సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
మీ కారును అమ్మేయాలనుకుంటున్నారా? అయితే వీటిని పాటించాల్సిందే.
Best Resale Value Tips: దాదాపు ప్రతి కారు యజమాని, అది బడ్జెట్ కారు అయినా లేదా లగ్జరీ కారు అయినా రీసేల్ వాల్యూ ముఖ్యమైనది. ఇది కారు వయస్సు, అది నడిచిన దూరంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా రీసేల్ వాల్యూపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే మరొక విషయం ఉంది. అది దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం. కాబట్టి మీకు కారు ఉంటే అది విక్రయించినప్పుడల్లా మంచి ధర పొందాలని మీరు కోరుకుంటారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ వాహనానికి మంచి రీసేల్ వాల్యూ లభిస్తుంది.
మీ కారును జాగ్రత్తగా మెయింటెయిన్ చేయండి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, టైర్ రొటేషన్ గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ కారు సర్వీస్ రికార్డులను జాగ్రత్తగా ఉంచండి. తద్వారా మీరు కారును సరిగ్గా చూసుకున్నారని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా కారును ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. ఇంటీరియర్‌ను శుభ్రంగా ఉంచాలి. వాహనం నీట్‌గా ఉంటే దాని విలువ అంత తక్కువ తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ ఉండండి
మీరు మీ కారులో ఏదైనా చిన్న లేదా పెద్ద రిపేర్‌ను గమనించినట్లయితే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వీలైనంత త్వరగా దాన్ని సరిదిద్దండి. కారును ఎల్లప్పుడూ మంచి స్థితిలో మెయింటెయిన్ చేస్తూ ఉండండి.
మైలేజీ గురించి బాధ పడకండి
చాలా సార్లు కారు యజమానులు ఎక్కువ మైలేజీని పొందడానికి ఇంజిన్‌ను ట్యూన్ చేస్తారు. దీని కారణంగా ఇంజిన్ బలహీనంగా మారుతుంది. అందువల్ల మైలేజీ గురించి చింతించకండి. తద్వారా మీ కారు మంచి పనితీరును కనపరుస్తుంది. ఇది రీసేల్ వాల్యూను పెంచడానికి పని చేస్తుంది.
పేపర్లు కరెక్టుగా ఉండాలి
మీ వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లను సిద్ధంగా ఉంచండి. అది ఆర్సీ లేదా సర్వీస్ సర్టిఫికేట్ లేదా ఏదైనా సరే రెడీగా ఉంచుకోండి. దీన్ని విక్రయించేటప్పుడు కారు కరెక్టుగా ఉందని వినియోగదారులకు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. వేసవి, వర్షాకాలంలో ఉపయోగించిన కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ కారుకు మంచి ధరను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కారులో గీతలు, డెంట్‌లు, అప్హోల్స్టరీ డ్యామేజ్ వంటి చిన్న మరమ్మతులను వెంటనే రిపేర్ చేయాలి. తద్వారా మీ కారు మెరిసేలా కనిపిస్తుంది. కారులో ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా చెప్పడం మంచిది. తద్వారా కస్టమర్‌కు మీ మీద నమ్మకం పెరుగుతుంది.
మరోవైపు హ్యుందాయ్ ఐ20లో కంపెనీ కొత్త మోడల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా అందించారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను పాత ఐఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో కంపెనీ రీప్లేస్ చేసింది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial