Citroen C3: సిట్రోయెన్ సీ3 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం - రూ.11 వేలకే - తక్కువ ధరలో సూపర్ కారు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ మనదేశంలో కొత్త కారును త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
![Citroen C3: సిట్రోయెన్ సీ3 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం - రూ.11 వేలకే - తక్కువ ధరలో సూపర్ కారు Citroen C3 Pre Bookings Opened in India May Launch Soon Check Details Citroen C3: సిట్రోయెన్ సీ3 ప్రీ-బుకింగ్స్ ప్రారంభం - రూ.11 వేలకే - తక్కువ ధరలో సూపర్ కారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/840a5d009c90e8f4c81e25c9d9d34d34_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సిట్రోయెన్ మనదేశంలో తన సీ3 కార్ల ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. జూన్ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. రూ.11 వేల నామమాత్రపు రుసుము చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవల్ కారు. టాటా పంచ్, నిసాన్ మాగ్నైట్, రెనో కిగర్, మారుతి సుజుకి ఇగ్నిస్‌లతో ఈ కారు పోటీ పడనుంది.
ఇందులో 1.2 లీటర్, 1.2 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు వేరియంట్లలో సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ ఆప్షన్ అందుబాటులో లేదు.ఫైవ్-సీటర్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. సిట్రోయెన్ సీ3కి సంబంధించిన వివరాలు జూన్ 20వ తేదీన లభించనున్నాయి.
మనదేశం కోసం ఈ కారును బాగా లోకలైజ్ చేసినట్లు లుక్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల కంటే తక్కువ ధరకే ఈ కారు మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హెడ్ ల్యాంప్స్/డీఆర్ఎల్స్ వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.
ఎస్‌యూవీ కానప్పటికీ సిట్రోయెన్ సీ3లో క్లాడింగ్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు ఎస్‌యూవీ తరహా స్టాన్స్ కూడా ఉండనున్నాయి. దీని ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. విండో కంట్రోల్స్ మధ్యలో ఉన్నాయి. దీంతోపాటు మాన్యువల్ ఏసీ కూడా ఈ కారులో ఉంది.
సిట్రోయెన్ సీ3లో 10 అంగుళాల టచ్ స్క్రీన్ అందించే అవకాశం ఉంది. దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉండనుంది. ఈ కారు ధర ఎంత ఉండనుంది అనే విషయం తెలియరాలేదు.
ఫీచర్లను బట్టి చూస్తే రూ.5 లక్షల రేంజ్‌లో దీని ధర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా పంచ్ రూ.5.4 లక్షల నుంచి ప్రారంభం కానుంది. పంచ్ కంటే తక్కువ ధరకే లాంచ్ అయితే సీ3 వినియోగదారులను ఆకర్షించడం ఖాయం.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)