అన్వేషించండి

Oben Roar EZ Sigma Launch: యూత్‌ కోసం కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ - ఒక్క ఛార్జ్‌తో 175 కి.మీ. రేంజ్‌, ఫీచర్లు అదుర్స్‌!

175 Km Range Electric Bike: భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ 'ఒబెన్', కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ EZ సిగ్మాను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ 175 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది.

Oben Roar EZ Sigma Price, Range And Features In Telugu: ఒబెన్ ఎలక్ట్రిక్, తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ EZ సిగ్మాను ఆగస్టు 05, 2025న లాంచ్‌ చేసింది. ఈ బైక్ బలమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు & అద్భుతమైన బ్యాటరీ రేంజ్‌ను అందిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మునుపటి కంటే మరింత మోడరన్‌ ఫీచర్లు & లాంగ్‌ రైడింగ్‌ రైంజ్‌తో వచ్చింది. కంపెనీ దీనిని రెండు బ్యాటరీ ఎంపికలతో ప్రవేశపెట్టింది. బండి డెలివరీలు ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభమవుతాయి.

మోడరన్‌ ఫీచర్లు 
ఒబెన్ రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్‌ బైక్‌లో 5-అంగుళాల TFT స్క్రీన్‌ ఇచ్చారు, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్ & మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. కాలు కింద పెట్టకుండానే ఈ బైక్‌ను రివర్స్‌ చేయొచ్చు, రివర్స్ మోడ్ సౌకర్యం కూడా ఉంది. దొంగతనం నుంచి భద్రత కోసం యాంటీ-థెఫ్ట్ లాక్ & బ్యాటరీ స్టేటస్‌ తెలుసుకోవడానికి యూనిఫైడ్ బ్యాటరీ అలర్ట్ (UBA) కూడా ఉన్నాయి. ఉంది. రైడర్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కూడా ఈ బైక్‌లో ఒక భాగంగా మారింది. 

బ్యాటరీ & పరిధి 
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో రెండు బ్యాటరీ ఎంపికలు (Oben Roar EZ Sigma Battery options) అందుబాటులో ఉన్నాయి, మొదటిది 3.4 kWh LFP బ్యాటరీ & రెండోది 4.4 kWh ఆప్షనల్‌ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ వేరియంట్‌తో, ఈ బైక్ ఒకే ఛార్జ్‌లో 175 కి.మీ. దూరాన్ని (Oben Roar EZ Sigma Range) కవర్ చేయగలదు. దీనిలో అమర్చిన మోటారు చాలా శక్తిమంతమైనది, ఇది బైక్‌ను కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగానికి తీసుకువెళుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. అలాగే, ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి - ఎకో, సిటీ & హవోక్. ఇవి రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేయడంతో పాటు బండిని నియంత్రించగలవు.

ధర ఎంత?
ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఒబెన్ రోర్ EZ సిగ్మాను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర ‍‌(Oben Rorr EZ Sigma Price) రూ. 1.27 లక్షలు కాగా; టాప్ మోడల్ ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి పరిచయ ధరలు, పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత, ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు & రూ. 1.55 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరుగుతాయి.

బుకింగ్ & డెలివరీ 
కంపెనీ, ఒబెన్ రోర్ EZ సిగ్మా కోసం బుకింగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది. కస్టమర్‌, కేవలం రూ. 2999 డిపాజిట్ చేసి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 15, 2025 నుంచి ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ డెలివరీలు ప్రారంభం అవుతాయి. 

ఒబెన్ రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఇప్పటికే ఉన్న పాపులర్‌ మోడళ్లతో నేరుగా పోటీ పడాల్సి ఉంటుంది. దీని రైవల్స్‌లో.. Revolt RV400, Ola Roadster X & Okaya Ferrato వంటి బైక్‌లు ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget