Electric Car Care Tips: వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా - ఇవి ఫాలో అవ్వకపోతే కారు డ్యామేజ్ ఖాయం!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్ల యజమానులు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
Electric Car Care Tips in Rainy Season: వర్షాకాలం రాగానే కార్ల యజమానులకు కొన్ని కష్టాలు మొదలవుతాయి. వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు మాత్రమే కాకుండా, కొన్ని చోట్ల నీటితో నిండిన రోడ్లు, బేస్మెంట్ పార్కింగ్‌లో నీళ్లు రావడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో వాహనాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ అంత కష్టమైన పని కాదు. దాని కోసం మీరు ఈ చిట్కాలను పాటించాలి. వాటి ద్వారా మీ ఎలక్ట్రిక్ కారు సురక్షితంగా ఉంటుంది.
ఛార్జర్‌ను సరిగ్గా మెయింటెయిన్ చేయాలి
వర్షాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ కోసం శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమైన విషయం దాని ఛార్జింగ్ డివైస్‌ల సేఫ్టీ. ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు లేదా మీరు పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అందులోకి నీరు చేరితే అది షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది.
బ్యాటరీని చెక్ చేయాలి
ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన భాగం. అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ముఖ్యం. దాని కనెక్టర్ పని చేస్తుందో లేదో చేస్తూ ఉండాలి. ఈ సీజన్‌లో ఎలుకలు కూడా వైర్లను కొరికే అవకాశం ఉంది. వీటిలో ఏదైనా మీకు కనిపిస్తే వెంటనే దాన్ని సరిచేయడం మంచిది.
క్యాబిన్ శుభ్రంగా ఉంచాలి
ఎలక్ట్రిక్ కారు క్యాబిన్‌ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో మీరు బయటి నుంచి అనేక వస్తువులను కార్లో పెడుతూ ఉంటారు. ఇందులో చాలా వాటర్ బాటిల్స్ మొదలైనవి కూడా ఉంటాయి. అందుకే క్యాబిన్‌లో తేమ ఉండకుండా శుభ్రంగా ఉంచడం కూడా అవసరం. కారు క్యాబిన్‌లో ఉండే తేమ వల్ల విద్యుత్ సమస్య ఏర్పడవచ్చు కాబట్టి డోర్లు, విండోలు క్లోజ్ అయ్యాయని, ఎటువంటి లీకేజీ లేకుండా ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
నీటితో నిండిన రోడ్లతో నడపడం తగ్గించండి
ఇది ఐసీఈ ఇంజిన్‌లు ఉన్న వాహనాలకు కూడా వర్తిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం రెట్టింపు శ్రద్ధ అవసరం. ఎందుకంటే వీటిలో నీటి వల్ల కలిగే నష్టం మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల్లో చాలా సున్నితమైన భాగాలు, సెన్సార్లు ఉన్నాయి. ఇవి చాలా సులభంగా దెబ్బతింటాయి. అలాగే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు దాని ఐపీ రేటింగ్ గురించి తప్పకుండా తెలుసుకోండి.
ప్రస్తుతం వస్తున్న మంచి ఎలక్ట్రిక్ వాహనాలు మెరుగైన ఐపీ రేటింగ్‌లతో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన భాగాలకు బాగా సీల్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీల ప్రకారం కనెక్టర్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial