Cheapest 5 Seater Electric Car:అత్యంత చవకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు ఏది? ధర నుంచి ఫీచర్ల వరకు అన్నీ తెలుసుకోండి!
Cheapest 5 Seater Electric Car:భారత్‌లో చవకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకోండి.

Cheapest 5-seater Electric Car Price in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. టాటా, హ్యుందాయ్, మహీంద్రాతో పాటు, ఇప్పుడు మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. చూస్తే, ఎలక్ట్రిక్ కార్ల ధర పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో పోలిస్తే ఎక్కువ, కానీ వాటిని నడపడానికి అయ్యే ఖర్చు తక్కువ. భారతీయ మార్కెట్లో చవకైన నుం;f ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అయితే భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏంటో మీకు తెలుసా, ఇక్కడ తెలుసుకోండి.
అత్యంత చవకైన 5-సీటర్ ఎలక్ట్రిక్ కారు
భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు Eva, కానీ ఈ EVలో ఇద్దరు పెద్దలు, ఒక పిల్లవాడు మాత్రమే ప్రయాణించగలరు. MG కామెట్ EV (MG Comet EV) భారతదేశంలో అత్యంత చవకైన 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు. కానీ మనం 5-సీటర్ విభాగంలో మాట్లాడితే, టాటా టియాగో EV (Tata Tiago EV) భారతదేశంలో అత్యంత చవకైన కారు. టాటా కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Tata Tiago EV శక్తి -రేంజ్
భారతీయ మార్కెట్లో టాటా టియాగో EVకు చెందిన 6 వేరియంట్‌లు ఉన్నాయి. ఈ కారు ఆరు రంగుల ఎంపికలతో మార్కెట్లో అందుబాటులో ఉంది. టియాగో EVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఒక ఛార్జింగ్‌లో 223 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని పేర్కొంది. ఈ బ్యాటరీ ప్యాక్ 45 kW పవర్‌ని, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాటా టియాగో EVలో 24 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎంపిక కూడా ఉంది, ఇది ఒక ఛార్జింగ్‌లో 293 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 55 kW పవర్‌ని 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు 5.7 సెకన్లలో 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకోగలదు.





















