్లక్కరలేకుండా, ఆన్‌లైన్‌ ద్వారా 10 నిమిషాల్లో మీ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

చివరిగా... 
డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియ చాలా సులభం. డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచి, సరైన సమయానికి అప్లై చేస్తే ఫైన్‌ తప్పించుకోవచ్చు. వెహికల్‌ పర్మిట్‌ లేదా వాహన బీమా క్లెయిమ్‌లకు కూడా రెన్యూవల్ లైసెన్స్ అవసరం. కాబట్టి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తెలంగాణలో T App Folio App ద్వారా కూడా రెన్యువల్‌ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో RTA m-Wallet App ద్వారా డ్రైవింగ్‌ లైసెన్స్ రెన్యూవల్ పని పూర్తి చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!
మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
మీరు బ్రేక్ వేయకముందే మీ కారు అలర్ట్.. భారత్‌లోకి వస్తున్న V2V సేఫ్టీ సిస్టమ్ ఇదే!
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget