అన్వేషించండి

Upcoming SUVs: టాటా నుంచి మహీంద్రా వరకు – ఈ పండుగ సీజన్‌లో లాంచ్ అవుతున్న కొత్త SUVలు ఇవే!

Festival Season Car Launches: రక్షాబంధన్ నుంచి దీపావళి వరకు ఉండే ఫెస్టివ్‌ సీజన్‌ కోసం.. హ్యుందాయ్, మారుతి, మహీంద్రా & టాటా వంటి కంపెనీలు కొత్త SUVలను విడుదల చేయబోతున్నాయి.

Upcoming SUVs India 2025: భారతదేశంలో పండుగ సీజన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎప్పుడూ ప్రత్యేకమైనది. ఈసారి, 2025లో కూడా, ఫెస్టివ్‌ సీజన్‌లో ఉత్సాహం పెంచడానికి కార్ కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లాంచ్‌లు, సెప్టెంబర్‌లో మారుతి కొత్త కాంపాక్ట్ SUV ఎస్కుడో (Maruti Escudo) తో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV - eVX (eVitara) కూడా లాంచ్‌కు రెడీగా ఉంది, ఈ బండి కోసం యావద్దేశం చాలా కాలంగా ఎదురుచూస్తోంది.

2025 ఫెస్టివ్‌ సీజన్‌లో లాంచ్‌ కానున్న SUVs

1. మారుతి ఎస్కుడో (Maruti Escudo)
మారుతి సుజుకి, ఈ సంవత్సరం, కొత్త కాంపాక్ట్ SUV 'Escudo'ను విడుదల చేయనుంది. ఈ వెహికల్‌ను Arena షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తారు. ఈ SUV గ్రాండ్‌ విటారా (Grand Vitara) కంటే కొంచెం చౌకగా & దాని కంటే తక్కువ కేటగిరీలో ఉంటుంది. యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని 'ఎస్కుడో'ను రూపొందించారు & దాని ధర కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

2. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti eVitara)
మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV మారుతి eVitara అవుతుంది. ఈ మోడల్ చాలా కాలంగా వార్తల్లో ఉంది & ఎట్టకేలకు లాంచ్‌కు సిద్ధమైంది. ఈ కారు ద్వారా, మారుతి సుజుకీ, ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టబోతోంది, మార్కెట్‌ షేర్‌ సంపాదించుకోబోతోంది.

3. హ్యుందాయ్ వెన్యూ (న్యూ జెన్‌) - Hyundai Venue (New Gen)
ఫెస్టివ్‌ సీజన్‌ కోసం హ్యుందాయ్ కూడా రెడీగా ఉంది. ఈ పండుగ కాలంలో, తన ప్రసిద్ధ SUV Venue లో కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తుంది. ఈసారి మరిన్ని ఫీచర్లు, కొత్త ఇంటీరియర్ డిజైన్ & ఆధునిక స్టైలింగ్‌ను న్యూ-జెన్ వెన్యూలో చూడవచ్చు. దీనితో పాటు, Ioniq 5 EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు, ఇది కూడా అప్‌డేటెడ్‌ టెక్నాలజీ & మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.

4. మహీంద్రా బొలెరో (కొత్త తరం) - Mahindra Bolero (New Gen)
మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ SUV Bolero ఇప్పుడు కొత్త అవతారంలో వస్తోంది. కొత్త మోడల్ మరింత బాక్సీ & షార్ప్‌ డిజైన్‌తో వస్తుంది. దీనికి కొత్త ప్లాట్‌ఫామ్, మరిన్ని భద్రత లక్షణాలు & కొత్త ఇంజిన్ ఎంపికలు ఉంటాయి. బొలెరో, భారతీయ రోడ్లపై ఎప్పుడూ నమ్మదగిన వాహనం. ఇప్పుడు, మునుపటి కంటే మరింత అధునాతనంగా ఉంటుంది.

5. టాటా సియెర్రా ‍‌(Tata Sierra)
ఫెస్టివ్‌ సీజన్‌ రేస్‌లో టాటా మోటార్స్ ఏమాత్రం వెనుకబడి లేదు. ఈ కంపెనీ, తన ఐకానిక్ SUV Sierra ను కొత్త & ఆధునిక జీవనశైలి SUVగా తిరిగి తీసుకువస్తోంది. ఈ SUV.. Curvv కంటే పై విభాగంలో & Harrier కు కింద విభాగంలోకి వస్తుంది. సియెర్రా రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది - ఒకటి ఎలక్ట్రిక్ (EV) & మరొకటి అంతర్గత దహన యంత్రం (ICE). దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే, సియెర్రా EV ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో వస్తోంది.

6. టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Punch Facelift)
2021లో మార్కెట్‌లో లాంచ్‌ అయినప్పటి నుంచి Tata Punch లో ఎటువంటి పెద్ద కాస్మెటిక్ మార్పులు లేవు. ఇప్పుడు, దీని EV కౌంటర్‌పార్ట్‌కు అనుగుణంగా, కారు బయటి భాగం మారింది. క్యాబిన్‌లో చెప్పుకోదగ్గ మార్పులు చేశారు. పవర్‌ట్రెయిన్‌ మాత్రం మారలేదు, అదే 1.2L NA పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget