అన్వేషించండి

Bajaj Platina 125: తక్కువ ధరలో మైలేజ్ రాణి! రోజువారీ ప్రయాణికులకు ఇది బెస్ట్ ఆప్షన్!

New Platina 125 Mileage: బజాజ్ ఆటో, అప్‌డేటెడ్‌ ప్లాటినా 125 ను ఆవిష్కరించింది. మైలేజ్‌ & ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యతనిచ్చే రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోటార్ సైకిల్ ఇది.

Bajaj Platina 125 Price, Mileage And Features In Telugu: బజాజ్ ఆటో, కొత్త ప్లాటినా 125 ను భారతదేశానికి పరిచయం చేసింది. పెరిగిన ఇంధన ధరలు రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిన నేపథ్యంలో, బజాజ్‌ ఈ బైక్‌ను ఆవిష్కరించింది. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు & డెలివరీ బాయ్స్‌ వంటి వర్గాలకు అనువుగా దీనిని డిజైన్‌ చేశారు. నగర ట్రాఫిక్‌లో & సెమీ-అర్బన్ రోడ్లపై సులభంగా నడిపేలా రూపొందించారు. స్మూత్‌ ఇంజిన్, ఆధునిక ఫీచర్లు & తక్కువ ధరను మేళవించి, ఈ 125cc బైక్‌ను బజాజ్‌ తీసుకొస్తోంది.

రోజువారీ రైడింగ్ కోసం...
కొత్త ప్లాటినా 125 మోటార్‌ సైకిల్‌కు శక్తినివ్వడానికి 124.6cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 8.5 BHP & 10 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో మెరుగైన పనితీరు & ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి ఈ సెటప్ ఉపయోగపడుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ కారణంగా సున్నితమైన గేర్ షిఫ్టింగ్ అనుభవం కలుగుతుంది, రైడింగ్‌లో నాణ్యత పెరుగుతుంది. భారీగా ట్రాఫిక్ ఉన్న రోడ్లకు మాత్రమే కాకుండా & హైవేకి కూడా ఈ బైక్‌ అనుకూలంగా ఉంటుంది, గంటకు 95 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అంటే, దేశంలోని విభిన్న రహదారి పరిస్థితులతో ప్రయాణించగలిగేలా కొత్త ప్లాటినా 125 డిజైన్‌ ఉంది.

సౌకర్యం & భద్రత
కొత్త ప్లాటినా 125 బోర్డులో చాలా అనుకూలమైన అప్‌డేట్స్‌ ఉన్నాయి. ప్రకాశవంతమైన LED డేటైమ్ రన్నింగ్ లైట్లు పగటి పూట & స్లీకర్ హెడ్‌ల్యాంప్ రాత్రి సమయంలో విజిబులిటీని పెంచుతాయి. రైడ్‌ చేస్తున్నప్పుడు, ఒక్క చూపులోనే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అర్ధం చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన భద్రతా లక్షణం సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఇది ప్రమాదాలను తగ్గిస్తుంది. చక్కటి, విశాలమైన, కుషన్డ్ సీటు వల్ల లాంగ్ రైడ్స్‌ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ రైడర్లకు బాగా ఉపయోగపడుతుంది.

డబ్బును ఆదా చేసే అత్యుత్తమ మైలేజ్
ప్లాటినా 125 హైలైట్స్‌లో ఇంధన సామర్థ్యం ఒకటి. అనువైన పరిస్థితులలో, ఈ మోటార్‌ సైకిల్‌ లీటరుకు 100 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. వాస్తవ వినియోగం లీటరుకు 70-80 కి.మీ. మధ్య ఉండవచ్చు. 

ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ 
₹78,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ధర కారణంగా, కొత్త ప్లాటినా 125 బడ్జెట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఆప్షన్‌ అవుతుంది. నెలకు ₹2,500 కంటే తక్కువ EMI & కేవలం ₹5,000 డౌన్ పేమెంట్‌కు ఫైనాన్సింగ్ ప్లాన్‌లను బజాజ్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు, తక్కువ రన్నింగ్ ఖర్చులు ఉండటం వల్ల, ఈ బైక్‌ పొదుపు కూడా చేస్తుంది.

ఛాలెంజింగ్ రోడ్లను తట్టుకునేలా నిర్మాణం
భారతదేశంలోని అత్యంత ఛాలెంజింగ్ రోడ్లను - గుంతలు పడిన వీధులు, బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ వంటి వాటిని సమర్ధంవంతంగా తట్టుకునేలా ప్లాటినా 125 ని తయారు చేశారు. మన్నికైన నిర్మాణం & నమ్మకమైన ఇంజిన్ భాగాలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బంది పెట్టవు. 

బజాజ్ ప్లాటినా 125 అనేది సామర్థ్యం, సౌకర్యం & సరసమైన ధరలో అత్యుత్తమమైన కమ్యూటర్ బైక్. నగరంలో రోజూ తిరగడానికి, డెలివరీ పనులకు, అప్పుడప్పుడు హైవే రైడ్స్‌ కోసం ఇది నమ్మదగిన ప్రయాణ సాధనం అని కంపెనీ చెబుతోంది.

టాప్ హెడ్ లైన్స్

టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget